michaeljackson Posted April 13, 2017 Report Share Posted April 13, 2017 హెచ్-1బి వీసాతో అమెరికాకు సం‘క్షేమం’! వాషింగ్టన్: హెచ్-1బి వర్క్ వీసా. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వార్తల్లో నిలుస్తున్న అంశం. ముఖ్యంగా భారతీయ ఐటీ వర్గాలకు అవసరమైన హెచ్-1బి వీసాలు మంజూరు చేయటం వల్ల అమెరికాలో నూతన ఆవిష్కరణలు, అక్కడివారి సంక్షేమాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నాయని ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వీసాల వల్ల అమెరికాకే మేలు జరుగుతుందని వెల్లడవడం విశేషం. అమెరికాలోని వివిధ కంపెనీల్లో విదేశీయులు తాత్కాలిక పనిచేసేందుకు హెచ్-1బీ వీసా అనుమతి ఇస్తుంది. ఏటా ఫెడరల్ ప్రభుత్వ పరిమిత సంఖ్యలో వీటిని మంజూరు చేస్తుంది. ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఈ వీసాల విషయంలో అక్కడి కంపెనీలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. వీటి వల్ల అమెరికన్ల ఉద్యోగాలకు నష్టం వాటిల్లితోందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని మిచిగన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు జాన్ బౌండ్, నికోలస్ మోర్లేస్‌లు అధ్యయనం చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలపై విదేశీ నిపుణుల ప్రభావం చాలా ఉందని వారు తేల్చారు. ముఖ్యంగా ఈ-కామర్స్ వ్యవస్థ వేళ్లూనుకున్న 1994-2001 మధ్య కాలాన్ని తీసుకుని వారు ఈ అధ్యయనం చేశారు. 90దశకంలో ఐటీకి నిపుణులకు బాగా డిమాండ్ ఉండటంతో హెచ్-1బీ వీసాలను అమెరికా మంజూరు చేసింది. అత్యున్నత నైపుణ్యాలు కలిగిన వారి వల్ల నూతన ఆవిష్కరణ విషయంలో సానుకూల ప్రభావం కనిపించిందని, మొత్తంగా అమెరికన్ల సంక్షేమానికి అది వూతం ఇచ్చిందని, అంతేకాకుండా ఐటీ రంగంలో స్థిరత్వానికి తోడ్పాటునందించిందని, శాన్‌డియోగో-కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన బౌండ్, మోర్సెల్, గౌరవ్ ఖన్నాలు గుర్తించారు. ఉత్పాదకతకు తక్కువ వ్యయం కావడంతో ముఖ్యంగా ఐటీ ఉత్పత్తులు 1.9శాతం నుంచి 2.5శాతం మధ్య ఉండటం వినియోగదారులకు లబ్ధి చేకూర్చింది. ఇది ఐటీ రంగ మూలాలపై ప్రభావం చూపింది. ఐటీ రంగం అభివృద్ధి కారణంగా అమెరికన్లు సైతం ఇతర ఉద్యోగాలకు మారడం తక్కువగానే ఉందని అధ్యయనం తెలిపింది. Quote Link to comment Share on other sites More sharing options...
Hitman Posted April 13, 2017 Report Share Posted April 13, 2017 k Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.