TampaChinnodu Posted April 15, 2017 Report Share Posted April 15, 2017 ఆ భవంతిలో గదులే లాకర్లు రూ.25 కోట్ల పాత నోట్లు.. రూ.10 కోట్ల కొత్త కరెన్సీ నిందితుడు బెంగళూరు మాజీ కార్పొరేటర్ నాగరాజ్ క్రికెట్ బెట్టింగ్, హత్యలు, నకిలీ కరెన్సీ ముద్రణ సహా ఎన్నో కేసులు తాళం వేసిన ఇంటి తలుపులు తెరచి లోనికి వెళ్లడానికి పోలీసులకు ఏకంగా 5 గంటల సమయం పట్టింది. మూడంతస్తుల భవంతిలో అయిదు గదులను నిందితుడు లాకర్లుగా చేసుకున్నాడు. ఒక గది తాళం పగలగొట్టి చూడగా సంచుల్లో నింపివుంచిన నగదు కనిపించింది. అక్కడే మరోవైపు నోట్ల కట్టలు దొంతరలు దొంతరలుగా పేర్చి ఉన్నాయి. పుస్తకాల అరల్లోనూ నోట్లు, స్థిరాస్తి పత్రాలే కనిపించాయి. ఏకంగా రూ.25కోట్ల పాత నోట్లు, రూ.10కోట్ల కొత్త నోట్లను, వందల కోట్ల విలువైన ఆస్తిపత్రాలను వారక్కడ స్వాధీనం చేసుకున్నారు. మరో నాలుగు లాకర్లను తెరవాల్సి ఉందని పోలీసులు తెలిపారు. బెంగళూరు(మల్లేశ్వరం), న్యూస్‌టుడే: ఒక అపహరణ కేసుకు సంబంధించి బెంగళూరులోని శ్రీరామపుర వార్డు మాజీ కార్పొరేటర్ వి.నాగరాజ్ నివాసంపై పోలీసులు శుక్రవారం దాడిచేసినప్పుడు ఈ నోట్లకట్టల నిలయం బయటపడింది. డిసెంబరు 30 వరకు భారీగా పాత నోట్ల మార్పిడితో పాటు, క్రికెట్ బెట్టింగ్, అపహరణ, హత్య, హత్యాయత్నాలతో పెద్ద మొత్తంలో నిందితుడు నగదు సమకూర్చుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ ప్రవీణ్‌సూద్ విలేకరులకు వివరించారు. బెట్టింగ్ నుంచి కిడ్నాపుల వరకూ.. దినేష్, ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తులతో కలిసి నాగరాజ్ క్రికెట్ బెట్టింగ్‌ను నిర్వహించేవాడు. ఆర్థిక లావాదేవీల్లో తలెత్తిన వివాదంలో ఏప్రిల్ 7న దినేష్‌ను నాగరాజ్ అపహరించాడు. అతని కుటుంబ సభ్యుల నుంచి రూ.50లక్షల నగదును గుంజి విడిచిపెట్టాడు. నాగరాజ్ వద్ద లైసెన్సు లేని తుపాకీ ఉందని హెణ్ణూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దినేష్ ప్రస్తావించాడు.శుక్రవారం నిందితుడి నివాసంలో సోదాచేయాలని దర్యాప్తు అధికారులు వెళ్లారు. గుర్తించిన నాగరాజ్ పక్కింటి మేడపైకెక్కి తప్పించుకున్నాడు. నకిలీ నోట్లను ముద్రణలోనూ.. నిందితుడు నాగరాజ్ తమిళనాడులోని ధర్మపురిలో నకిలీనోట్లను ముద్రించి బెంగళూరులో మార్పిడి చేస్తున్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. చెన్నై, ధర్మపురి ప్రాంతాలకు నిందితుడు పరారైనట్లు గుర్తించి గాలింపు తీవ్రం చేశారు. కర్ణాటకలోని ఇద్దరు మాజీ మంత్రులతో నాగరాజ్‌కు సన్నిహిత సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు అరెస్టయితే పెను కుంభకోణం వెలుగుచూసే అవకాశం ఉంది. Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted April 15, 2017 Report Share Posted April 15, 2017 idhi too mich kada....but Karnataka ministers tho links unnayi antunnadante, case will be closed soon anyway without any fuss BJP - bharath veluguthondhi... Quote Link to comment Share on other sites More sharing options...
ICANWIN Posted April 15, 2017 Report Share Posted April 15, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
JollyBoy Posted April 15, 2017 Report Share Posted April 15, 2017 aa keys kottesina life set aipoyedi Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted April 15, 2017 Author Report Share Posted April 15, 2017 old notes inka pettukuntunnaru endi janaalu. inka kooda convert sesukovachu ani confidence aa . Quote Link to comment Share on other sites More sharing options...
perugu_vada Posted April 15, 2017 Report Share Posted April 15, 2017 1 hour ago, reality said: idhi too mich kada....but Karnataka ministers tho links unnayi antunnadante, case will be closed soon anyway without any fuss BJP - bharath veluguthondhi... Karnataka fcuked up man, too much corruption Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.