Jump to content

ఆస్ట్రేలియా పౌరసత్వం కష్టమే!


JANASENA

Recommended Posts

1904brk146.jpg

కాన్‌బెర్రా: అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలో వచ్చినప్పటి నుంచి హెచ్‌-1బీ వీసాలపై నియంత్రణ, వలసలపై కఠిన వైఖరి అవలంభిస్తుండటంతో పలువురు భారతీయులు ఆస్ట్రేలియాపై దృష్టిసారించారు. అయితే ఆస్ట్రేలియాలోనూ ఆ దేశ ప్రధాని టర్న్‌బుల్‌ ఇమ్మిగ్రేషన్‌ విధానాన్ని కఠినతరం చేయడంతో ఆ దేశంలో స్థిరపడాలని ఆశిస్తున్న ఇతర దేశస్థులకు పలు అడ్డంకులు ఎదురుకానున్నాయి.

కొత్త నిబంధనలు ఇవే... 
* ఆస్ట్రేలియాలో పౌరసత్వం కోసంఒ దరఖాస్తు చేయాలనుకునేవారు నాలుగు సంవత్సరాలు వేచివుండాలి. ఇప్పటి వరకు ఆ వ్యవధి ఒక ఏడాది మాత్రమే ఉండటం గమనార్హం. 
* ఆంగ్లభాషలోనూ మంచి ప్రావీణ్యముండాలి. 
* ఆస్ట్రేలియా పౌరసత్వానికి సంబంధించి అర్హత పరీక్ష పాసు కావాల్సివుంటుంది. 
* ఆస్ట్రేలియా పౌరసత్వం పొందాలనుకునేవారు ఆ దేశ విలువలను గౌరవించడంతో పాటు సమాజంలో ఎలా మమేకమవుతారో అన్న అంశాలను అధ్యయనం చేస్తామని ప్రధాని టర్న్‌బుల్‌ ప్రకటించారు.

ఆస్ట్రేలియాకు ఇతర దేశాల నుంచి వచ్చే వారికి వీసాలను ఏటా లక్ష వరకు మంజూరు చేస్తుంటారు. అయితే యజమానులు ఈ వీసాలను దుర్వినియోగం చేస్తున్నట్టు ఆరోపణలు రావడంతో కఠినచర్యలు తీసుకుంటున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త నిబంధనలు తెచ్చినట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

వలసలకు వ్యతిరేకంగా... 
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో స్వల్పమెజార్టీతో విజయం సాధించిన టర్న్‌బుల్‌ నేతృత్వంలోని లిబరల్‌పార్టీ ఐరోపా, అమెరికాల్లో వలసలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని స్ఫూర్తిగా తీసుకుందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో పాటు దేశంలో పెరిగిపోతున్న ఆర్థికలోటు, తక్కువ వేతనాలు, నిరుద్యోగం... తదితర సవాళ్లు ప్రభుత్వం ముందు ఉండటం గమనార్హం. వీటినుంచి దృష్టి మళ్లించేందుకు వలస చట్టాలను కఠినతరం చేసిందని విమర్శలు వస్తున్నాయి.

అయితే రాజకీయ కోణంతోనే ప్రధాని ఈ చర్యలను చేపట్టారని కొందరు విశ్లేషించారు. పార్టీకి సంప్రదాయంగా ఉన్న ఓటుబ్యాంకు ఇతర రాజకీయపక్షాలకు మళ్లకుండా ఉండటంతో పాటు రాజకీయంగా ఎదిగేందుకు కొత్త సవరణలు ప్రతిపాదించినట్టు వారు వెల్లడించారు. ప్రతి ఏటా 210 దేశాల నుంచి 1,30,000 మంది ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటారు. వీరిపై కొత్త సవరణలు ప్రభావం చూపే అవకాశముంది.

Link to comment
Share on other sites

7 minutes ago, tennisluvr said:

 

Neeku parledu le idem affect avvadu family sponsorship undi kadaa

I am not applying with family sponsorship ...that has some restrictions .. Skilled Independent Subclass 189 applying 

Link to comment
Share on other sites

1 minute ago, ICANWIN said:

I am not applying with family sponsorship ...that has some restrictions .. Skilled Independent Subclass 189 applying 

Even in that, points add avuthayi neeku due to having close family members are residents there. 

Link to comment
Share on other sites

2 hours ago, tennisluvr said:

Even in that, points add avuthayi neeku due to having close family members are residents there. 

No bro family sponsor cheste adi PR avvadu TR ayitadi...Temporary Residency

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...