Jump to content

ee madhya eenadu vaadu vizag meedha baaga interest chupisthunnadu


BaabuBangaram

Recommended Posts

తెల్లారినా లేవమంటున్న విశాఖ వాసులు 
కళ్లు తెరిచేసరికి ఉదయం ఏడెనిమిది దాటుతోంది 
vsp-sty1a.jpg
ఒక విజేయుడి వెనుక.. 
ఒక పరాజయుడి వెనుక.. 
రెండు ప్రధాన తేడాలు కారణాలుగా మిగులుతున్నాయి. 
ఒకటి.. తెల్లవారే దినచర్య ప్రారంభించడం.. 
రెండు.. లేవగానే ఆ రోజు ప్రణాళికతో సిద్ధంగా ఉండటం.. 
ఇవి పాటించి ఒకరు విజేయులైతే.. నిర్లక్ష్యం చేసి మరొకరు పరాజయం పాలవుతుంటారు. ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేచినవారు ప్రపంచాల్నే శాసిస్తారని, 
ఆ రోజంతా వారిదే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ విశాఖలో.. ఎండ ఎదురొచ్చాక ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య నిద్ర లేచేవారే ఎక్కువ.
  విశాఖపట్నం: రాత్రి 10 దాటినా దుకాణాలు తెరిచే ఉంటాయి. ఉదయం 10 దాటినా చాలావరకు దుకాణాలు మూసే ఉంటాయి. ఇందుకు కారణంగా నిద్ర సమయాల్లో నగరంలో వచ్చిన పెనుమార్పుగా నిపుణులు భావిస్తున్నారు. విశాఖలో ఉన్న చాలామంది ఉద్యోగమో, వ్యాపారమో, ఇంకేదైనా ఉపాధో పొందుతూ జీవనం సాగించేవారే ఎక్కువ. కానీ నిపుణుల పరిశీలన ప్రకారం చాలావరకు మధ్య తరగతి కుటుంబాల నుంచి ఉన్నతశ్రేణి కుటుంబాలల్లో చాలా ఆలస్యంగా పడుకోవడం, ఆలస్యంగా నిద్రలేచే సంస్కృతి పెరుగుతోంది. వారు పడుకునేసరికి రాత్రి 11 దాటి అర్థరాత్రి 1గంట అవుతోంది. అదే నిద్రలేచే సరికి ఉదయం 7, 8 గంటలవుతోంది. మరికొందరు 9గంటలకూ లేచే పరిస్థితి కనిపిస్తోంది. నగరంలోని ప్రతీ 10 మందిలో కనీసం 5, 6గురు ఇదేస్థాయి జీవనశైలిని కనబరుస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెల్లవారుజామున 4, 5గంటలకు నిద్ర లేచేవారితో పోల్చితే.. వీరి రోజువారీ జీవనశైలి బాగా వెనకబడి ఉందని అంటున్నారు.

సమయం దొరికేదే అప్పుడు.. 
* అసలే ఆలస్యంగా లేస్తారు. టిఫిన్‌ కూడా సరిగా చేయరు. అంతా కంగారే. టైమయ్యింది.. అంటూ పరుగున ఉద్యోగానికో, వ్యాపారానికో వెళ్తుంటారు. సాయంత్రం తర్వాతగానీ వారి పని నుంచి విముక్తి దొరకడంలేదు. నిపుణుల పరిశీలన ప్రకారం.. అప్పుడే వీరికి కుటుంబంతో గడిపే సమయం ఉంటోంది.

* రాత్రి 7 గంటల తర్వాత.. షికారుకు వెళ్లడమో, షాపింగ్‌కి వెళ్లడమో చేస్తున్నారు. జీవితంలో ఏదీ మిస్‌ అవకూడదనే భావన ఇప్పుడు నగరవాసుల్లో బలంగా ఉంది. రాత్రి కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు, ఆనందంగా ఉందామనే ధోరణే కనిపిస్తోంది. ఇలా రాత్రి 10 దాటినా షాపింగ్‌లో ఉన్న కుటుంబాలూ పెరిగాయి. ఆ తర్వాత ఇంటికి రావడం 11 గంటలకు భోంచేయడం, సుమారు 12, ఒంటిగంట ప్రాంతంలో పడుకోవడం కనిపిస్తోంది.

* కొన్ని కుటుంబాల్లో రాత్రి పడుకునే ముందు సెల్‌ఫోన్‌లు చేతిలో ఉండాల్సిందే. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ అప్‌డేట్స్‌ని తీరిగ్గా చూసుకునేది అప్పుడుకదా అనే భావన చాలామందిలో ఉంది. వీరు రాత్రి 11.30గంటల సమయంలో పడుకునే పరిస్థితి వచ్చింది. ఇక క్లబ్‌లు, సెకండ్‌షో సినిమాలకు వెళ్లినవారి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

* సాధారణంగా ఆలస్యంగా నిద్రపోయేవారు రోజూ అదే అలవాటుగా పెట్టుకున్నారు. కంప్యూటర్‌ ముందు కూర్చోవడమో, లేకపోతే అలా ఇలా తిరుగుతూ ఫోన్లు మాట్లాడటమో.. ఇలా ఏదో ఒకటి చేయందే వారికి నిద్రపట్టదు.

* నగరంలో 30 నుంచి 40శాతం మందికి ఉదయాన్నే లేవాలనే తపన బలంగా ఉంది. సెల్‌ఫోనులో అలారమ్‌ పెట్టుకుని కూడా పడుకుంటున్నారు. కానీ తెల్లవారుజామున అది ఎంతమోగినా పట్టించుకోవడంలేదు. ‘స్నూజ్‌’ ఆప్షన్‌ నొక్కి తిరిగి పడుకుంటున్నారు.

* ఆలస్యంగా లేచేవారిలో ప్రణాళిక దెబ్బతింటోంది. ఎప్పుడూ కూర్చుని పనిచేసేవారు, పొగ తాగేవారు, ఆకుకూరలు పండ్లు తినని వారిలో ఈ తరహా ఇబ్బందులున్నట్లు చెబుతున్నారు.

* ఒత్తిడిలో ఉన్నవారు.. సరైన ప్రణాళిక లేనివారు.. ఒక నిర్థిష్ఠ లక్ష్యాలు లేనివారు తెల్లవారుజామునే లేవడానికి ఇష్టపడట్లేదు.

* ఇలా పలు కారణాల వల్ల ఉదయం కూడా చాలా ఆలస్యంగా నిద్రలేవడం నగరంలో కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. కానీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, రాత్రి షిఫ్ట్‌లు ఉన్నవారికి తెలవారే లేచే పరిస్థితి ఉండటంలేదని అంటున్నారు.

పెళ్లయ్యాక మరీ ఇబ్బంది.. 
పెళ్లయి, పిల్లలు పుట్టాక.. తెల్లవారుజామునే లేవడమనేది బాగా తగ్గిపోతోందనేది మరొక పరిశీలన. ఓపక్క వృత్తిని, మరోపక్క కుటుంబాన్ని సమతుల్యంగా చూడటంలో ఇబ్బందులు రావడంతో ఒత్తిళ్లు పెరగడం, మనస్పర్థలు రావడం కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. ఈ ప్రభావం కారణంగా ఆలస్యంగా నిద్రలేవడం, ఎక్కువ గంటలు పడుకోవడం కనిపిస్తోందని చెబుతున్నారు.

కరిగిపోయే ‘వారాంతం’! 
వారంతంలో సమయాన్ని ఏమాత్రం వృథా చేయకూడదని అనుకుంటారు. నగరవాసులూ అలాగే భావిస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం వారి ప్రణాళిక తప్పిపోతోంది. మిగిలిన రోజుల్లో పోల్చితే వారాంతం, సెలవు రోజుల్లోనే ఉదయం మరింత ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. నిద్ర లేచేసరికి ఉదయం 10 దాటుతోంది. ఇక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులైతే 11 అయినా లేవట్లేదనేది మరో పరిశీలన. ఈ ప్రభావం సెలవు తర్వాతి రోజు డ్యూటీ వెళ్లేముందు పడుతోంది. ఆ రోజు కూడా ఆలస్యంగా లేవడం.. డ్యూటీ అంటే ఒకింత కష్టంగా అనిపించడం యువతలో కనిపిస్తోంది.

చాలా మిస్‌ అవుతున్నారు బాస్‌! 
విశాఖ చాలా అందమైన నగరం. ఓ పక్క సముద్రం, నగరం చుట్టూ కొండలు.. కాలనీల్లో పచ్చటి పచ్చికలు, చెట్లు.. తెల్లవారుజామున వాతావరణం ఎంతో హత్తుకునేలా ఉంటుంది. ఆ ప్రకృతిలో ప్రశాంతత కనిపిస్తుంది, కాలుష్యమనేదే ఉండదు, ట్రాఫిక్‌ సమస్య ఉండదు, తాజా గాలి ఎంతో హాయినిచ్చేలా ఉంటుంది. వీటిమధ్య కాలనీల్లోని చెట్ల నుంచి పక్షుల కిలకిలారావాలు అద్భుత అనుభూతిని ఇస్తున్నాయి. ఇలాంటి ప్రకృతిని చాలా తక్కువమందే ఆస్వాదిస్తున్నారు. ఆలస్యంగా నిద్రలేచేవారందరూ ఇలాంటి అందాల్ని కోల్పోతున్నారని నిపుణులు అంటున్నారు.

4గంటలు బోనస్‌.. ప్రణాళికలు భేష్‌! 
నగరంలో తెల్లవారుజామున 4, 5 గంటలకు నిద్రలేచి వ్యాయామాలు లాంటివన్నీ ముగించి చక్కటి ప్రణాళికతో పలువురు దినచర్యను ప్రారంభిస్తున్నారని నిపుణులు అంటున్నారు. మిగిలినవారితో పోల్చిస్తే వీరికి రోజుకు కనీసం 4గంటలు అదనంగా కలిసొస్తోందని అంటున్నారు. పత్రికలు చదువుతూ, కాసేపు టీ కాఫీ తాగుతూ.. ఆ తర్వాత మెదడుకు పని చెబితే అద్భుతమైన ఆలోచనలు వస్తాయని, ఉద్యోగంలో చలాకీగా ఉంటారని వారంటున్నారు. లేవగానే వ్యాయామంతో పాటు యోగా, నడక చేస్తే ఆరోగ్యంతో పాటు ఉల్లాసమూ సాధ్యమవుతోందని అంటున్నారు.

మారే మార్గం ఉంది.. 
ఉదయాన్నే నిద్ర లేవాలంటే ముందురోజు రాత్రి త్వరగా పడుకోవాలనేది సహజంగా వచ్చే సమాధానం. ఇది కేవలం మాటలతో అయ్యేది కాదనేది చాలామందికి తెలిసిన సత్యం. మరి ముందుగానే పడుకుని, తెల్లవారకముందే లేవడానికి కొంత కసరత్తు చేయాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

1. రాత్రి 9.30, 10గంటలలోపే పడుకునేలా బలంగా అనుకోవాలి. అంతకుముందే సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌లను దూరంగా ఉంచేయాలి.

2. తెల్లవారుజామున లేచి ఏమేం చేయాలనేది ఒక పేపర్‌మీద రాసిపెట్టుకోవాలి.

3. పడుకునే కొద్దిసేపటి ముందు కొంతసేపు నడకసాగిస్తే ఆ రోజు ఉన్న ఒత్తిడి దూరమవుతుంది. ఇతర ఆలోచనలూ ఉండవు.

4. స్నానం చేసి.. శుద్ధి నీరు (చల్లగా వద్దు) తాగి నిద్రపోయేందుకు సిద్ధమవ్వాలి.

5. నిద్రపోయేటప్పుడు గదిలో వెలుతురు లేకుంటేనే మంచిది.

6. పడుకునే బెడ్‌ సౌకర్యవంతంగా ఉండేలా.. శరీరానికి చల్లటి గాలి తగిలేలా వాతావరణాన్ని కల్పించుకోవాలి.

7. తెల్లవారుజామున నిద్ర లేవడానికి అలారమ్‌ పెట్టుకోవాలి. ఒక అలారమ్‌తో లేవడం కష్టమనుకుంటే వేర్వేరు సల్ప వ్యవధి సమయాల్లో పలు అలారమ్‌లు పెట్టుకోవచ్చు.

తల్లిదండ్రులే నేర్పాలి.. 
ఇప్పుడు పిల్లలకు సెలవులు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి అలవాట్లు నేర్పేందుకు ఇదే మంచి సమయంగా నిపుణులు సలహా ఇస్తున్నారు. తెల్లవారుజామునే లేచి.. చక్కటి ప్రణాళికతో రోజును మొదలుపెట్టేలా అలవాటు చేయాలని సూచిస్తున్నారు. దీనికన్నా ముందు తల్లిదండ్రులే వాటిని పాటిస్తూ తమ పిల్లలను పక్కన కూర్చోబెట్టుకుని సవివరంగా చెప్పాలని అంటున్నారు. ఏ సమయంలో ఏం చేయాలనేది స్పష్టంగా వారికి అర్థమయ్యేలా చూపించాలని అంటున్నారు.

తపన ఉంటే శరీరం సహకరిస్తుంది 
- ప్రొఫెసర్‌ నిర్మలాదేవి, మనస్తత్వశాస్త్ర విభాగం, ఏయూ 
ఉదయం పనిచేయడానికి, రాత్రి విశ్రాంతి తీసుకోవడానికే ఈ సృష్టి ఇలా అవతరించింది. కానీ ఇప్పుడు నగరంలో దీనికి విరుద్ధంగా నడుస్తోంది. తెల్లవారగానే లేచి వ్యాయామం, యోగాతో ముందుకెళ్తే షుగర్‌, బీపీ, థైరాయిడ్‌ స్థాయిలు సాధారణం అవుతాయి. ఆకలి బాగుంటుంది. ఆ సమయంలో మెదడు అద్భుతమైన ఆలోచనల్ని అందిస్తుంది. ఇవి పాటించిన ప్రతీ ఒక్కరూ విజేతలే. ఒకేసారి ఇది సాధ్యంకాకపోవచ్చు. కానీ కచ్చితంగా వారం రోజుల్లో దీన్నో అలవాటుగా చేసుకుంటారు.

 
Link to comment
Share on other sites

20 minutes ago, lazybugger said:

ramoji emanna 10k acres konnnademo bheemli pakkana.

ramoji time aipoindamma...repo mapo annatu vundi babu time...successors kuda leru...babu ki emanna avuthe, Ramoji group antha oka 10 divisions avutadi although wholly owned subsidary of NTR trust bhavan avutadi...

He is out of the business..

Link to comment
Share on other sites

19 minutes ago, Android_Halwa said:

ramoji time aipoindamma...repo mapo annatu vundi babu time...successors kuda leru...babu ki emanna avuthe, Ramoji group antha oka 10 divisions avutadi although wholly owned subsidary of NTR trust bhavan avutadi...

He is out of the business..

Ramoji has no heirs aa? :3D_Smiles:

Link to comment
Share on other sites

7 minutes ago, lazybugger said:

Ramoji has no heirs aa? :3D_Smiles:

Ramoji has heirs but second gen was completely screwed up gen..the thrid gen has 2-3 hopefuls but time will only tell...they mostly have been out of India and when the times comes to rein the business based in India, they might not be as successful as their grand dad as they can barely understand the politics...

Eventually, Ramoji group would be taken over by somebody and these three grand daughters will become shareholders...just like brahmini and lokesh...

 

Link to comment
Share on other sites

3 hours ago, Android_Halwa said:

ramoji time aipoindamma...repo mapo annatu vundi babu time...successors kuda leru...babu ki emanna avuthe, Ramoji group antha oka 10 divisions avutadi although wholly owned subsidary of NTR trust bhavan avutadi...

He is out of the business..

Bold :

uiy.gif

ETV network all channels owned by RIL.

Margadarshi already Kodalu running

Ushakiran movies solely owned by ramoji

Eenadu  solely owned by ramoji

inka Brisah, Priya foods anni partership Kodukulu manavallu already ee business lo vunnaru.....

Just now found that eenadu newspaper first started in Visakhapatnam

 

Link to comment
Share on other sites

3 hours ago, lazybugger said:

ramoji emanna 10k acres konnnademo bheemli pakkana.

eenadu paper first started in Vizag andhukenemo

Link to comment
Share on other sites

30 minutes ago, BaabuBangaram said:

Bold :

uiy.gif

ETV network all channels owned by RIL.

Margadarshi already Kodalu running

Ushakiran movies solely owned by ramoji

Eenadu  solely owned by ramoji

inka Brisah, Priya foods anni partership Kodukulu manavallu already ee business lo vunnaru.....

Just now found that eenadu newspaper first started in Visakhapatnam

 

ushakiran movies aa...max 1cr aa budget..and etv lo latest movie ye year di ..2011?$%^

Link to comment
Share on other sites

4 minutes ago, NinduChandurudu said:

ushakiran movies aa...max 1cr aa budget..and etv lo latest movie ye year di ..2011?$%^

last year sandeep kishan dhi oka movie vachhindhi kadha

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...