Jump to content

తెలుగు మహాసభలు 10 రోజులు - Mukkodi good job


ParmQ

Recommended Posts

636296293249505359.jpg
  • వేదిక నగరంలోని హెచ్‌ఐసీసీ..
  • సభల్లో తెలంగాణ ఘనత చాటి చెబుదాం
  • భాషాభివృద్ధి, సాహితీ వికాసానికి ఎందరో మహానుభావుల కృషి
  • వారందరినీ ఆహ్వానిద్దాం.. గౌరవిద్దాం.. స్మరించుకుందాం
  • ఏపీతోపాటు ప్రపంచం నలుమూలల నుంచీ ఆహ్వానిద్దాం: సీఎం
హైదరాబాద్‌ మే 5 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలుగు భాషాభివృద్ధికి, సాహితీ వికాసానికి తెలంగాణకు చెందిన ఎందరో మహానుభావులు విశేష కృషి చేశారు. అన్ని సాహిత్య ప్రక్రియల్లో తెలంగాణ వారు విశేష ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. పోతన నుంచి మొదలుకుంటే.. ఆధునిక సాహిత్యం వరకూ అనేక రచనలు చేసిన వారు ఉన్నారు. ఎన్నో సాహిత్య ప్రక్రియలను సుసంపన్నం చేసిన వారు ఉన్నారు. వారందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. సంప్రదాయ సాహిత్యం, అవధాన సాహిత్యం, ఆధునిక సాహిత్యంలో తెలంగాణ వ్యక్తులు చేసిన కృషి తెలిసేలా తెలుగు మహా సభలు నిర్వహించాలి’’ అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలుగు భాష, సాహిత్యాభివృద్ధికి తెలంగాణలో జరిగిన కృషి ప్రపంచానికి తెలిసేలా నిర్వహించాలన్నారు. ఈ రంగాల్లో విశేష కృషి చేసిన వారిని గౌరవించాలని, ఇందుకు తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తోపాటు ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రముఖులను ఆహ్వానించాలని స్పష్టం చేశారు.
 
 
ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ సన్నాహక సమావేశం శుక్రవారం ప్రగతి భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, సినీ, పాత్రికేయ రంగం, కథా రచన, నవలా రచన, కవిత్వం, హరికథ, బుర్రకథ, యక్షగానం, చందోబద్ధమైన ప్రక్రియలు.. తదితర అంశాల్లో తెలంగాణ సాహితీమూర్తులు ప్రదర్శించిన ప్రతిభా పాటవాలు ప్రధానాంశాలుగా తెలుగు మహాసభలు జరగాలని సూచించారు. రాష్ట్ర ఆవిర్భావ దినమైన జూన్‌ 2న హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో మహాసభల అంకురార్పణ జరపాలన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాహితీ ప్రముఖులు, తెలుగు పండితులను ఆహ్వానించాలని సూచించారు. ప్రారంభ సభకు వచ్చిన పండితులకు ఆన్‌ డ్యూటీ అవకాశం ఇవ్వడంతోపాటు రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించాలన్నారు. అంకురార్పణ సభ తర్వాత వారం, పది రోజులపాటు సభలు నిర్వహించాలన్నారు. పగటి పూట సభలు, సదస్సులు, రాత్రి సమయంలో పేరిణీ నృత్యంతోపాటు వివిధ కళా రూపాలు ప్రదర్శించాలన్నారు. కవి సమ్మేళనాలు, సాహిత్య గోష్టులు, అవధానాలు, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, కవితా పోటీలు నిర్వహించాలన్నారు. తెలంగాణ ప్రముఖులు రాసిన వ్యాసాలు, సాహిత్య రచనలు ముద్రించాలన్నారు. ఏపీతోపాటు ముంబై, సూరత్‌, భివండీ, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, సోలాపూర్‌, ఒడిసా తదితర ప్రాంతాల్లో కూడా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న వారు ఉన్నారని, వారందరినీ మహాసభలకు ఆహ్వానించాలని సూచించారు. అమెరికా, యూరప్‌, ఆస్ర్టేలియా, న్యూజిలాండ్‌, సింగపూర్‌, మలేసియా, గల్ఫ్‌ తదితర దేశాల్లో తెలుగు భాషా, సాహిత్యానికి సేవలను అందిస్తున్న వ్యక్తులు, సంస్థలనూ భాగస్వాములను చేయాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, జి.వివేక్‌, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌, తెలుగు వర్సిటీ వీసీ సత్యనారాయణ, అంతర్జాతీయ తెలుగు సమాఖ్య డైరెక్టర్‌ మునిరత్నంనాయుడు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

tank bund meda unna statues anni pagala kottinappudu emindhi ee telivii ee langa gadiki @3$%

Link to comment
Share on other sites

8 minutes ago, solman said:

tank bund meda unna statues anni pagala kottinappudu emindhi ee telivii ee langa gadiki @3$%

Pettinollaki leni telivi pagalakottetoniki enduku

Link to comment
Share on other sites

10 hours ago, solman said:

tank bund meda unna statues anni pagala kottinappudu emindhi ee telivii ee langa gadiki @3$%

 That's for sheep, man. I like KCR the shepard, he knows what is needed for his sheep and can move them accordingly. Telugu thalli ki against ga Telanga thalli ani pettaadu. Evaru adagaledhu, ippudu kooda emanaru  @3$%

Link to comment
Share on other sites

32 minutes ago, tom bhayya said:

telugu just language dhaaniki antha importance avasaram ledhu ani halwa maama cheppamannadu

How about Telugu jathi?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...