Jump to content

Endho janalu


BaabuBangaram

Recommended Posts

మద్యం మత్తులో.. 185 కి.మీ. వేగంతో.. 
వృద్ధుడ్ని కారుతో ఢీకొట్టి చంపిన యువకుడు 
అనంతరం కారును ముక్కలుగా చేసి.. తప్పించుకునే యత్నం 
తండ్రిని చంపిన నిందితుడ్ని శోధించి పట్టుకున్న సీఐ

గచ్చిబౌలి: దేశం కోసం పోరాడిన మాజీ సైనికుడాయన.. రోజూలాగానే ఉదయపు నడకకు వెళ్లి.. ఇంటికి శవమై వచ్చారు.. కారణం రాజధానిలోని పబ్‌ల్లో తప్పతాగిన ఓ యువకుడు మద్యం మత్తులో మితిమీరిన వేగంతో కారు నడిపి.. వెనక నుంచి ఢీకొట్టి ఆ విశ్రాంత సైనికుడిప్రాణాలు బలిగొన్నాడు.. యువకుడి నిర్లక్ష్యానికి బలైన ఆ యోధుడి కుమారుడు సర్కిల్‌ఇన్‌స్పెక్టర్‌. నెలరోజులపాటు శోధించి తన తండ్రిని చంపిన హంతకుడ్ని పట్టుకున్నారు. హైదరాబాద్‌లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్‌లు యువకులను విచక్షణ కోల్పోయేలా ఎలా మారుస్తున్నాయో తెలిపే సంఘటన ఇది.

అసలేం జరిగిదంటే..: దేవదానం(72) అనేక ఏళ్లపాటు సైన్యంలో పనిచేశారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ యుద్ధాల్లో కూడా పాల్గొన్నారు. అనేక సత్కారాలు అందుకున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత ఆయన గచ్చిబౌలిలోని తన కుమారుడి(సీఐ) ఇంట్లో ఉంటున్నారు. దేవదానానికి రోజూ తెల్లవారుజామున 4.30 గంటలకే లేచి గంటపాటు నడవడం అలవాటు. ఇటీవల ఆయన రోజూలాగానే గచ్చిబౌలి దర్గా దగ్గర నడుస్తుండగా.. 185 కి.మీ. వేగంతో వచ్చిన కారు వెనక నుంచి ఢీకొట్టడంతో ఆయన తీవ్రగాయాలతో రోడ్డు పక్కన పడిపోయారు. ఢీకొట్టిన వ్యక్తి కనీసం వెనక్కి చూడకుండా వెళ్లిపోయాడు. విషయం తెలిసిన కుమారుడు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పటికే ఆయన మృతి చెందారు. తన తండ్రిని ఓ వాహనం ఢీకొట్టిందంటూ రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆధారాలు దొరక్క కేసు విచారణ ముందుకు కదల్లేదు.

శోధించి.. సాధించాడు..: హైదరాబాద్‌ నేర పరిశోధనా విభాగంలో సీఐగా పని చేస్తున్న ఆయన.. తన తండ్రిని చంపిన హంతుకుడ్ని ఎలాగైనా పట్టుకోవాలని నిశ్చయించుకున్నారు. స్వయంగా రంగంలోకి దిగి.. ఆ రోడ్డులోని 150 సీసీ కెమెరాల నుంచి ఫీడ్‌ తీసుకున్నారు. ఫోర్డ్‌ ఫిగో ఢీకొట్టిందని ప్రాథమికంగా తెలియడంతో కెమెరాల ఫీడ్‌ ఆధారంగా వందలసంఖ్యలో ఉన్న ఫిగో కారు నెంబర్లను సంపాదించారు. వాటిలో ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన కార్లను గుర్తించారు. చివరకు మూడు కార్లను అనుమానించారు. ఆ మూడింట్లో ఆరోజు అత్యంత వేగంగా ప్రయాణించిన కారు ఏదన్నది తెలుసుకున్నారు. కారు వివరాలను తీసుకొని విచారిస్తే ఆ కారుతోనే తన తండ్రిని ఢీకొట్టి చంపాడని తేలింది.

ఘటన జరిగిందిలా..: సికింద్రాబాద్‌కు చెందిన ప్రశాంత్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి. దేవదానాన్ని ఢీకొట్టిన రోజు రాత్రి రెండు పబ్‌ల్లో తప్పతాగాడు. ఒక పబ్‌లో అర్ధరాత్రి 12 గంటలు దాటేవరకు, మరో పబ్‌లో తెల్లవారుజామున 2.30 గంటల వరకు విపరీతంగా తాగినట్లు విచారణలో తేలింది. అతనితో పాటు ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఆ మత్తులోనే గచ్చిబౌలిలో రోడ్డుపక్కన హోటల్‌లో ఇడ్లీలు తిని.. ఇద్దరమ్మాయిలతో కలిసి కారులో 5 గంటల సమయంలో బయల్దేరాడు. దాదాపు 185 కి.మీ. వేగంతో వెళుతూ దేవదానాన్ని ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన తర్వాత కారును ముక్కలుముక్కలుగా విడగొట్టి షెడ్డులో పెట్టాడు.

రూ.10 వేల మద్యం తాగేశాడు..: నిందితుని గురించి తెలిసిన తర్వాత సీఐ.. పబ్‌లకు వెళ్లి విచారిస్తే రెండింటిలో కలిపి రూ.10 వేల విలువైన మద్యం తాగినట్లు తేలింది. తెల్లవారుజామున 2.30 గంటల వరకు తాగడంతో పాటు విపరీతంగా డాన్సులు చేసిన సీసీ ఫుటేజ్‌లను కూడా సేకరించారు. చివరికి అతన్ని అరెస్టు చేశారు. తండ్రి ఆత్మకుశాంతి చేకూర్చాలని భావించిన తాను డీసీపీ మొహంతి తోడ్పాటుతో స్వయంగా కేసును పరిశోధించి నిందితుడ్ని పట్టుకోగలిగానని సీఐ తెలిపారు. నిందితుడు అనేక నెలలుగా క్రెడిట్‌ కార్డులపై తప్పతాగుతుంటే తండ్రి ఆ బిల్లులను కడుతున్నట్లు తన పరిశీలనలో తేలిందన్నారు.

Link to comment
Share on other sites

1 minute ago, ICANWIN said:

Alcohol ban pettali daridram vadultundi..$s@d

rules strict ga imlement chesthey antha set aithaaru, corruption valla thappu chesina lite aney confidence tho thiruguthunnaru public

Link to comment
Share on other sites

1 minute ago, tom bhayya said:

rules strict ga imlement chesthey antha set aithaaru, corruption valla thappu chesina lite aney confidence tho thiruguthunnaru public

Agree totally.  rich ppl  ki india lo law varthinchadu ade big problem but that's hard to change.

Link to comment
Share on other sites

5 minutes ago, ICANWIN said:

Agree totally.  rich ppl  ki india lo law varthinchadu ade big problem but that's hard to change.

Rich people valle kada politicians paiki vastaru

Link to comment
Share on other sites

Just now, Prabhas_Fan said:

Rich people valle kada politicians paiki vastaru

It's like that in every country no including US? Ayina common man is protected right? India highly corrupted sadly :(

Link to comment
Share on other sites

13 minutes ago, ICANWIN said:

It's like that in every country no including US? Ayina common man is protected right? India highly corrupted sadly :(

Yes we can't do anything...janaale change avvali...vote vesetappudu think chesi vote veyyali adi jaragani pani

Link to comment
Share on other sites

3 minutes ago, Prabhas_Fan said:

Yes we can't do anything...janaale change avvali...vote vesetappudu think chesi vote veyyali adi jaragani pani

Evariki veyali ? andaru anthe ga? Leader lanti cinemalu chusi anandapadali anthe. 

Link to comment
Share on other sites

mari saamanyulaki ki kuda ilaage work cheyali. so tht crime chesinavaadiki bhayam vuntundhi

 cheyali anna thought pothundi

aina 500 max ki uber vasthundi kadha..why kakkurthi driving

Link to comment
Share on other sites

10 minutes ago, chicchara said:

mari saamanyulaki ki kuda ilaage work cheyali. so tht crime chesinavaadiki bhayam vuntundhi

 cheyali anna thought pothundi

aina 500 max ki uber vasthundi kadha..why kakkurthi driving

eamanna ante, kick antaru edavalu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...