Jump to content

కేడి గాడి కేడి బుద్ధులు


DiscoKing

Recommended Posts

ప్రెస్ కి ఒక లెటర్ ఇచ్చాడు.. లోపల ప్రధానికి ఇచ్చింది వేరే లెటర్, తరువాత ఫుట్ మసాజ్, సాష్టాంగ నమస్కారం 

@3$% 

C_1MTZkV0AEMuPA.jpg

C_1MUKpUIAA2ACa.jpg

Link to comment
Share on other sites

idantha sollu. sakshi lo em raledu...Maata Tappani Madama tippani vamsam lo puttina Jagan anna oka malle puvvu lanti tella chokka type

 

17s2p0.gif

 

 

Link to comment
Share on other sites

40 minutes ago, psycopk said:

vadu AP problems gurinchi.. velladu ante.. vadi wife/amma kuda nammadu... denine musugulo guddulata antaru...

 

5 hours ago, Muney said:

Intended for the present to the great still lifeboat to the great dtilllifd ?

 

Link to comment
Share on other sites

భూమిపై స్వర్గాన్ని నిర్మిస్తాం 
స్టార్టప్‌ ప్రాంత పనులు వేగంగా ప్రారంభించండి 
సింగపూర్‌ సంస్థల కన్సార్షియానికి సీఎం సూచన 
ప్రధాన అభివృద్ధిదారుగా ఎంపిక చేస్తూ పత్రం అందజేత 
ఆంధ్రప్రదేశ్‌, సింగపూర్‌ ప్రభుత్వాల మధ్య ఎంఓయూపై చంద్రబాబు, ఈశ్వరన్‌ సంతకం 
ఈనాడు - అమరావతి 
15ap-main1a.jpg

రాజధానికి అమరావతి అని పేరు పెట్టినప్పుడు అందరి ఆమోదం లభించింది. అమరావతి అంటే దేవతల రాజధాని. అందుకే భూమి మీదో మరో స్వర్గాన్ని, బ్రహ్మండమైన నగరాన్ని నిర్మించుకుంటాం. ప్రపంచంలోని 5 అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలనేది నా లక్ష్యం. ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే అమరావతి నుంచి వచ్చాం అని గర్వంగా చెప్పేటట్టు ఉండాలి.

- ముఖ్యమంత్రి చంద్రబాబు

15ap-main1b.jpgఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అంకుర (స్టార్టప్‌) ప్రాంత అభివృద్ధికి తొలి అడుగుపడింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సింగపూర్‌ ప్రభుత్వాల మధ్య సోమవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్‌ సంతకాలు చేశారు. స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధికి అవసరమైన ఎంపిక ధ్రువీకరణ, అంగీకార పత్రాల బదలాయింపు జరిగింది.

అసెండస్‌-సింగ్‌బ్రిడ్జ్‌, సెంబ్‌కార్ప్‌ రెండూ సింగపూర్‌ ప్రభుత్వ కంపెనీలే. వాటిలో 74.77 శాతం వాటా ప్రభుత్వానిదే. అత్యంత నీతివంతమైన, పైసా అవినీతి జరగదని ప్రపంచమంతా చర్చించుకునే దేశం సింగపూర్‌. అలాంటి దేశంతో ఒప్పందం చేసుకోవడం, వారి సంస్థలు ఇక్కడికి రావడం చాలా సంతోషం. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు మొత్తం పూర్తయితే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3364 కోట్లు, సింగపూర్‌ కంపెనీలకు రూ.1105 కోట్లు లభిస్తాయి. ఆ లెక్కన మన రాష్ట్ర ప్రభుత్వానికి 75 శాతం, సింగపూర్‌ ప్రభుత్వ కంపెనీలకు 25 శాతం వాటా లభిస్తుంది. 1.25 లక్షల కుటుంబాలు ఇక్కడ నివసించేందుకు అవకాశం ఏర్పడుతుంది. 2.50 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.8 వేల- రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుంది.

15ap-main1c.jpg

బాహుబలి సినిమా చరిత్ర సృష్టించింది. అలా అమరావతి కూడా మరో బాహుబలి కావాలి. ప్రపంచమంతా మన రాజధానిపై చర్చించాలి. సినిమా తీయడానికే మూడు, నాలుగేళ్లు పట్టింది. అలాంటిది రాజధాని నగరం నిర్మాణం కావాలంటే చాలా సమయం పడుతుంది. ఎంతమంది అడ్డం పడినా ధైర్యంగా ముందుకెళ్తున్నా. ప్రజలు సహకరించినంత వరకూ, వారి ఆశీస్సులు ఉన్నంత వరకూ ఎవరూ నన్నేమి చేయలేరు.

- చంద్రబాబు

అత్యున్నత ప్రమాణాలు కలిగిన నివాస, వాణిజ్య, ప్రజా సదుపాయాలు వస్తాయి. అమరావతిని నివాసానికి అత్యంత అనుకూలమైన ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం.

- సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌

రాజధాని అమరావతిలోని కేంద్ర రాజధాని ప్రాంతంలో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి పనులను వేగంగా మొదలుపెట్టాలని, వచ్చే ఎన్నికల నాటికి పురోగతి కనిపించాలని సింగపూర్‌ సంస్థల కన్సార్షియానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. సింగపూర్‌లో 55 ఏళ్లుగా ఒకే ప్రభుత్వం ఉందని, తాము మరో రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లాల్సి ఉందని తెలిపారు. 1691 ఎకరాల్లో స్టార్టప్‌ ప్రాంత ప్రధాన అభివృద్ధిదారుగా ఎంపికైన సింగపూర్‌కి చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థల కన్సార్షియానికి ‘ఎంపిక ధ్రువీకరణ పత్రం’ (లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌) అందజేసే కార్యక్రమం సోమవారం విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో చంద్రబాబు, సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌ సమక్షంలో జరిగింది. సింగపూర్‌ కన్సార్షియం ప్రతినిధులకు సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ‘ఎంపిక ధ్రువీకరణ పత్రం’ (లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌) అందజేశారు. వారి నుంచి ఆయన ‘అంగీకార పత్రం’ (లెటర్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్స్‌) అందుకున్నారు. ఇదే వేదికపై ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థికాభివృద్ధి, స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి, సామర్థ్యాల పెంపునకు అవసరమైన సహకారం, సంస్థాగత, సాంకేతిక సహకారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సింగపూర్‌ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. దీనిపై చంద్రబాబు, ఈశ్వరన్‌ సంతకాలు చేశారు. అమరావతిని నవ నగరాలుగా నిర్మిస్తున్నామని, వాటికి వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు, డెవలపర్లను ఆకర్షించే దిశగా స్టార్టప్‌ ప్రాంతంలో అవసరమైన మౌలిక వసతుల్ని సింగపూర్‌ సంస్థల కన్సార్షియం, ఏడీసీల భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే ఏడీపీ సమకూరుస్తుందని సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక ప్రాధాన్యతల్ని అర్ధం చేసుకుని, కీలకపాత్ర నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ విజన్‌-2029’ని అధ్యయనం చేయాలని సింగపూర్‌ సంస్థలకు ఆయన సూచించారు. సింగపూర్‌ వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు చెందిన 20 మంది ప్రతినిధుల బృందం ఈ సమావేశంలో పాల్గొంది.

15ap-main1d.jpg

దేవుడే నన్ను ఆదేశించాడు 
‘‘ఏడాది కిందటే మొదలుకావాల్సిన రాజధాని ప్రాంత స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు...కొంతమంది అడ్డంకులు సృష్టించడంతో ఆలస్యమైంది. న్యాయస్థానాలకు వెళ్లడం, పదే పదే ఆటంకాలు కల్పించడం, అవినీతి ఆరోపణలు చెయ్యడంతో విలువైన ఏడాది సమయాన్ని కోల్పోయాం. సంకల్పబలం గట్టిగా ఉండటంతో మళ్లీ ఈ ప్రాజెక్టును ప్రారంభించగలిగాం...’’అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు.ఎన్నికల ప్రచారంలో సింగపూర్‌ లాంటి రాజధాని నగరాన్ని నిర్మిస్తానని చెబితే కొందరు ఎగతాళి చేశారని, మరికొందరు అది సాధ్యమా? అని అనుమానం వ్యక్తం చేశారని, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఇప్పుడు ఆ కలను సాకారం చేస్తున్నామని చెప్పారు. రైతుల త్యాగంతోనే ఇది సాధ్యపడిందన్నారు. గుంటూరు జిల్లా మందడంలో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టుకు సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ....అప్పట్లో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లకు తోడు సైబరాబాద్‌ను నిర్మించానని, మళ్లీ ఇప్పుడు అమరావతిని నిర్మించమని ఆ దేవుడే తనను ఆదేశించాడన్నారు. రాజధాని అభివృద్ధి చేస్తామని ముందుకొచ్చే ప్రభుత్వాలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు సింగపూర్‌ కంపెనీల తరహాలో భూమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

గౌరవంగా భావిస్తా: ఈశ్వరన్‌ 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలసి పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్‌ తెలిపారు. చంద్రబాబునాయుడు కలలు కంటున్న ప్రజా రాజధాని నిర్మాణానికి సింగపూర్‌ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు.

నిధుల సమీకరణకు నవమార్గాలు 
అమరావతి అభివృద్ధి, నిర్వహణ విషయంలో తొమ్మిది తరహాల్లో నిధులు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూమి తనఖా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులు, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఎన్‌డీబీ క్యాపిటల్‌ లిమిటెడ్‌ వంటి సంస్థల నుంచి వివిధ రూపాల్లో నిధుల సమీకరణ, పబ్లిక్‌, ప్రయివేటు భాగస్వామ్యం ద్వారా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. బీమా వంటి సంస్థల నుంచి దేశీయ రుణ సమీకరణ, పెన్షన్‌ నిధులు, ఇన్‌ఫ్రా నిధుల వంటి ఈక్విటీ ఫండ్ల ద్వారా నిధుల సమీకరణ, అంతర్జాతీయంగా రుణాల సమీకరణ, ఎన్‌ఆర్‌ఐ బాండ్లు, గ్రీన్‌ బాండ్లు, మసాలా బాండ్ల ద్వారా నిధులు సమీకరించి అమరావతిని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

15ap-main1e.jpg

ఇతర దేశాల సహకారం 
ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిని తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇతర దేశాల సహాయ సహకారాలు తీసుకుంటోంది. ప్రస్తుతం సింగపూర్‌ ప్రభుత్వంతో రాజధాని స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం ఇతర దేశాల సహాయసహకారాలు అందిపుచ్చుకుంటామని పేర్కొంటోంది. మొత్తం 8 దేశాలను ఇందులో వివిధ అంశాల్లో భాగస్వాములను చేయాలని ప్రతిపాదిస్తోంది.

సింగపూర్‌: మాస్టర్‌ ప్రణాళికలు, విజ్ఞానం బదలాయింపు

మలేషియా: పెర్‌ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌, గృహ నిర్మాణ ప్రాజెక్టులు

జపాన్‌: రవాణాకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ భవనాల సముదాయాల ఆకృతుల రూపకల్పన, వరద నియంత్రణ వ్యవస్థ, పరిశ్రమలు

చైనా: పారిశ్రామిక పార్కు అభివృద్ధి, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, విద్యుత్తు సరఫరా, పంపిణీ, భవన నిర్మాణ సామగ్రి తయారీ పార్కు

యునైటెడ్‌ కింగ్‌డమ్‌: స్మార్ట్‌ నగరాల అభివృద్ధి, ఆరోగ్య సంక్షేమం, విజ్ఞాన బదలాయింపు

డెన్మార్క్‌: వ్యర్థ పదార్థాల నిర్వహణ, శుభ్రతకు సంబంధించిన టెక్నాలజీ, స్మార్ట్‌ పాలన,

నెదర్లాండ్స్‌: నదీ ముఖ అభివృద్ధి, సైక్లింగ్‌ ట్రాక్‌ల నిర్మాణంలో సహకారం

కజకిస్థాన్‌: సంయుక్త భాగస్వామ్యం, ఆస్థానాతో సోదర నగర భాగస్వామ్యం, 


రూ.3 వేల కోట్ల పెట్టుబడి 
అసెండాస్‌ సింగ్‌బ్రిడ్జి సీఈఓ సంజయ్‌దత్‌

వ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించబోయే ‘స్టార్టప్‌ ఏరియా’ కోసం 15ఏళ్లలో మొత్తం రూ.3వేల కోట్ల భారీ పెట్టుబడి పెడుతున్నట్లు అసెండాస్‌ సింగ్‌బ్రిడ్జి ముఖ్య కార్యనిర్వహణాధికారి సంజయ్‌దత్‌ తెలిపారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలను వివరించారు. ‘‘ ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేస్తాం. మాకున్న అనుభవజ్ఞులు, స్థానికంగా లభించే నైపుణ్యాలను ఉపయోగించుకుని అవసరమైన మౌలికసదుపాయలు కల్పిస్తాం. ముందుగా స్థానికంగా ఎదురయ్యే సవాళ్లు, ఉన్న సానుకూలతను అధ్యయనం చేస్తాం. ఇక్కడికి వచ్చే స్టార్టప్‌ సంస్థల ద్వారా కూడా పెట్టుబడులు వస్తాయి. వ్యాపార సంస్థలు, ఇతర సంస్థలు, విదేశాల్లోని వ్యాపార సంస్థలు అందర్నీ ఆకర్షించేలా ఈ స్టార్టప్‌ ఏరియాను అభివృద్ధి చేయాలనేది మా సంకల్పం...’’ అని ఆయన వివరించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...