Jump to content

ఈ వైద్యులు.. కిడ్నాప్లూ చేస్తారు!


TampaChinnodu

Recommended Posts

విజయవాడ: విజయవాడ నగరంలో దారుణం వెలుగు చూసింది. నగరానికి చెందిన బ్రహ్మాజి అనే వడ్డీ వ్యాపారిని కొందరు వైద్యులు కిడ్నాప్‌ చేసి చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పటమట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఎండీ సహా మరో ఆరుగురు పేరొందిన వైద్యులు ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధితుడిని నగర శివారులోని ఓ మామిడి తోటలోకి తీసుకెళ్లి అక్కడ చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. తప్పించుకున్న బాధితుడు పటమట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనపై దాడి చేసిన వైద్యులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పోలీసులను కోరాడు.
దీనిపై వెంటనే కేసు నమోదు చేయకుండా పటమట సీఐ కెన్నడి జాప్యం చేసినట్లు తెలిసింది. కొందరు రాజకీయ నేతలు రంగంలోకి దిగి సెటిల్‌మెంట్‌ చేసేందుకు యత్నించగా... అందుకు సీఐ సహకరించినట్లు సమాచారం. ఘటనపై బాధితుడు నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌కు ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా కేసు నమోదు చేయడం సహా దాడికి పాల్పడిన వారిని పోలీసులు రక్షించే ప్రయత్నం చేసినట్లు బాధితుడు తెలిపారు. ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీపీ.. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంపై పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు. పోలీసు అధికారుల ప్రమేయం ఉందని నిర్ధరణ కావడంతో పటమట సీఐ కెన్నడీని వీఆర్‌కు పంపడం సహా సరైన పర్యవేక్షణ చేయలేదన్న కారణంతో సెంట్రల్‌ ఏసీపీ సత్యానందంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు ఓ ఛానల్‌ విలేకరి ప్రయత్నించినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఘటన వెనుక నగరంలో పేరు మోసిన వైద్యులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వీరిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...