BaabuBangaram Posted May 23, 2017 Report Share Posted May 23, 2017 జంగారెడ్డిగూడేనికి చెందిన యువతీ యువకులు ప్రేమించుకున్నారు. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పెద్దలను ఎదిరించి కొన్నాళ్లు వేరేగా కాపురం ఉన్నారు. తదుపరి భర్త చిత్రహింసలు పెట్టడంతో అతనిని వదిలేసి తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది ఆ యువతి. ఏలూరుకు చెందిన యువతి హైదరాబాద్‌లో చదువుకుంటూ ఒక ఉద్యోగిని ప్రేమించింది. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకుంది. ఆ జంట కాపురం మొదలుపెట్టారు. ఏడాదిలోగా ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగాయి. హింసించడం మొదలుపెట్టాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో అతడికి అంతకుముందే మరో పెళ్ళి జరిగిందనే విషయం బయటపడింది. తాడేపల్లిగూడేనికి చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని కోనసీమకు చెందిన ఓ పారిశ్రామికవేత్త కుమార్తె ప్రేమించింది. పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నారు. మనస్పర్థల కారణంగా వారిద్దరూ ఇప్పుడు వేర్వేరుగా ఉంటున్నారు.(Idhi edho ma inti daggara jarigina matter la vundhe) నల్లజర్ల: కళాశాల చదువుల్లో.. అంతా కొత్త బంగారులోకంలా కనిపిస్తుంది.. మొగ్గ తొడిగిన యవ్వనంలో.. క్షణక్షణం వూహల్లో తేలిపోతుంటారు!! సినిమాల్లో... కథానాయకుడు, కథనాయికల్లా ఉండాలని ఆరాటపడతారు. ప్రేమించాలని తపన పడతారు. తెలిసీతెలియని వయసులో ఆకర్షణను ప్రేమ అనుకుంటారు. ఇక్కడే కొందరు యువకులు మేకవన్నె పులుల్లా యువతుల వెంట పడతారు. ప్రేమించాం అంటారు.. పెళ్లి చేసుకుందామని చెబుతారు.. అవసరమైతే పెద్దలని ఎదిరిద్దామంటారు.. అంతే వారి మాయమాటల్ని నమ్మి.. పెద్దలను ఎదిరించి అతడ్ని వరిస్తుంది!! కొన్నాళ్ళకు మనస్పర్థలు, గొడవలు. చివరికి ఎటువంటి ఆధారాలు లేకుండా చేసి ముఖం చాటేస్తాడు. అతని నిజ నైజం తెలిసి ఆమె నివ్వెరపోతుంది. ఇలా ప్రేమ పేరుతో ఎందరో యువతుల జీవితాల్లో ‘ప్రేమకథలు’ విచిత్రాలై విషాదం నింపుతున్నాయి. ఇలాంటి సంఘటనలు జిల్లాలో నిత్యం ఏదోమూలన జరుగుతూనే ఉన్నాయి. తల్లిదండ్రులను ఎదిరించి.. ప్రేమించిన వాడిని నమ్మి వారి చేతిలో మోసపోతున్న వారి సంఖ్య జిల్లాలో క్రమేణా పెరుగుతోంది. జిల్లావ్యాప్తంగా ఈ సంఖ్య నెలకు వందల్లో ఉంటోంది. నిత్యం ప్రతి పోలీస్‌స్టేషన్‌ను కనీసం ఒక్క జంటైనా తక్కువ కాకుండా ఆశ్రయిస్తున్నారు. మనసిచ్చి మనువాడినవాడు మోజు తీరగానే వెళ్లగొట్టడంతో అటు తల్లిదండ్రుల చెంతకు వెళ్లలేక.. ఇటు బతకలేక చావే శరణ్యం అంటూ పోలీసులను ఆశ్రయించేవారు పెరుగుతున్నారు. ఈ సంఖ్య జిల్లాలో నెలకు 80 వరకూ ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ పెళ్లి చేసుకుని పెద్దల బారి నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను కోరుతూ వస్తున్న యువతుల్లో ఎక్కువమంది కొన్ని నెలల్లోనే భర్త మోసగించాడంటూ.. న్యాయం చేయండని ఆశ్రయించడం గమనార్హం. వీరి సంఖ్య 70 వరకూ ఉంటుంది. ఇక భర్తకు మునుపే పెళ్లయిందని వచ్చే వారి సంఖ్య 40 ఉంటుంది. పెళ్ళి చేసుకుంటానని గర్భవతిని చేసి మోసగించాడంటూ వచ్చే యువతుల సంఖ్య 60 దాటుతుంది. ఇటు కుటుంబంలోని ఒక ఆడపిల్ల ప్రేమ పేరుతో మరొకడితో వెళ్లిపోవడం.. మరోవైపు మిగిలిన ఆడపిల్లలకు పెళ్లి ఎలా చేయాలో తెలియక అవమానభారంతో తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులూ అనేకమంది. పెళ్లికి ముందే కౌన్సెలింగ్ అవసరం అది ప్రేమ పెళ్లి అయినా.. పెద్దలు కుదిర్చిన వివాహమైనా యువతీ యువకులు మూడు నుంచి నాలుగుసార్లు కుటుంబ కౌన్సెలింగ్ కేంద్రాల్లో కౌన్సెలింగ్ తీసుకోవాలి. పరస్పరం పూర్తిస్థాయిలో అర్థం చేసుకున్నాకే పెళ్లి చేసుకోవాలి. ప్రేమించుకుని పెళ్లి చేసుకుని కొన్ని నెలల తరువాత విడాకుల కోసం పోలీసులను, కోర్టులను ఆశ్రయిస్తున్నారు. యువతీయువకులు ఈ రకంగా తయారవ్వడానికి ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడకపోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. - మల్లిపూడి కనకదుర్గ, ధీర కుటుంబ కౌన్సెలింగ్ కేంద్రం, తాడేపల్లిగూడెం ఆకర్షణను ప్రేమగా భావిస్తున్నారు 20 ఏళ్ల లోపు యువత ఆకర్షణను ప్రేమగా భావిస్తున్నారు. ప్రేమించడం తప్పుకాదు. దాని పేరుతో యువతుల జీవితాలతో ఆడుకుంటున్న మేకవన్నె పులులున్నాయనే విషయాన్ని గమనించాలి. విద్యార్థులు చదువులో ఒక లక్ష్యం పెట్టుకోవాలి. దానిని సాధించి తమ కాళ్లపై తాము నిలబడిగలిగిననాడు ప్రేమ పెళ్లి గురించి ఆలోచించవచ్చు. అది కూడా పెద్దల అంగీకారంతో చేసుకుంటే మంచిది. - నున్న మురళీకృష్ణ, ఇన్‌ఛార్జి డీఎస్పీ, కొవ్వూరు Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.