JANASENA Posted May 23, 2017 Report Share Posted May 23, 2017 ఒక్కోసారి మన పక్కన ఉండే వస్తువులు, వ్యక్తుల విలువ మనకు తెలియదు. వాటి గొప్పదనాన్ని కూడా గుర్తించలేం. అలాగే లండన్‌కి చెందిన ఓ మహిళ 30 ఏళ్లకు పైగా వజ్రపుటుంగరాన్ని చేతికి పెట్టుకొని తిరిగింది. కానీ అది వజ్రమని మాత్రం తెలుసుకోలేకపోయింది. వెస్ట్ లండన్‌లోని ఇస్లెవర్త్‌కి చెందిన ఓ మహిళ 1980లో వెస్ట్ మిడిల్‌సెక్స్ హాస్పిటల్ సమీపంలో జరిగిన కార్‌బూట్ సేల్(సంత)లో దాదాపు రూ.840 చెల్లించి రాయితో పొదగబడిన ఉంగరాన్ని కొనుగోలు చేసింది. అయితే అది మామూలు రాయి కాదని.. అసలు సిసలైన వజ్రమని ఆమెకు అప్పుడు తెలియదు. దీంతో అప్పట్నుంచి ఆ ఉంగరాన్ని తన చేతికే పెట్టుకొని ఉండేది. తాజాగా ఆ మహిళ ఉంగరాన్ని సౌత్‌బైస్ ఆక్షన్ హౌస్‌కి తీసుకెళ్లింది. ఆ ఉంగరంలో పొదగబడిన రాయిపై అనుమానంతో పరీక్షించిన ఆ సంస్థ దాన్ని వజ్రంగా నిర్ధరించింది. ఆ వజ్రం విలువ సుమారు రూ.3 కోట్ల వరకు ఉంటుందని సౌత్‌బైస్ ఆక్షన్ సంస్థ తెలిపింది. దీంతో ఆ మహిళ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కాకపోతే తన వివరాలను బహిర్గతం చేసేందుకు ఆ మహిళ నిరాకరించినట్లు ఆ సంస్థ తెలిపింది. సౌత్‌బైస్ ఆక్షన్ సంస్థలోని జ్యువెల్లరీ విభాగం ప్రధానాధికారి జెస్సికా వింధం మాట్లాడుతూ.. ‘‘ 19వ శతాబ్దంలో ఈ వజ్రాన్ని రూపొందించారు. ఈ వజ్రం మెరవకుండా ఉండేందుకు ప్రాచీన పద్ధతుల్లో దీన్ని కత్తిరించారు. దీంతో ఈ వజ్రాన్ని చూసిన ఎవరైనా మామాలూ రాయిగానే పొరబడతారు. అలాగే ఆ మహిళ కూడా ముప్పై ఏళ్లుగా సాధారణ రాయిగానే పొరపాటు పడింది. కాకపోతే ఈ వజ్రం ఆ కార్‌బూట్ సేల్‌కి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు’ అని చెప్పింది. Quote Link to comment Share on other sites More sharing options...
fake_Bezawada Posted May 23, 2017 Report Share Posted May 23, 2017 wow samma article naku alantidi dorikithe bavundu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.