Jump to content

మళ్లీ తెలంగాణ ఈసెట్!


BaabuBangaram

Recommended Posts

ఎన్ని కేంద్రాల్లో పరీక్షలు రాసిన వారికన్నది త్వరలో ఖరారు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఈ నెల 6న నిర్వహించిన ఈసెట్‌ను మళ్లీ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. తొలిసారిగా ఆన్‌లైన్‌లో పరీక్ష జరిపారు. సాంకేతిక సమస్యలతో ప్రశ్నపత్రం డౌన్‌లోడ్‌ కాకపోవడంతో ఆ రోజు 10 గంటల వరకు పరీక్ష జరిగింది. తీవ్ర ఇబ్బందుల మధ్యే విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ నెల 20న ఫలితాలు విడుదల చేశారు. కాగా పలువురు విద్యార్థులకు మార్కులు తగ్గిపోయాయి. తాము 200 ప్రశ్నలకు జవాబులు గుర్తించగా 50-60 ప్రశ్నలకే జవాబులు గుర్తించినట్లు ఓఎంఆర్‌ పత్రంలో చూపిస్తోందని పలువురు అభ్యర్థులు సోమవారం జేఎన్‌టీయూహెచ్‌ వద్ద ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థులు మొత్తం ప్రశ్నలకు జవాబులు గుర్తించినా కంప్యూటర్‌ మాత్రం కొన్నింటినే తీసుకొని ఉంటుందని అధికారులూ భావిస్తున్నారు. ఇలాంటి సమస్య ఎన్ని కేంద్రాల్లో రాసిన వారికి వచ్చిందో జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. దీనిపై ఈసెట్‌ ఛైర్మన్‌, జేఎన్‌టీయూహెచ్‌ ఉపకులపతి వేణుగోపాల్‌రెడ్డిని వివరణ కోరగా ఎంత మందికి మార్కుల్లో అన్యాయం జరిగిందో అధ్యయనం చేస్తున్నామని, కనీసం 200 మంది ఉండొచ్చని ఆయన తెలిపారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...