icecreamZ Posted May 24, 2017 Report Share Posted May 24, 2017 విశాఖ: ఓ హత్యకేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావుకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేటలో 2007లో జరిగిన ఓ హత్యకేసులో మాజీ ఎమ్మెల్యే సహా 15 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అనకాపల్లి సెషన్స్ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఐదుగురు మహిళలకు రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో పోలీసులు మొత్తం 24 మందిని నిందితులుగా చేర్చగా.. వారిలో ముగ్గురు వివిధ కారణాలతో మృతిచెందారు. 2007లో బీచ్ మినరల్స్ కంపెనీ ఏర్పాటు విషయమై బంగారమ్మపేటలో వివాదం చెలరేగింది. మత్స్యకారులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆ సమయంలో పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న చెంగల వెంకటరావు కంపెనీని వ్యతిరేకిస్తున్న వారితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కంపెనీ ఏర్పాటుకు అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో పూసాల కొండ అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. గతంలో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున ఎమ్మెల్యేగా పనిచేసిన చెంగల.. 2014 ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీచేసి ఓటమిపాలయ్యారు. Quote Link to comment Share on other sites More sharing options...
icecreamZ Posted May 24, 2017 Author Report Share Posted May 24, 2017 Chengala Venkata Rao, producer of the blockbuster movie Samarasimha Reddy starring Bala krishna and the recently released Narasimhudu has attempted suicide by jumping into the hussain sagar river while travelling by the tank bund road in the morning along with his brother Chengala Hara nath. The police who were around at the time rescued him and moved him to KIMS hospital. Narasimhudu movie was released amidst lot of trouble with the financiers. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.