Jump to content

రూ.10వేల కోట్ల భూకుంభకోణం


TampaChinnodu

Recommended Posts

రూ.10వేల కోట్ల భూకుంభకోణం 
మియాపూర్‌లో 693 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్‌ 
రూ.వేల కోట్ల వ్యాపారం లక్ష్యంగా దందా 
ప్రభుత్వ శాఖల తీరుపై అనుమానాలు 
రూ.587.11 కోట్ల నష్టం వాటిల్లినట్లు పోలీసుల అంచనా 
సబ్‌రిజిస్ట్రార్‌ శ్రీనివాసరావు, మరో ఇద్దరు నిందితుల అరెస్టు 
ఈనాడు - హైదరాబాద్‌ 
28hyd-general5b.jpg

మియాపూర్‌లో వెలుగుచూసిన ప్రభుత్వ, ప్రైవేటు భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణం రూ.వేల కోట్లలో ఉన్నట్లు తేలింది. మొత్తం 693.04 ఎకరాలను పక్కదారి పట్టించినట్లు ప్రస్తుతం గుర్తించారు. ఈ భూముల మళ్లింపు ద్వారా ప్రభుత్వానికి రూ.587.11 కోట్లు నష్టం వాటిల్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. వాస్తవానికి బహిరంగ మార్కెట్లో ఈ విలువ రూ.10వేల కోట్లు ఉంటుందని అంచనా. ఈ కుంభకోణంలో ఇంకా ఎవరున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి పోలీసులు సబ్‌రిజిస్ట్రార్‌ రాచకొండ శ్రీనివాస్‌రావుతోపాటు ఇద్దరిని అరెస్టు చేశారు. భారీ స్థాయిలో జరిగిన అక్రమం వెనక మరికొందరు కీలక వ్యక్తులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

స్థిరాస్తి దందా.. 
హైదరాబాద్‌ నగరంలోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా(ప్రస్తుతం మేడ్చల్‌)లోని శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లో భూముల ధర ఎకరం సుమారు రూ.14.5 కోట్లు పలుకుతోంది. దీంతో ఖాళీ స్థలాలపై అక్రమార్కులు దృష్టి పెట్టారు. ఎకరాకు దాదాపు రూ.2 కోట్లు ముడుపుల రూపంలో సమర్పించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నట్లు సమాచారం. మియాపూర్‌లోని 100, 101, 20, 28 సర్వే నెంబర్లలోని 693.04 ఎకరాల భూమిని దక్కించుకునే క్రమంలో రూ.వందల కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ప్రముఖ స్థిరాస్తి వ్యాపార సంస్థలు ఈ కుంభకోణంలో ఉన్నట్లు పోలీసుల విచారణలో ఇప్పటికే తేలింది. మరికొన్ని సంస్థల వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కూకట్‌పల్లి సబ్‌రిజిస్ట్రారు నేతృత్వంలో ఈ రిజిస్ట్రేషన్లు జరిగినప్పటికీ ఆ శాఖతోపాటు, రెవెన్యూ శాఖలకు చెందిన పలువురి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

అక్రమార్జనే ధ్యేయంగా.. 
ప్రభుత్వ భూముల్లో రియల్‌ దందా వ్యూహంగా సాగిన కుంభకోణంలో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. అధికారిక ధర ప్రకారమే రూ.587.11 కోట్లు పెట్టుబడి పెట్టిన వ్యక్తుల వ్యూహాన్ని అంచనా వేస్తే గుండె గుభేల్‌మనాల్సిందే. మియాపూర్‌ పరిసరాల్లో గజం స్థలం విలువ మార్కెట్‌లో రూ.30 వేలకు పైగా పలుకుతోంది. ఎకరా సరాసరి విలువ రూ.14.5 కోట్లు, కొన్నిచోట్ల రూ.20 కోట్లకుపైగా పలుకుతోంది. మియాపూర్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతోపాటు సమీపంలోనే మెట్రో రైలు డిపో రావడంతో భూముల ధర విపరీతంగా పెరిగిపోతోంది. ఇందులో భాగంగానే అక్రమం బయటకు పొక్కకుండా తెలివిగా బుక్‌-2 కింద చూపి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు తెలుస్తోంది.

నిబంధనలు తుంగలో తొక్కి.. 
దేవాదాయ, వక్ఫ్‌, ఇనాం, అసైన్డ్‌, సిపాయిలకు కేటాయించిన భూములతోపాటు ప్రభుత్వ భూముల వివరాలు ప్రతి రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈ మేరకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. మియాపూర్‌లోని 100, 101, 20, 28 సర్వే నెంబర్లలోని భూములు ప్రభుత్వ భూములని 2007 మార్చి 30న ఒకసారి, 2011లో మరోసారి శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్‌ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖకు మెమో కూడా జారీచేశారు. అయినా యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేసేశారు.

ఇలా చేశారు.. 
మియాపూర్‌ భూముల కుంభకోణం అంతా పక్కా వ్యూహం ప్రకారం జరిగింది. ఒక్కో సర్వే నెంబరులో 200 ఎకరాల పైగా భూములను ఒకేసారి రిజిస్టర్‌ చేసేశారు. 101 సర్వే నెంబరులో 231 ఎకరాలను 472/4/2016 నెంబర్‌తో రిజిస్టర్‌ చేశారు. 100 సర్వే నెంబరులో 207 ఎకరాలను 475/4/2016 నెంబరుతో; 20వ సర్వే నెంబరులో 109.18 ఎకరాలను 474/4/2016; 28వ సర్వే నెంబరులో 145.26 ఎకరాలను 475/4/2016 డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్‌ చేశారు. మొత్తంగా నాలుగు సర్వే నెంబర్లలోని 693.04 ఎకరాలకు 2016లో అక్రమంగా రిజిస్ట్రేషన్‌ పూర్తయినట్లు తేలింది.

28hyd-general5a.jpg

పోలీసుల ప్రాథమిక నివేదికలో మరికొందరు 
మియాపూర్‌ భూముల కుంభకోణంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు సబ్‌రిజిస్ట్రారు రాచకొండ శ్రీనివాస్‌రావు, స్థిరాస్తి వ్యాపార సంస్థల ప్రతినిధులు పీవీఎస్‌ శర్మ, పీఎస్‌ పార్థసారథిలను అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో మరికొందరు స్థిరాస్తి వ్యాపారులు, సంస్థలు ఉన్నట్లు కూడా పేర్కొన్నారు. వీరిలో ట్రినిటీ ఇన్‌ఫ్రా డైరెక్టర్లు ఇంద్రాణి ప్రసాద్‌, మహితా క్యాడల్‌, గోల్డ్‌స్టోన్‌ ఇన్‌ఫ్రాటెక్‌ సివిల్‌ ఇంజినీరు సయ్యద్‌ రఫీయుద్దీన్‌, డీజీఎం అకౌంట్స్‌ సత్యనారాయణ, మహ్మద్‌ ఇంతియాజ్‌ పాషా, పేరి వెంకటరామ్మూర్తితోపాటు కొన్ని కంపెనీలు, వ్యక్తుల పేర్లను చేర్చారు. వీరితోపాటు మరికొందరు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ సందర్భంగా కొన్ని వివరాలు తెలిసినట్లు తెలుస్తోంది. మరోవైపు పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల ఆచూకీ తెలపాలంటూ సంబంధీకులు హైకోర్టులో శనివారం హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కానీ, పోలీసులు అరెస్టు చేసినట్లు చూపడంతో కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో నిందితులను ఆదివారం కూకట్‌పల్లి సివిల్‌ కోర్టుముందు హాజరుపరిచారు. తదనంతర విచారణకోసం పోలీసులు పదిరోజుల కస్టడీకి పిటిషన్‌ వేశారు.

పాత్రధారులు సరే.. సూత్రధారులేరీ?
క్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం అంత తేలికగా జరిగిందేమీ కాదని అర్థమవుతోంది. భూముల గుట్టంతా రెవెన్యూ శాఖ వద్ద ఉన్నప్పటికీ వందల ఎకరాలు రిజిస్ట్రేషన్‌ అయిపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మియాపూర్‌లోని ఆయా సర్వే నెంబర్లపై ఎన్నో ఏళ్లనుంచి కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అవి ప్రభుత్వ భూములేనని అందరికీ తెలిసినా.. వాటి సంరక్షణ బాధ్యతను ఎందుకు విస్మరించారన్నది ప్రశ్నార్థకంగా మారింది. భూములను కాపాడుకోవాల్సిన రెవెన్యూశాఖ నిష్క్రియాపరత్వం వెనక ఎవరున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలోనూ ఈ అక్రమం ప్రకంపనలు సృష్టిస్తోంది.

 

Link to comment
Share on other sites

  • Replies 55
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    26

  • ParmQ

    6

  • just2deal

    5

  • reality

    4

13 minutes ago, idibezwada said:

Andhrolla kutra

deeniki tag line enduku bro. TG ina AP ina same story. Asusual big heads ni cover sesesi evaro small fish ni pattukunnaru.

Link to comment
Share on other sites

1 hour ago, idibezwada said:

Andhrolla kutra

LOL..do you now the real story ?

Soem so called habitual  Andhra scammers (of Goldstone Infra) have managed to register govt land on their names illgeally..They thought that will manage it just as tehy did in United AP govt...but failed and got caught

No mercy to looters and scammer..be it TG ,AP or TN

Link to comment
Share on other sites

1 minute ago, just2deal said:

LOL..do you now the real story ?

Soem so called habitual  Andhra scammers (of Goldstone Infra) have managed to register govt land on their names illgeally..They thought that will manage it just as tehy did in United AP govt...but failed and got caught

No mercy to looters and scammer..be it TG ,AP or TN

Evari baapathu ee goldstone infra

Link to comment
Share on other sites

Just now, TOM_BHAYYA said:

Idhe AP lo jarugunte jagananna chese rachha antha intha undedhi kadhu

In this what is govt role ..when a thief is caught ?

Unless if some one in Govt helped (lets see if it comes out)

Link to comment
Share on other sites

27 minutes ago, just2deal said:

LOL..do you now the real story ?

Soem so called habitual  Andhra scammers (of Goldstone Infra) have managed to register govt land on their names illgeally..They thought that will manage it just as tehy did in United AP govt...but failed and got caught

No mercy to looters and scammer..be it TG ,AP or TN

Provide more info.

Link to comment
Share on other sites

20 minutes ago, just2deal said:

In this what is govt role ..when a thief is caught ?

Unless if some one in Govt helped (lets see if it comes out)

Did I say anything about gov role? Jaggu will use it for political benifit antunna if it happens in AP.. anna ki anyaayam jarigithe chalu ..

Link to comment
Share on other sites

1 hour ago, TOM_BHAYYA said:

Did I say anything about gov role? Jaggu will use it for political benifit antunna if it happens in AP.. anna ki anyaayam jarigithe chalu ..

urko thata maro @LOKESH thammudu anukoni

Link to comment
Share on other sites

3 hours ago, ParmQ said:
Mr. K.S.Sarma Chairman
Mr. V.Venkata Ramana Member
Mr. Clinton Travis Caddell Member
Ms.Janaki Kondapi  

I couldn't get an idea whom it belongs. Throw some light man.

 

This guy https://en.wikipedia.org/wiki/Ponnapula_Sanjeeva_Prasad

is the mastermind and a known scammer who scammed a big bank in US and absconded to India a decade back

His brother Ponnapula Sanjeeva Parthasarathy,is the MD of the company (now arrested and in police custody)

...and don't need to mention where all these scammers are from @idibezwada 

checks the pics..chances are they may be your far relatives

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...