TampaChinnodu Posted May 30, 2017 Author Report Share Posted May 30, 2017 1 hour ago, harvey said: papam super plan bust ayyindhi. aa registrar gaadu already oka saari suspend ayyi malli ade job ki back vachadu political connections tho. main accused USA ne mosam chesi 30 years nundi India lo raja laa living. bust ina vallani lopata veyyatam doubt ee. future lo aa lands vallave ani court ruling ichina i wont be surprised. Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted May 30, 2017 Author Report Share Posted May 30, 2017 మరో ఇద్దరు సబ్‌రిజిస్ట్రార్‌ల సస్పెన్షన్ హైదరాబాద్: మియాపూర్ భూముల కుంభకోణం రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రర్ శ్రీనివాసరావు సస్పెన్షన్‌కు గురికాగా క్రిమినల్ చర్యల్లో భాగంగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా ఇదే తరహాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు సబ్ రిజిస్ట్రర్ల పైనా వేటు పడింది. బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ యూసుఫ్, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రమేష్ చంద్రారెడ్డిలను కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యూసుఫ్, రమేష్‌చంద్రారెడ్డిలను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరితోపాటు రాష్ట్రంలో మరికొంత మంది సబ్ రిజిస్ట్రార్‌లపైనా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. మరికొంత మంది సబ్ రిజిస్ట్రార్‌లను సస్పెన్షన్ చేయడంతోపాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted May 31, 2017 Author Report Share Posted May 31, 2017 Hyderabad: The Crime Investigation Department will take over the investigations into the Miyapur land scam on the orders of the Telangana state Government. Businessman P.S. Prasad’s wife Indrani Prasad and his daughter Mahitha Caddel have been named in the FIR. The complicity of more government officials has come to light and police on Tuesday registered cases against Balanagar sub-registrar Mohammed Yousuf and Medchal sub-registrar Ramesh Chandra Reddy. The scam was originally regarding 693 acres of government land illegally transferred to private firms. Three men likely to get bail The two sub-registrars booked on Tuesday had allegedly helped to transfer another 119 acres (in two other survey numbers) to the companies. The Cyberabad police received new complaints against these two officials from the district registrar N. Saidi Reddy alleging their involvement. According to the report filed by the Cyberabad police in a local court, businessman P.S. Prasad’s wife Indrani Prasad and his daughter Mahitha Caddel have been named in the FIR as fifth and sixth accused. Investigating officers say that both the women are listed as absconding and teams have been dispatched to arrest them. “They are nowhere to be seen in Hyderabad. We have mentioned them as absconding in the report,” said Madhapur DCP Vishwa Prasad. A local court rejected the police petition to take custody of the three men. Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted May 31, 2017 Author Report Share Posted May 31, 2017 ee Goldstone Prasad evado kaani Mallaya ki thatha laa vunnadu. Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted May 31, 2017 Author Report Share Posted May 31, 2017 ఇంతకీ గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ఎక్కడ? Sakshi | Updated: May 31, 2017 18:09 (IST) హైదరాబాద్ : మియాపూర్ భూ కుంభకోణం కేసు విస్తృతి రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తం రూ. 10వేల కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు ఇప్పటివరకు గుర్తించారు. అయితే ఈ కేసులో మొత్తం అక్రమాలకు సూత్రధారి అయిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ మాత్రం ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడు. అతడి కోసం 8 ప్రత్యేక బృందాలతో గాలింపు జరుపుతున్నారు. భూకుంభకోణం మొత్తం ఇతడి కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. తన భార్య ఇంద్రాణి, కోడలు మహిత, ఇతర కుటుంబ సభ్యుల పేర్లతో మొత్తం వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములను గోల్డ్‌స్టోన్ ప్రసాద్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు గుర్తించారు. కుంభకోణం వెలుగులోకి రాగానే అతడు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లాడు. అతడి భార్య ఇంద్రాణి, కోడలు మహితలపై కూడా కేసులు నమోదయ్యాయి. ట్రినిటీ, సువిశాల సంస్థలలో డైరెక్టర్లంతా ప్రసాద్ కుటుంబ సభ్యులేనని తెలుస్తోంది. గోల్డ్ స్టోన్ ప్రధాన కార్యాయలంలోనే ఈ రెండు సంస్థలు ఉన్నాయి. మెట్రో సంస్థ చెల్లించే పరిహారం కోసమే గోల్డ్‌స్టోన్ భూములను రిజిస్టర్ చేయించుకున్నట్లు తెలిసింది. అమీరున్నీసా బేగంకు రూ. 10 లక్షలు మాత్రమే ఇచ్చి భూమి రిజిస్టర్ చేయించుకున్నారు. అలాగే సబ్ రిజిస్ట్రార్లకు రూ. 50 కోట్ల వరకు లంచం ఇచ్చి 693 ఎకరాలు రిజిస్టర్ చేయించుకున్నారు. ప్రధాన నగరాల్లో ప్రసాద్ కోసం గాలింపు జరుగుతోంది. మరో సబ్ రిజిస్ట్రార్ అరెస్టు ఇక ఇదే కేసులో బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ యూసుఫ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు మొత్తం ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. భూమాఫియాకు వీరు ముగ్గురు సహకరించారని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయల మీద పోలీసులు దాడులు చేశారు. అప్‌లోడ్ కాని రిజిస్ట్రేషన్ల వివరాలు సేకరించారు. సీఎం కేసీఆర్ ఆదేశంతో ఫ్లయింగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది.కిలో బంగారం స్వాధీనం సబ్ రిజిస్ట్రార్ రవిచంద్రారెడ్డి ఇంటి మీద ఏసీబీ దాడులు చేసింది. ఈ సందర్భంగా కిలో బంగారం, రూ. 2 లక్షల నగదు, విలువైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఆయన మియాపూర్ భూకుంభోకణంలో అరెస్టయ్యారు. Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted June 1, 2017 Author Report Share Posted June 1, 2017 అర్ధరాత్రీ సోదాలు రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ దాడులు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అలజడి రైటర్లనూ ప్రశ్నించిన అధికారులు ఇప్పటికే సస్పెండైనవారి ఇళ్లలో తనిఖీలు.. పలు పత్రాలు స్వాధీనం గోల్డ్‌స్టోన్ ఆక్రమణలపై పోలీసులకు స్థానికుల ఫిర్యాదు ఓ ప్రజాప్రతినిధి అండతో బెదిరిస్తున్నారని ఆరోపణ ఈనాడు - హైదరాబాద్ హైదరాబాద్‌లోని మియాపూర్‌లో భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణం వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రాష్ట్రవ్యాప్తంగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు చేసింది. గడిచిన మూడు సంవత్సరాల్లో ఆయా కార్యాలయాల పరిధిలో జరిగి స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్లపై ఆరా తీసినట్లు తెలిసింది. అనుమానం ఉన్నచోట రిజిస్ట్రేషన్ పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి కార్యాలయంలో సోదాలు జరిపిన అధికారులు.. 14 మంది డాక్యుమెంట్ రైటర్లను కూడా కార్యాలయంలోకి తీసుకెళ్లి ప్రశ్నించినట్లు సమాచారం. బుధవారం మధ్యాహ్నం నుంచి మొదలైన తనిఖీలు అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్న కార్యాలయాలపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పేర ఏమైనా రిజిస్ట్రేషన్ చేశారా అని తనిఖీచేశారు. కార్యాలయాల వారీగా రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించారు. ఇంకా అప్‌లోడ్ చేయకుండా పెండింగ్‌లో ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయా కార్యాలయాల్లో పనిచేస్తున్న పొరుగుసేవల సిబ్బంది, ప్రైవేటు సిబ్బందిని ఎంతకాలంగా పనిచేస్తున్నారు, వేతనాలు ఎవరు ఇస్తున్నారన్న విషయాలపై ప్రశ్నించారు. నర్సాపూర్, జోగుపేట, తిమ్మాపూర్, ఆర్మూర్‌లో, కల్వకుర్తి, మహబూబాబాద్, మంచిర్యాల, ఖమ్మంజిల్లా కేంద్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పత్రాలను క్షుణ్నంగా తనిఖీచేశారు. ఈ తనిఖీల గురించి ముందే సమాచారం అందడంతో చాలాచోట్ల సబ్‌రిజిస్ట్రార్లు అప్రమత్తమయ్యారు. రిజిస్ట్రేషన్లలో వారికి దోహదపడే ప్రైవేటువ్యక్తులను దూరంగా పెట్టినట్లు సమాచారం. ఆ ముగ్గురి ఇళ్లలో తనిఖీలు: భూకుంభకోణాలకు పాల్పడిన ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్లు శ్రీనివాసరావు, యూసుఫ్, రమేశ్‌చంద్రారెడ్డిల ఇళ్లలో పోలీసులు మంగళ, బుధవారాల్లో సోదాలు నిర్వహించారు. కుంభకోణాలకు సహకరించడంద్వారా అక్రమార్జనకు పాల్పడే అవకాశముండటంతో అవినీతి నిరోధక శాఖ అధికారుల సహకారంతో ప్రత్యేక బృందాలు తనిఖీలు సాగించాయి. వారి ఇళ్ల నుంచి భారీగా డాక్యుమెంట్లు, నగదు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు యూసుఫ్‌నుఅదుపులోకి తీసుకున్న పోలీసులు కీలక సమాచారం కోసం విచారిస్తున్నట్లు తెలిసింది. సమాంతరంగా సీఐడీ విచారణ: మియాపూర్ భూకుంభకోణం వ్యవహారంపై స్థానిక పోలీసులతో కలిసి సీఐడీ కూడా దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని సీఐడీకి అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో సీఐడీ రంగంలోకి దిగి ప్రాథమికంగా దర్యాప్తు చేపట్టింది. ప్రస్తుతం స్థానిక పోలీసులతో కలిసి సీఐడీ అధికారులు పనిచేస్తున్నారు. ముందుముందు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మా భూముల్నీ గోల్డ్‌స్టోన్ కబ్జా చేసింది శేరిలింగంపల్లి, న్యూస్‌టుడే: తమ భూములను గోల్డ్‌స్టోన్ కంపెనీ నిర్వాహకులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కూకట్‌పల్లి సమీపంలోని హైదర్‌నగర్ సర్వే నం.172కు చెందిన నివాసితులు బుధవారం సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు ఫిర్యాదు చేశారు. కొందరు ప్రజాప్రతినిధుల అండతో వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. 1981ప్రాంతంలో దాదాపు 2,000 మంది చిరుద్యోగులు సర్వే నం.172 భూమిలో పట్టాదారుల నుంచి స్థలాలు కొనుక్కుని సెట్విన్‌కాలనీ, సత్యసాయికాలనీ, శ్రీనివాసకాలనీ, బాలాజీ సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు. తమ భూములకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి గోల్డ్‌స్టోన్ కంపెనీకి బదలాయించుకున్నారని, దీనిపై గతంలో కూడా రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. కూకట్‌పల్లికి చెందిన ఓ ప్రజాప్రతినిధి అండతో వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆభూమిని గోల్డ్‌స్టోన్ కంపెనీ అధినేత ప్రసాద్ తమ్ముడు పార్థసారథి మరికొందరి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని, సబ్‌రిజిస్ట్రార్ శ్రీనివాసరావు వారికి సహకరించారని ఆరోపించారు. తనిఖీల్లో బయటపడుతున్న తతంగాలు ఆర్మూర్, న్యూస్‌టుడే: ఏసీబీ అధికారులు బుధవారం ఆర్మూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించినప్పుడు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2013 నుంచి ఇంటర్నల్ ఆడిట్ నివేదికలు ఎందుకులేవని అడిగితే.. గతంలో ఆరోపణలపై సస్పెండైన సబ్‌రిజిస్ట్రార్ పాపయ్య వాటిని తీసుకెళ్లారంటూ ఉద్యోగులు తెలిపారు. అలాగే 2013 నుంచి రిజిస్ట్రేషన్లు చేసినవాటిలో 62 డాక్యుమెంట్లు ఇప్పటికీ ఇక్కడే ఎందుకున్నాయని ఏసీబీ ప్రశ్నిచంగా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు వాటిని తీసుకువెళ్లడంలేదని చెప్పడంతో విస్తుపోవడం వారి వంతయింది. వీటిపై లోతైన దర్యాప్తు జరుగుతోంది. Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted June 1, 2017 Report Share Posted June 1, 2017 Ee daadulu chusthunte mukodiki mileage achhe case lekka undhi...note for vote lekka... Quote Link to comment Share on other sites More sharing options...
Kontekurradu Posted June 1, 2017 Report Share Posted June 1, 2017 12 hours ago, reality said: Ee daadulu chusthunte mukodiki mileage achhe case lekka undhi...note for vote lekka... neeku full happy eega Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted June 1, 2017 Author Report Share Posted June 1, 2017 మియాపూర్ భూదందాలో తెలంగాణ మంత్రి! | Updated: Jun 1, 2017, 12:57PM IST Share 0 Keywords: TS minister involves Miyapur scam in Hyderabad | TS Government | Registration and stamps scam | Land grabbing in Hyderabad | KCR orders inquiry on scam Share 0 మంచిర్యాల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు ఫోటోలు పంచుకోవడం హైదరాబాద్ లోని మియాపూర్, హఫీజ్ పేటలలోని విలువైన ప్రభుత్వ భూములకు సంబంధించిన దాదాపు 1485 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్ జరిగింది. 2013లో ప్రభుత్వం ప్రారంభించిన ‘ఎనివేర్’ రిజస్ట్రేషన్ స్కీమ్.. అక్రమార్కుల స్కాములకు బాగా ఉపయోగపడింది. ఒక చోట రిజిస్ట్రార్ కుదరంటే మరో చోట నయానో బయానో ముట్టజెప్పి అమ్మకాలు, కొనుగోలుకు నిషేదం ఉన్న భూమలను రిజస్ట్రేషన్ చేశారు. సహకరించిన వారికి రూ.కోట్లు కుమ్మరించారు. ఈ వ్యవహారం వెనుక పలు కీలక శాఖలు చేపడుతున్న ఓ మంత్రి హస్తమున్నట్లు సమాచారం. ఆయనకు అదే భూముల్లో రెండు ఎకరాలు రిజస్ట్రేషన్ చేసిపెట్టడంతో.. ఫుల్ ఖుషీ అయిన సదరు మంత్రి ఎవరికెన్ని ఎకరాలు కావాలో అన్ని ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు సహకరించారని తెలిసింది. మంత్రి బినామీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన రెండెకరాల భూమి విలువ అక్షరాల కోటి రూపాయలు. తెలంగాణలో మొత్తం141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా అందులో దాదాపు 30కిపైగా కార్యాలయాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మంగళవారం, బుధవారం వీటన్నింటిపైనా ఏకకాల దాడులు నిర్వహించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ఇళ్లల్లో సోదాలు చేశారు. మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రమేష్ చందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు చేయగా.. ఆయన ఇంట్లో కిలో బంగారం.. రూ.2లక్షల నగదు... ఖరీదైన భూ పత్రాలు గుర్తించారు. భూదందాపై సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. ఎంతటివారైనా వదలొద్దని ఆయన ఏసీబీ అధికారులను ఆదేశించారు. భూదందాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు మంత్రిపైనా కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ దందాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో మంగళవారం 29 మంది సబ్ రిజిస్ట్రార్లు, అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. బుధవారం మరో 43 మంది స్థానాలు మార్చింది. ఇప్పటి వరకు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించామని ఏసీబీ డీజీ పూర్ణచంద్రారావు తెలిపారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంలో 2014లో 350, 2015లో 423, 2016లో 534, 2017లో 277 రిజిస్ట్రేషన్లు జరిగాయని, ప్రధానంగా వాటిపై దృష్టి సారించామని కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ గౌడ్ పేర్కొన్నారు. ఈ దందాలో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన అధికారులు.. సూత్రధారి గోల్డ్ స్టోన్ ప్రసాద్ కోసం పోలీసులు బెంగళూరు, ముంబైలలో గాలిస్తున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
DiscoKing Posted June 1, 2017 Report Share Posted June 1, 2017 1 hour ago, TampaChinnodu said: మియాపూర్ భూదందాలో తెలంగాణ మంత్రి! | Updated: Jun 1, 2017, 12:57PM IST Share 0 Keywords: TS minister involves Miyapur scam in Hyderabad | TS Government | Registration and stamps scam | Land grabbing in Hyderabad | KCR orders inquiry on scam Share 0 మంచిర్యాల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు ఫోటోలు పంచుకోవడం హైదరాబాద్ లోని మియాపూర్, హఫీజ్ పేటలలోని విలువైన ప్రభుత్వ భూములకు సంబంధించిన దాదాపు 1485 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్ జరిగింది. 2013లో ప్రభుత్వం ప్రారంభించిన ‘ఎనివేర్’ రిజస్ట్రేషన్ స్కీమ్.. అక్రమార్కుల స్కాములకు బాగా ఉపయోగపడింది. ఒక చోట రిజిస్ట్రార్ కుదరంటే మరో చోట నయానో బయానో ముట్టజెప్పి అమ్మకాలు, కొనుగోలుకు నిషేదం ఉన్న భూమలను రిజస్ట్రేషన్ చేశారు. సహకరించిన వారికి రూ.కోట్లు కుమ్మరించారు. ఈ వ్యవహారం వెనుక పలు కీలక శాఖలు చేపడుతున్న ఓ మంత్రి హస్తమున్నట్లు సమాచారం. ఆయనకు అదే భూముల్లో రెండు ఎకరాలు రిజస్ట్రేషన్ చేసిపెట్టడంతో.. ఫుల్ ఖుషీ అయిన సదరు మంత్రి ఎవరికెన్ని ఎకరాలు కావాలో అన్ని ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు సహకరించారని తెలిసింది. మంత్రి బినామీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన రెండెకరాల భూమి విలువ అక్షరాల కోటి రూపాయలు. తెలంగాణలో మొత్తం141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా అందులో దాదాపు 30కిపైగా కార్యాలయాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మంగళవారం, బుధవారం వీటన్నింటిపైనా ఏకకాల దాడులు నిర్వహించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ఇళ్లల్లో సోదాలు చేశారు. మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రమేష్ చందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు చేయగా.. ఆయన ఇంట్లో కిలో బంగారం.. రూ.2లక్షల నగదు... ఖరీదైన భూ పత్రాలు గుర్తించారు. భూదందాపై సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. ఎంతటివారైనా వదలొద్దని ఆయన ఏసీబీ అధికారులను ఆదేశించారు. భూదందాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు మంత్రిపైనా కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ దందాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో మంగళవారం 29 మంది సబ్ రిజిస్ట్రార్లు, అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. బుధవారం మరో 43 మంది స్థానాలు మార్చింది. ఇప్పటి వరకు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించామని ఏసీబీ డీజీ పూర్ణచంద్రారావు తెలిపారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంలో 2014లో 350, 2015లో 423, 2016లో 534, 2017లో 277 రిజిస్ట్రేషన్లు జరిగాయని, ప్రధానంగా వాటిపై దృష్టి సారించామని కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ గౌడ్ పేర్కొన్నారు. ఈ దందాలో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన అధికారులు.. సూత్రధారి గోల్డ్ స్టోన్ ప్రసాద్ కోసం పోలీసులు బెంగళూరు, ముంబైలలో గాలిస్తున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Annayya_fan Posted June 1, 2017 Report Share Posted June 1, 2017 ఒక్కో కుటుంభానికి 3 ఎకరాలిస్తానన్న ముఖ్యమంత్రి గారి మాట నిలబెట్టడం కోసం అధికారులు వారి భాధ్యతగా 693 ఎకరాలు పంచేస్తే తప్పా?? Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.