Jump to content

విశాఖ భూదందాపై బహిరంగ విచారణ


TampaChinnodu

Recommended Posts

అమ‌రావ‌తి: విశాఖ భూదందా పై బహిరంగ విచారణ చేపట్టనున్నట్టు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉపముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలోని భూ రికార్డుల మార్పిడి పై వెల్లువెత్తుతున్న ఆరోపణలను పరిశీలించి పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. ఇందులో  భాగంగా తన నేతృత్వంలో రెవెన్యూ ఉన్నతాధికారులు బృందం విశాఖలో పర్యటిస్తుందని తెలిపారు.  సి.సి.ఎల్.ఏ కార్యాలయం నుండి సీనియర్ అధికారుల బృందాన్ని విశాఖలో రికార్డులను పరిశీలించడానికి పంపుతున్నామని చెప్పారు. భాధితుల నుంచి వివరాలు తీసుకొనేందుకు పబ్లిక్ హియరింగ్ చేపట్టాలని నిర్ణయించామన్నారు.   జూన్ 15వ తేదీన ఉదయం 11 గంటలకు విశాఖపట్నం కలెక్టరేట్లో  బహిరంగ విచారణ చేప‌డ‌తామ‌ని.. బాధిత ప్రజలు ఎవరైనా వచ్చి  తగిన ఆధారాలతో ఫిర్యాదు చేయొచ్చాన్నారు.  వారి స‌మ‌స్య‌ల‌ను త‌ప్ప‌కుండా ప‌రిష్క‌రిస్తామ‌ని తెలిపారు. బాధితులు ఎవరూ రాజకీయ ఒత్తిడులకు లొంగాల్సిన అవసరం లేద‌న్నారు. విశాఖ‌ భూదందా విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని.. బాధితులకు తప్పక న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

విశాఖ : విశాఖ జిల్లాలో జరిగిన భారీ భూ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. హుద్‌ హుద్‌ తుఫాన్‌ జిల్లాలో చాలామంది జీవితాలను అతలాకుతలం చేస్తే.. కొందరు బడా బాబులు మాత్రం దీనిని ఆసరాగా చేసుకుని సుమారు రూ.20వేల కోట్ల భూ అక్రమణలకు తెరలేపారు. తుఫాన్‌లో రికార్డులు కొట్టుకుపోయిన భూములను గుర్తించి భూ అక్రమణలకు పాల్పడ్డారు. ఈ భూ మాఫియాలో మంత్రి, ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ మంత్రి తోడల్లుడి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.  అయిదు వేల ఎకరాలకు పైగా ఆక్రమణ జరిగినట్లు తెలుస్తోంది.

అత్యధికంగా భీమిలి నియోజకవర్గంలోనే ఈ భూదందా జరిగింది. బడాబాబులు భూ ఆక్రమణతో వేలాది మంది రైతులు రోడ్డున పడ్డారు. రైతుల ఆందోళనలతో ప్రభుత్వం నామా మాత్రపు విచారణకు సిద్దమైంది. వచ్చే నెల 15న బహిరంగ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే బహిరంగ విచారణ చేసి టీడీపీ నేతలు తప్పించుకునేందుకు చూస్తున్నారని .. ఈ ఆక్రమణలపై సీబీఐ విచారణ జరపాలని బాధిత రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.  
 

 

ఈ భూ కుంభకోణంపై జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. భూ కుంభకోణంపై విచారణ జరుగుతోందని, రికార్డులన్నీ తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. వేలకోట్లతో భూకుంభకోణం జరిగినట్లు గుర్తించామని అన్నారు. అక్రమాలకు పాల్పడిన ఇద్దరు తాహసీల్దార్లపై ఇప్పటికే క్రిమినల్‌ చర్యలు ప్రారంభించామని తెలిపారు. కాగా జిల్లాలోని పలు రెవెన్యూ కార్యాలయాల్లో ఎఫ్‌ఎంబీలు (ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్‌) సైతం మాయం అయినట్లు గుర్తించారు.

మరోవైపు  జిల్లాలో భూ ఆక్రమణలు, దందాలపై మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులే భూములను ఆక్రమిస్తున్నారని, ఇప్పటికే ఐదారు వేల ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయని అన్నారు. భూ వివాదాలు పరిష్కరించేందుకు ఐఏఎస్ అధికారిని నియమించాలని తాను ప్రభుత్వాన్ని కోరానన్నారు. మధురవాడలో పోలీసులే భూ సెటిల్‌మెంట్లు చేస్తున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. అలాగే విశాఖ భూదందాపై బహిరంగ విచారణ చేయిస్తామని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు.

Link to comment
Share on other sites

1 minute ago, johnubhai_01 said:

:o 

Dung lo stone veyyadam kaadu.. direct ga diving chestunnav bro 

brother local kada. emina inside info septhadu emo ani.

Link to comment
Share on other sites

26 minutes ago, DiscoKing said:

no 1 state ki poti istunna AP f6vxb_0.gif?1418576951

sand smuggling chesina chintamaneni prastuta paristhithi enti Bro.. joining jaffa party? Jaffa party lo 2019 lo gelichi TG ki poti ga sand to be looted from Adilabad aaa 4pixkj.gif

Link to comment
Share on other sites

Just now, SSTNKM said:

sand smuggling chesina chintamaneni prastuta paristhithi enti Bro.. joining jaffa party? Jaffa party lo 2019 lo gelichi TG ki poti ga sand to be looted from Adilabad aaa 4pixkj.gif

all mafia joining ycheep f6vxb_0.gif?1418576951

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...