Jump to content

Kulli pani chesi chaduvukuna !!


amigo_

Recommended Posts

2 hours ago, amigo_ said:

Hardworking girl... inka consultancy lo cheri job cheyyatamey.. hope she maintains this attitude... hope the GREEN madness doesn't make her forget her roots...

@k2s thatha.. @tom bhayya @TOM_BHAYYA manchi consultancy unte cheppandi pilla ki

Link to comment
Share on other sites

కూలిపని చేసి చదువుకున్నా!

ఆ వూళ్లొ పిల్లలంతా బడికెళ్తే.. ఆ అమ్మాయి మాత్రం పత్తి ఏరడానికీ.. ఎండుమిర్చీ తెంపడానికీ వెళ్లేది. దాంతో బాగా చదువుకోవాలీ.. పేద్ద ఉద్యోగం చేయాలనే కల.. అలాగే ఉండిపోతుందనుకుంది. కొన్నాళ్లు దాన్నే తలచుకుని బాధపడ్డా.. చివరకు ధైర్యం చేసింది. అలా ఆ చిన్న వయసులో మొదలైన ధైర్యం ఆమెతోపాటే పెరిగింది. ఇప్పుడామె అమెరికాలో ఎంఎస్‌ పూర్తిచేసిన ఉన్నత విద్యావంతురాలు. అదెలా సాధ్యమయిందని అడిగితే.. తన కథంతా ఇలా చెప్పుకొచ్చింది..

నా పేరు బండారి రజిత. అమెరికాలో ఎంఎస్‌ మంచి మార్కులతో పూర్తి చేశానంటే..నేను పుట్టుకతోనే ధనవంతురాల్ని కాదు. పుట్టెడు కష్టాలకు తోడు అమ్మానాన్నలూ, ఆర్థిక ఆసరా లేని జీవితం నాది. అసలు చదువుకోగలనా అని ఒకప్పుడు బాధపడిన నేను.. ఈ రోజున అమెరికాలోని విల్మింగ్‌టన్‌ యూనివర్శిటీ నుంచి ఎంఎస్‌లో 4 జీపీఏకు 3.7 జీపీఏ తెచ్చుకున్నానంటే.. ఎగిరి గంతేసినంత సంతోషంగా ఉంది. మాది కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి మండలంలోని భోజన్నపేట. అమ్మానాన్నా, నేనూ, చెల్లీ ఇది మా కుటుంబం. అప్పుడు నాకు తొమ్మిదేళ్లు ఉంటాయనుకుంటా. నాన్నకు అనారోగ్యం. మంచాన పడ్డారు. వైద్యం చేయించలేని పరిస్థితి అమ్మది. దానికితోడు మమ్మల్ని పెంచి పెద్దచేయాలి. దాంతో ఏం చేయాలో తెలియక దిగులుపడేది అమ్మ. చివరకు ఓ రోజు ఆత్మహత్య చేసుకుని మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది. దాంతో మమ్మల్ని నానమ్మ పెంచేది. ఆమెకు వయసుపై బడింది. అయినా రోజంతా కష్టపడినా ఇల్లు గడవని పరిస్థితి. దానికితోడు నాన్నకు మందులు కొనాలి. మమ్మల్ని చదివించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను చదువు మాన్పించి తనతోపాటూ కూలికి తీసుకెళ్లేది. నా పని రోజంతా పత్తి ఏరడం, ఎండుమిర్చీ తెంపడం. అలా వచ్చిన డబ్బు నాన్న వైద్యం కోసం వాడేవాళ్లం. చదువు వదిలేసి కూలీకి వెళ్లడం బాధనిపించినా తప్పదు కదా..!

అక్కడే పదో తరగతి... 
ఎన్ని మందులు వాడినా.. నాన్నకు నయం కాలేదు. జబ్బు ఇంకా ముదిరి చనిపోయాడు. ఆ రోజంతా బాధపడ్డా. మళ్లీ కూలీకి వెళ్లడం తప్పలేదు. కానీ రోజులు గడిచే కొద్దీ నా తోటి పిల్లలు స్కూలుకి వెళ్తుంటే నాకూ చదువుకోవాలనిపించేది. ఎవరిని అడగాలో ఏం చేయాలో తట్టలేదు. చాలా రోజులు ఆలోచించి చివరకు మా వూరి హైస్కూలు హెడ్‌మాస్టారు దగ్గరకి వెళ్లి.. సార్‌ నేనూ చదువుకుంటా అని చెప్పా. ఆయన మండలాఫీసుకి తెలియజేసి బాలకార్మికులు చదువుకునే బ్రిడ్జి స్కూల్లో చేర్పించారు. నాతో పాటూ చెల్లీ వచ్చింది. కొన్నాళ్లకే వేసవి సెలవులు రావడంతో ఇంటికి పంపించేశారు. చదువు అక్కడితో ఆగిపోతుందేమోనని భయపడ్డా. అది నాకు ఇష్టంలేక చివరకు నానమ్మను ఒప్పించి మండలాఫీసుకి తీసుకెళ్లా. నాకు బాగా చదువుకోవాలనుందన్న విషయం చెప్పా. వాళ్లు నా పట్టుదలా, ధైర్యాన్ని చూసి జూలపల్లి బీసీ వెల్ఫేర్‌ హాస్టల్‌లో ఉంటూ చదువుకునే అవకాశం కల్పించారు. నేను ఏడు, చెల్లి ఆరో తరగతుల్లో చేరిపోయాం. నా టెన్త్‌ క్లాస్‌ అక్కడే పూర్తయ్యింది. మంచి మార్కులే కాదు మండలంలోనే టాపర్‌నయ్యా.

కలెక్టర్‌ని కలిశా.. 
పదయ్యింది.. ఇంటరెలా.. అని ఆలోచిస్తున్నప్పుడు మా వార్డెన్‌ నన్ను ఆదుకున్నారు. ఎలాగైనా ఇంటర్‌ చదివించండని ఆవిడని అడిగా. ఆవిడ కలెక్టర్‌ దగ్గరకు పంపారు. ఆయనకు నా పరిస్థితి వివరిస్తే.. ఓ కాలేజీలో ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించారు. కానీ మళ్లీ హాస్టల్‌ సమస్య. ఏం చేయాలో అర్థంకాలేదు. ఆ సమయంలోనే నా గురించి పత్రికల్లో వచ్చింది. ఒకరు హైదరాబాద్‌లోని సీఎస్‌ఎస్‌ (సెంటర్‌ ఫర్‌ సోషల్‌ సర్వీస్‌) అనే సంస్థ గురించి చెప్పారు ఆ మేడమ్‌ని కలవమంటూ ఓ ఉత్తరం రాసిచ్చారు. అలా హైదరాబాద్‌ వచ్చి ఆవిడని కలిశా. ఆ మేడమ్‌ పేరు విజయలక్ష్మి. ఆవిడ ఒప్పుకోవడంతో సీఎస్‌ఎస్‌ హాస్టల్‌లో ఉంటూ సిద్దార్థ కాలేజీలో ఇంటర్‌లో చేరిపోయా.

ఇల్లు తాకట్టు పెట్టారు.. 
అప్పటిదాకా తెలుగు మీడియంలో చదివిన నేను ఇంటర్‌లో ఇంగ్లిష్‌ మీడియం అనే సరికి కాస్త భయపడ్డా. మొదట్లో చాలా కష్టంగా అనిపించింది. అందరికంటే రెండు మూడు గంటలు ఎక్కువే కష్టపడి చదివేదాన్ని. తెలియని విషయాలను లెక్చరర్లను అడిగి తెలుసుకునేదాన్ని. కాలేజీ నుంచి రాగానే నాలాంటి విద్యార్థులకు చదువు చెప్పేదాన్ని. ఆ రెండేళ్లూ చదువే నా ప్రపంచం. నేను వూహించలేదు కానీ కాలేజీ టాపర్‌నయ్యా. మేడమ్‌ సాయంతోనే బీటెక్‌ కూడా పూర్తిచేశా. ఉద్యోగమా.. ఇంకేదయినా చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలోనే నా జీవితం మలుపు తిరిగింది. విదేశాల్లో చదువుకుని అక్కడే స్థిరపడిన కొందరు మా హాస్టల్‌కి వచ్చారోసారి. నేనూ ఇంకా బాగా చదువుకుంటే నలుగురికీ వారిలా సాయం చేయొచ్చని అనిపించింది. అందుకే విదేశాలకు వెళ్లి ఎంఎస్‌ చేయాలనుకున్నా. కానీ అక్కడ చదవాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. నాలాంటి అనాథకు అది అందని ద్రాక్షే. నేను చదువుకుంటాను సాయం చేయండన్న రోజు విజయలక్ష్మి అమ్మే లేకపోయుంటే ఈ రోజు నేనిలా మీ ముందుకు వచ్చేదాన్ని కాదేమో! నాకు ఉండేందుకు నీడనివ్వడమే కాదు నేను వేసిన ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచారు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలన్న నా లక్ష్యానికి సాయం అందించారు. అమ్మ ప్రయత్నంతో ఇండియన్‌బ్యాంక్‌ కొంత డబ్బు సాయం చేస్తే.. మరికొంత డబ్బుని ఆమె తన సొంత ఇంటిని తాకట్టు పెట్టి మరీ ఇచ్చారు. సొంత కూతుర్ని కాకపోయినా అంతకంటే ఎక్కువగా చూసుకున్న అమ్మకు నేనేమివ్వగలను. అదే ఆవిడను అడిగితే ‘‘నువ్వు బాగా స్థిరపడి నీలాంటి విద్యార్థుల చదువులకు సాయం చేసేందుకు ప్రయత్నించు..’ అని అమెరికా పంపించారు. చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి.మా చెల్లేమో డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగం చేస్తోంది. ఇక మంచి ఉద్యోగం తెచ్చుకుని స్థిరపడటంపైనే నా దృష్టి.

Link to comment
Share on other sites

2 hours ago, Quickgun_murugan said:

Hardworking girl... inka consultancy lo cheri job cheyyatamey.. hope she maintains this attitude... hope the GREEN madness doesn't make her forget her roots...

@k2s thatha.. @tom bhayya @TOM_BHAYYA manchi consultancy unte cheppandi pilla ki

Contact details thelisthey let me know edhanna entry level position try cheyochu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...