Jump to content

counseling aypoyaka news veste em vastadi


vendetta

Recommended Posts

 
ఈ సీట్లు సంపన్నులకే! 
వైద్యం పీజీలో అప్రకటిత ‘రిజర్వేషన్‌’ 
సగం సీట్లు ధనవంతులకు మాత్రమే 
రూ.కోట్లు ఉంటేనే పీజీ చేసే అవకాశం 
సామాన్యులకు అందుబాటు అసాధ్యం 
చదువుల నుంచే వ్యాపారమవుతున్న వైద్యం 
దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న వైద్య ప్రముఖులు 
31hyd-general1a.jpg
రిజర్వేషన్లు మనకు కొత్తేం కాదు. సామాజికంగా వెనకబడిన వారి కోసం విద్యలోనూ, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు మనకు తెలిసినవే. వీటి వెనక హేతువు ఉంది, వీటికి రాజ్యాంగ బద్ధతా ఉంది. కానీ ప్రస్తుతం చాప కింద నీరులా... మన చదువుల్లోకి కొత్త తరహా ‘అప్రకటిత రిజర్వేషన్లు’ వచ్చి చేరుతున్నాయి. కొన్ని కోర్సులను కేవలం డబ్బుల్లో ఓలలాడుతున్న సంపన్నులకు మాత్రమే ‘రిజర్వు’ చేసే కొత్త పద్ధతి తెర మీదికి వస్తోంది. దీనికి మన ‘పీజీ వైద్య విద్యే’ ప్రత్యక్ష తార్కాణం.

తాజాగా మన తెలుగు రాష్ట్రాలు రెంటిలోనూ పీజీ వైద్య విద్యా రుసుముల్ని భారీగా పెంచేయడం పెద్ద దుమారాన్నే రేపుతోంది. ప్రైవేటు కాలేజీల్లో ఉన్న పీజీ సీట్ల రుసుములను భారీగా పెంచెయ్యటం, మొత్తం సీట్లలో దాదాపు సగానికిపైగా సీట్లను రూ.కోటి కంటే ఎక్కువ కట్టగలిగిన వారికి మాత్రమే దక్కేలా చేయటం చర్చనీయాంశంగా మారింది. ప్రజారోగ్యానికీ, సమాజ గమనానికీ అత్యంత కీలకమైన వైద్యం వంటి వృత్తుల్లో ప్రవేశాన్ని ఇలా రూ.కోట్లు కుమ్మరించగలిగిన ధనికులకు మాత్రమే దక్కేలా చేయటమంటే మన వైద్యరంగం ఏ దిక్కుకుపోతోందన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి నిర్ణయాల ప్రభావం మున్ముందు వైద్యరంగంలో ఎలాంటి విపరిణామాలకు దారి తీస్తుందో చెప్పటం కష్టమని పలువురు వైద్య ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీనిపై ..‘ఈనాడు’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

అయితరాజు రంగారావు, ఇట్టా సాంబశివరావు  
ఈనాడు ప్రత్యేక ప్రతినిధులు
‘కోటి’ వైద్యులొస్తున్నారు..
దేశంలో ఏదైనా ఒక కోర్సుకు ‘ఇది కేవలం సంపదల్లో మునిగి తేలుతున్న వారికి మాత్రమే’ అని బోర్డు పెడితే మనం ఎలా స్పందిస్తాం? 
పెడితే కాదు.. ప్రస్తుతం పీజీ వైద్య విద్యకు దాదాపుగా ఇలాంటి బోర్డునే పెట్టేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు, మైనారిటీ వైద్య కళాశాలల్లో ఈ ఏడాది పెంచిన పీజీ కోర్సు రుసుముల్ని చూస్తే మనకీ విషయం తేలిగ్గానే అర్థమవుతుంది. ప్రైవేటు వైద్య కళాశాలల్లో సగానికి సగం పీజీ సీట్లు- ఏకంగా రూ.కోటి వరకూ చెల్లించగలిగిన వారికి మాత్రమే అందుబాటులో ఉండబోతున్నాయి. ఇంత భారీ మొత్తాన్ని చెల్లించి సీటు సంపాదించుకోవటం ఎవరికి సాధ్యమన్నది తరచి చూస్తే దీని వెనక ఎంతటి ప్రమాదం దాగి ఉందో అర్థమవుతుంది.
31hyd-general1b.jpg
తాజాగా పెంచిన లెక్కల ప్రకారం మొత్తం ప్రైవేటు రంగంలోని 50% సీట్లు కేవలం సంపన్న వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వీటిని అందుకోవటమన్నది కనీసం బ్యాంకు రుణాలు తీసుకుని చదువుకుందామనుకునే సాధారణ, ఎగువ మధ్య తరగతి కుటుంబాల వారికి కూడా సాధ్యమయ్యే పని కాదు.

5% మందికి 50% సీట్లు! 
రూ.కోటి పెట్టి పీజీ వైద్య విద్య చదువుకోగలిగిన సామర్థ్యం మన సమాజంలో గట్టిగా 5% మందికి కూడా ఉండదని అంచనా. ఏడాదికి రూ.50 వేల ఆదాయపు పన్ను కట్టే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు కూడా పిల్లల చదువుల కోసం ఇంత రుసుము చెల్లించలేరని విశ్లేషకులు అంటున్నారు. స్వతహాగా సంపాదన ఎక్కువగా ఉండే స్తిరాస్థి వ్యాపారులు, బడా పారిశ్రామికవేత్తలు, స్పెషలిస్టు వైద్యులు, బడా రాజకీయ నేతలు, సినీతారలు, విదేశాల్లో స్థిరపడినవారు..ఇలాంటి కొద్దిమంది మాత్రమే తమ పిల్లల చదువుల కోసం ఇలా రూ.కోట్లు చెల్లించుకోగలుగుతారు. అక్రమ మార్గాల్లో భారీగా వెనకేసుకునే వాళ్ల పిల్లలకు కూడా ఇది బాగా కలిసొచ్చే విధానమన్న వాదనా వినిపిస్తోంది. మొత్తమ్మీద ఈ స్థాయి ధనవంతులు మన సమాజంలో 4-5 శాతానికి మించి ఉండరు. జనాభాలో ఇంత తక్కువ శాతం ఉన్న సంపన్న వర్గాల వారి కోసం.. మొత్తం ప్రైవేటు కాలేజీల్లోని 50% పీజీ సీట్లు కేటాయించటం దేనికి సంకేతమన్నది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా తయారైంది. డబ్బుతో మూలుగుతున్న బడా సంపన్నులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించే ఈ పరిణామాల ప్రభావం మన సమాజంపై తీవ్రంగా ఉండబోతోందని ఇటు విద్యారంగ ప్రముఖులు, అటు వైద్య రంగ ప్రముఖులు కూడా హెచ్చరికలు చేస్తున్నారు.

తాజా రుసుముల పెంపుపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు విద్యార్థులకు కొంత వూరటనిచ్చిన మాట వాస్తవం. దీని ప్రకారం విద్యార్ధులు ప్రవేశం సమయంలో 50% రుసుము కట్టి, మిగతా 50% రుసుముకు సొంత పూచీకత్తుపై హామీ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి కొంత వెసులుబాటు వచ్చినా తుది తీర్పులో రుసుముల పెంపును కోర్టు సమర్థిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటన్న ఆందోళనే సగటు విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. అంతేకాదు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం విద్యార్ధులంతా మిగిలిన రెండేళ్ల ఫీజులకు సరిపడా.. బ్యాంకు పూచీకత్తును చూపించుకోవాల్సి ఉండటం పెను భారంగా తయారైంది. ఇవే కాదు, పీజీ వైద్య విద్యార్థులకు నెలనెలా ఇచ్చే స్టైఫండ్‌ రూ.30 వేలను కూడా విద్యార్థి నుంచే వసూలు చేస్తుండటం, అదీ ముందస్తుగా 12 నెలలకు సరిపడా ఒకేసారి చెల్లించాలని యాజమాన్యాలు కోరుతుండటం పెద్ద తలనొప్పిగా తయారవుతోంది. దీని ప్రకారం విద్యార్ధులు భారీ ఫీజులకు తోడు మరో రూ.3.6 లక్షలను కూడా కళాశాలకు ముందే చెల్లించుకోవాల్సి ఉంటోంది. ఇన్ని రూపాల్లో ఇంతింత భారీ మొత్తాలను ఒకేసారి చెల్లించడం సాధారణ మధ్యతరగతి విద్యార్థికి సాధ్యమయ్యే అవకాశమే ఉండటం లేదు.

విపరిణామాలకు బాధ్యులెవరు? 
వైద్య రంగం బడా వ్యాపారంగా తయారైపోతోందని, చిన్నచిన్న పరీక్షల నుంచి మందుల సిఫార్సు వరకూ ప్రతి దశలోనూ రోగులను దండుకుని, జేబులను పిండుకునే కార్యక్రమం పెరిగిపోతోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్న ఈ రోజుల్లో- అసలు చదువుకునే రోజుల నుంచే వైద్య రంగంలో ఇంతలా ధన ప్రమేయం పెరిగిపోతుండటం మంచి పరిణామం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫీజులను అనూహ్యంగా, కోట్లలో వసూలు చేయటమంటే భవిష్యత్తులో నానా మార్గాల్లో సంపాదనకు గేట్లు ఎత్తేయటం కాక మరేమవుతుందని పలువురు వైద్యులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైద్యరంగంలో వేళ్లూనుకుంటున్న దుష్ట సంప్రదాయాలపై ఎన్ని విమర్శలు వినిపిస్తున్నా.. నేటికీ మన దేశంలో ‘వైద్యో నారాయణో’ పరిస్థితులే నెలకొన్నాయి. చాలామంది వైద్యులను దైవంగా భావిస్తూ, పూర్తిగా వాళ్లను నమ్ముతున్నారు. మరోవైపు వైద్యులు అనుసరించాల్సిన ప్రమాణాల విషయంలో ఎక్కడా కట్టుదిట్టమైన నియంత్రణలుగానీ, సరైన తనిఖీలుగానీ ఉండటం లేదు. ఈ నేపథ్యంలో కోట్ల కట్టలు పరిచి, పట్టాలు సాధించిన వైద్యులు తాము కట్టిందంతా సత్వరమే రాబట్టుకోవాలనే ఒత్తిడిలో అడ్డదారులు తొక్కటం ఆరంభిస్తే జనానికి పూచీకత్తు ఎవరన్నది సందేహాస్పదంగా మారుతోంది.

విదేశాల్లో.. 
వైద్య విద్య విషయంలో ఒక్కో దేశంలో ఒక్కో విధానం అమలవుతోంది. ఉదాహరణకు బ్రిటన్‌లో వైద్య విద్యకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. రుసుములు నామమాత్రం. వైద్య కళాశాలలన్నింటిలోనూ ఒకే విధమైన ప్రమాణాలుంటాయి. విద్యార్థి ఎక్కడ చదివినా ఒకే రకమైన శిక్షణ లభిస్తుంది. అమెరికాలో వైద్య విద్య కోర్సులు పూర్తిగా ప్రైవేటుపరమే. అక్కడి కళాశాలల రుసుముల్లో ఏకరూపత లేదు. కొన్నింటిలో చాలా ఎక్కువగా ఉంటే.. మరికొన్నింటిలో రుసుములు చాలా తక్కువగా ఉంటాయి. సంస్థలకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి ఫీజులు మారిపోతుంటాయి. మేయో క్లినిక్‌ వంటి వైద్య కేంద్రాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి పేరు గడించాయి. జపాన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ తదితర దేశాల్లో వైద్య విద్య రుసుములు ఎక్కువగా ఉండవు, వారికి ప్రభుత్వమే ఆర్థిక మద్దతునిస్తోంది. మన దేశంలో అటు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు రెండూ ఉన్నా- బోధనలో నాణ్యత విషయంలో మనం విదేశాలతో పోల్చుకునే పరిస్థితి ఉండటం లేదు.

కోటి కట్టగలిగితేనే! 
ప్రభుత్వంలో అతి తక్కువ
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీటు కోసం విద్యార్థి ప్రవేశ రుసుముగా మూడేళ్లకు కలిపి విశ్వవిద్యాలయానికి రూ.17,000 కట్టాలి. ఆ తర్వాత కళాశాల అభివృద్ధి నిధి కోసం ఓ రూ.5 వేలు, గ్రంథాలయ రుసుముగా రూ.1000, ఆర్థికాభివృద్ధి నిధి పరిధిలో మరో రూ.1500.. ఇలా మూడేళ్ల కోర్సు కోసం మొత్తంగా వసూలు చేసేది రూ.7,500 దాటదు! పైగా చేరిన తర్వాత ప్రభుత్వమే వీరికి నెలకు రూ.30,000 ఉపకార వేతనంగా ఇస్తుంది.

ప్రైవేటులో ఎంత ఎక్కువ? 
ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఫీజుల స్వభావం పూర్తిగా మారిపోతోంది. తాజాగా పెంచిన ఫీజుల ప్రకారం- మూడేళ్ల పీజీ పూర్తయ్యేసరికి కన్వీనర్‌ కోటాలోనే కనీసం రూ.30 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. మేనేజ్‌మెంట్‌ కోటాలో దాదాపు రూ.1 కోటి ఖర్చవుతుంది. ఇక ఎన్నారై, కళాశాల స్వేచ్ఛ కోటాల్లో అయితే రూ.2.50 కోట్లు పైచిలుకే చెల్లించుకోవాల్సి ఉంటుంది. 
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ ప్రైవేటు పీజీ ఫీజులను 300% నుంచి 1300% పెంచేశారు. 
గతంలో లేని ‘ఎన్నారై’ కోటా, ‘వైద్యకళాశాల స్వేచ్ఛ’ కోటాలను కొత్తగా సృష్టించి, వీటి ఫీజులను కళ్లు తిరిగేలా పెంచారు.

ఇదీ ప్రశ్నల పరంపర 
గతంలో ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా చదువుకున్న వాళ్లే ఇప్పుడు దోపిడీకి తెరతీస్తూ- అనవసర పరీక్షలు, అనవసర మందులు, ఇష్టానుసారం డబ్బు గుంజుతూ సామాన్యులపై ఆర్థిక భారం మోపుతుంటే చర్యలుండటం లేదు. ఇక కోట్లు పెట్టి చదువుకున్న వాళ్లను పట్టుకోవటం సాధ్యమేనా?

వైద్య వృత్తిలో సేవాభావం, విలువలు తగ్గిపోతున్న ఈ తరుణంలో.. పీజీ వైద్య విద్యలో డబ్బు ప్రమేయాన్ని మరింత పెంచటం సమర్థనీయమా? 
కోట్లు పోసి వైద్యం చదువుకున్న వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం కొంతకాలమైనా పనిచేయాలన్న దృక్పథం ఎక్కడి నుంచి వస్తుంది? 
ఇన్నేళ్లుగా మన సమాజం వైద్యాన్ని ఎంతోకొంత సేవగా చూస్తోంది. ఇది వ్యాపారంగా మారి, పెట్టిన ‘పెట్టుబడి’ని సాధ్యమైనంత త్వరగా తిరిగి సంపాదించుకోవాలనే తపనతో అడ్డదారులు తొక్కితే అడ్డుకునే వ్యవస్థలు మన దగ్గరున్నాయా? 
భారీగా కోట్లు ఆర్జించొచ్చన్న ఆశతో రేపు ప్రైవేటు వైద్య కళాశాలలు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తే- సాధారణ సీట్ల కంటే ఈ ‘కోట్ల సీట్ల’ సంఖ్య పెరిగిపోతుంది. అప్పుడు మొత్తం వైద్య రంగం స్వరూపస్వభావాలే మారిపోవన్న భరోసా ఎక్కడుంది?

పరిష్కారమేమిటి? 
ప్రైవేటు కళాశాలలు చూపించే జమాఖర్చులపై ప్రభుత్వం పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించాలి. 
విద్యార్ధులను భయపెట్టేలా కాకుండా.. రుసుముల పెంపులో హేతుబద్ధత తీసుకురావాలి. 
ప్రభుత్వ వైద్యకళాశాలల్లో పీజీ సీట్ల సంఖ్యను పెంచటం మీద శ్రద్ధ పెట్టాలి. 
జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో డీఎన్‌బీ కోర్సులను ప్రవేశపెట్టాలి. 
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం మూడేళ్ల పాటు సేవలందించేలా నిబంధనలను కఠినతరం చేయడం. 
ప్రైవేటులో కోర్సు పూర్తిచేసిన వైద్యులకు అనుభవ పూర్వక శిక్షణ సరిగా అబ్బిందా? లేదా? అనేది కోర్సు తుది అంకంలో సరిచూడటం 
ఎంబీబీఎస్‌ వైద్యవిద్య స్థాయిలోనే సామాజిక స్పృహ, మానవ విలువలను ప్రత్యేక పాఠ్యాంశంగా చేర్చటం అవసరం.

31hyd-general1e.jpg
నీట్‌ ఆశలపై ఫీజుల పిడుగు! 
నీట్‌ పరీక్ష వస్తే పారదర్శకత వస్తుందని, ప్రైవేటులో ఇప్పటి వరకూ కొనసాగుతున్న దొడ్డిదారి అమ్మకాలకు తెర పడుతుందనీ, ప్రతిభా వంతులకు పీజీలో అవకాశాలు పెరుగుతాయని అంతా ఆశించారు. కానీ వాస్తవంగా జరిగింది వేరు. భారీ డబ్బు కట్టుకోలేకున్నా కొంత వరకూ ప్రతిభతో చదువుకోవాలనుకున్న విద్యార్ధులపై ఈ ఫీజులు పెంపు వ్యవహారం పిడుగులా పడింది. కాలేజీ యాజమాన్యాలు గతంలో అనధికారికంగా రాబట్టుకున్న సొమ్మును.. ఇప్పుడు అధికారికంగానే వసూలు చేసుకునే అవకాశం కల్పించారు. అప్పుడు సీట్లు కొనుక్కోవాలనుకున్న ఎవరో కొద్దిమందిపైనే పడిన ఆర్థిక భారం ఇప్పుడు అన్ని కేటగిరీల విద్యార్థుల మీదా పడింది. రైతులు, ఉద్యోగులు, మధ్యతరగతి వ్యాపారులు.. సమాజంలో ఎవరికీ కూడా.. పెరిగిన రుసుములంతగా ఆదాయం పెరగలేదన్నది వాస్తవం!

పెంపు హేతుబద్ధమేనా? 
రుసుము పెంచాలనుకుంటే వైద్యకళాశాలల యాజమాన్యం ముందుగా ‘ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్‌సీ)’కి తమ జమాఖర్చులను సమర్పించుకోవాలి. ఏడాదిలో వైద్యకళాశాల కోసం పెట్టిన ఖర్చు, ఆదాయాలను సరిచూసి, ప్రస్తుత ఆర్థికస్థితికి అనుగుణంగా రుసుములను పెంచాలని సూచిస్తూ ఏఎఫ్‌ఆర్‌సీ- ఆ మొత్తం ఎంతో ప్రభుత్వానికి సూచిస్తుంది. ఆ కమిటీ సిఫార్సు చేసే మొత్తం ప్రైవేటు వైద్యకళాశాల్లోని మొత్తం సీట్లన్నింటికీ వర్తిస్తుంది. అయితే ప్రైవేటు వైద్యకళాశాలల్లోని మొత్తం సీట్లలో సగం సీట్లను ప్రభుత్వమే తీసుకొని కన్వీనర్‌ కోటాలో తక్కువ రుసుముకు భర్తీ చేస్తుండడంతో.. ఆ నష్టాన్ని భర్తీ చేసే విధంగా మిగిలిన 50% సీట్లకు కొంత రుసుము పెంచుకోవటమన్నది ఇప్పటి వరకూ జరుగుతూ వస్తోంది. 2016-17లో ఇందుకు విరుద్ధంగా కన్వీనర్‌ కోటా సీట్లకూ రుసుము 300 శాతానికిపైగా పెంచారు. ఇక యాజమాన్య, ప్రవాస భారతీయ, వైద్యకళాశాల స్వేచ్ఛ కోటాలకైతే రుసుముల పెంపు 1300 శాతం వరకూ పెరిగింది. ఇందులో ఏమాత్రం హేతుబద్ధత లేదనే విమర్శలున్నాయి. ఈ సీట్లన్నీ కూడా ప్రతిభ ఒక్కటే కాదు, భారీగా డబ్బు కట్టగలిగే స్థోమతు కూడా ఉన్న వారికే అందుబాటులో ఉంటున్నాయంటే.. వైద్య విద్య నిజమైన స్ఫూర్తికి నీళ్లొదిలినట్లే!

ప్రమాణాలపై ఏదీ శ్రద్ధ?
వైద్యకళాశాలలను, అనుబంధ ఆసుపత్రులను నిర్వహించటం ఎంతో భారంతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఫీజుల పెంపు సమర్థనీయమన్న వాదన యాజమాన్యాల నుంచి వినపడుతోంది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో కొన్ని మాత్రమే ప్రభుత్వ వైద్యకళాశాలల కంటే మెరుగైన ప్రమాణాలు, అధునాతన పరికరాలు, మౌలిక వసతులతో ఉంటుండగా.. కొన్ని కళాశాలల పరిస్థితి మరీ అన్యాయంగా ఉంటోంది. నాసిరకమైన ప్రమాణాలతోనే నడిచిపోతున్నాయి. అధిక శాతం ప్రైవేటు వైద్యకళాశాలలకు అనుబంధ ఆసుపత్రులు నామమాత్రంగా పని చేస్తున్నాయి. పాఠ్యాంశాల బోధన బాగున్నా అనుభవపూర్వక శిక్షణకు విషయంలో చేదు అనుభవమే ఎదురవుతోంది. స్పెషలిటీ వైద్యసేవలకు తగ్గట్లుగా రోగుల సంఖ్య లేకపోవడంతో తూతూమంత్రంగా క్షేత్రస్థాయి శిక్షణ పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఫీజుల పెంపునకు తెరతీసిన ప్రభుత్వం నాణ్యత విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోదేమన్న వాదనా వూపందుకుంటోంది.
 
31hyd-general1d.jpg
Link to comment
Share on other sites

39 minutes ago, mastercheif said:

mee tammudu kosam chesthunnav .. which is good.

but ikkada no one cares !

 

Eenadu paper vadu kudA na tammudu kosam main page lo news vesadantava lol

 

ma tammudu kosam veste em vastadi , he got rank, he got seat and chaduvkuntunnadu ....asalem vastadi ento

Link to comment
Share on other sites

13 minutes ago, mastercheif said:

mee tammudu kosam chesthunnav .. which is good.

but ikkada no one cares !

general ga adgutunna, vaidyam lekunda present evadaina normal ga happy life lead chestunnada?

oka 40 cross ayna vadu evadaina, puttinapatnundi puttalanna vaidyam lekunda evaraina untunnaru 

alanti profession ela digujjartundo enduku digajartundo vesanu

 

 

 

sarle eenadu paper vadu ma tammudu kosam vesadu anamaku, @3$%

Link to comment
Share on other sites

40 minutes ago, mastercheif said:

mee tammudu kosam chesthunnav .. which is good.

but ikkada no one cares !l

nee crying ento asala, ala aite ikda evaru em post chesina selfishness kosam chestarantava

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...