JANASENA Posted June 2, 2017 Report Share Posted June 2, 2017 ఇంటర్నెట్ డెస్క్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత అగ్రరాజ్యం వీసాల మంజూరులో కఠినంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా కొన్ని ముస్లిం దేశాల వారిని తమ దేశంలోకి అనుమతించకుండా నిషేధం విధించడం తీవ్ర వివాదాస్పదమైంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఇచ్చే ప్రశ్నావళిని మరింత కఠినతరం చేశాయి. వారి సోషల్ మీడియా వివరాలను సైతం పొందుపర్చాల్సిందిగా కోరుతున్నాయి. తద్వారా అమెరికాకు ముప్పు కలగజేసేవారిని సాధ్యమైనంత వరకూ నిరోధించవచ్చని భావిస్తోంది. పర్యాటకులు, వలసవచ్చేవారికి మే25 నుంచి కొత్తగా అనుబంధ ప్రశ్నావళిని అందజేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ మార్చి 6న జారీ చేసిన మెమోలో వీసా స్ర్కీనింగ్‌కు సంబంధించినపలు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా అమల్లోకి తెచ్చిన మూడుపేజీల అనుబంధ ప్రశ్నావళిలో వారి పాస్‌పోర్ట్ నెంబర్ల వివరాలను కోరారు. గత 15 సంవత్సరాల్లో వారు చేసిన ప్రయాణ వివరాలను అందజేయమన్నారు. అంతేకాదు వారి ప్రయాణానికి ఎవరైనా నిధులు సమకూర్చిఉంటే దాని వివరాలు కూడా జతచేయాలి. గత 15ఏళ్లలో వారి ఉద్యోగ వివరాలు, వారి అడ్రస్ అందజేయాలి. భార్య, తల్లిదండ్రుల వివరాలనూ పొందుపర్చాల్సి ఉంటుంది. వారు ఒకవేళ గతించినా వారి వివరాలూ చెప్పాల్సిందే. ఇక సోషల్ మీడియాలో వారు గత ఐదేళ్లలో ఉపయోగించిన తమ పేర్లను పేర్కొనాల్సిందిగా కోరారు. అయితే ఈ వివరాలన్నీ దరఖాస్తు దారులు తమకు నచ్చితేనే అందజేయొచ్చు. అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలివ్వని వారి దరఖాస్తును పరిశీలించే ప్రక్రియ ఆలస్యం కావొచ్చని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఈ అనుబంధ ప్రశ్నావళిని అందరు దరఖాస్తుల దారుల వద్ద నుంచి కోరరనీ.. అధికారులు మరింత సమాచారం అవసరం అని భావించిన వారిని మాత్రమే అడుగుతారట. 13 మిలియన్ దరఖాస్తుల్లో 65వేల మందిని మాత్రమే అడిగే అవకాశం ఉందట. అయితే దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి. కొత్త ప్రశ్నావళిని విరమించుకోవాలని ది అమెరికన్ సివిల్ లైబర్టీస్ యూనియన్ కోరింది. ఇందులో సోషల్ మీడియాకు సంబంధించిన ప్రశ్నలు దరఖాస్తుదారుడి వ్యక్తిగత స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యానికి తీవ్ర విఘాతం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొంది. Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted June 3, 2017 Report Share Posted June 3, 2017 Endho ee edhava pichhi... Quote Link to comment Share on other sites More sharing options...
Manikyam Posted June 3, 2017 Report Share Posted June 3, 2017 1954 malle undi Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.