Jump to content

విశాఖ.. ఆక్సిజన్ నగరం


BaabuBangaram

Recommended Posts

హుద్‌హుద్‌ తర్వాత 50 లక్షలకు పైగా మొక్కలు 
పార్కుల వినియోగంలోనూ నగరవాసుల సంతృప్తి 
vsp-sty4a.jpg

గాలిలో 26 శాతం ఆక్సిజన్‌ ఉంది. నగరంలో ఎన్ని పరిశ్రమలుపెరుగుతున్నా, విచ్చలవిడిగా వాహనాలు వచ్చేస్తున్నా, కాలుష్యం విపరీతమని అంటున్నా.. ఆక్సిజన్‌ శాతంలో ఏమాత్రం తేడాలు రావట్లేదు. ఎటొచ్చి ఇబ్బంది వస్తోందల్లా.. కర్బన ఉద్ఘారాలు పెరగడం వల్లేనని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ కర్బన ఉద్ఘారాల నుంచి నగరంలోని చక్కటి పచ్చికలు, మంచిపార్కులు పోరాటం చేస్తూ నగరవాసులకు ఆక్సిజన్‌ పాళ్లను సమంగా అందించే పనిలో ఉన్నాయి. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగర పచ్చదనంపై ప్రత్యేక కథనం.

విశాఖపట్నం: కాలుష్య నియంత్రణ మండలి అంచనాల ప్రకారం జీవీఎంసీ పరిధిలోని భూభాగంలో 40శాతం పచ్చదనం ఉందని చెబుతున్నారు. అయితే ఇక్కడున్న కాలుష్య పరిస్థితులు, పెరుగుతున్న నగరీకరణ, పరిశ్రమల కారణంగా దీన్ని 60 శాతానికి పెంచాల్సిన అవసరముందని చెబుతున్నారు. ఇందులో అగ్రభాగం కొండ ప్రాంతాల్లో మొక్కలు నాటాల్సిన అవసరం మరింతగా ఉందనే భావన వారిలో ఉంది. భౌగోళికంగా చూస్తే విశాఖ నగరం.. ఓ పక్క సముద్రం.. మిగిలిన మూడుదిక్కులా కొండలతో దర్శనమిస్తుంది. వాటిమధ్యలో నగరం విస్తరించి ఉంది. హుద్‌హుద్‌ తుపానుతో కకలావికలంగా మారిన ఈ నగరం.. ఒకరకంగా చెప్పాలంటే పచ్చదనం కారణంగా పడిలేచిందని చెప్పాలి. కాలుష్యం పెరుగుతోందనుకునే తరుణంలో నగరంలోని పార్కులు, పచ్చదనం స్థానికులకు ఉపశమనాన్ని ఇచ్చేలా వృద్ధి చెందాయనే చెప్పాలి.

పార్కులు పెరుగుతూనే ఉన్నాయి.. 
వుడా ఆధ్వర్యంలో సెంట్రల్‌పార్క్‌, తెన్నేటి పార్కు, కైలాసగిరి.. ఇలా ప్రధాన పార్కులతో పాటు కాలనీల్లో కూడా పార్కుల సంస్కృతి బాగా పెరుగుతోంది.

కాలనీల్లో పార్కులు వృద్ధి చెందే సంస్కృతి 2003నుంచి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలనీవాసులంతా ఒక కమిటీగా ఏర్పడి పురపాలికతో కలిసి నిధులు Åచ్చుకుని వృద్ధి చేసుకోవడం ఒక ప్రత్యేక ఆనవాయితీగా వస్తోంది.

ఇప్పటిదాకా నగరంలో 94 కాలనీ పార్కులున్నట్లు జీవీఎంసీ గణాంకాలు చూపిస్తోంది. ప్రస్తుతం మరో 10 పార్కులు నిర్మాణంలో ఉన్నట్లు చెబుతున్నారు. మరో 25 నుంచి 30 పార్కులు ప్రణాళికల్లో ఉన్నట్లుగా వెల్లడి.

ఎంవీపీకాలనీ సెక్టార్‌-1 వెంకోజీపాలెం దగ్గర హరితవనం అనే పార్కును ఈ మధ్యే నిర్మించారు. రూ.20 లక్షలు కాలనీవాసులు సమకూర్చుకోగా, మరో రూ.40 లక్షలు జీవీఎంసీ నుంచి ఇచ్చారు. వన్‌టైం గ్రాంట్‌ ద్వారా ఈ పార్కును చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని జీవీఎంసీ సమీక్షిస్తోంది.

సిరిపురం జంక్షన్‌ హెచ్‌ఎస్‌బీసీ కార్పొరేట్‌ కార్యాలయం ఎదురుగా సిరిపురం పార్క్‌ పేరుతో ఈమధ్యే వనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 700 గజాల్లో ఉన్న చిన్న పార్కును ఏయూతో కలిసి డిజైన్‌ చేయించుకున్నారు. స్థానికులు స్వతహాగా రూ.12 లక్షలు పోగు చేయగా.. మిగిలిన మొత్తాన్ని జీవీఎంసీ నుంచి పొంది చక్కగా నిర్వహించుకుంటున్నారు.

ప్రధాన నగరంలో ఇప్పుడు పార్కులకు స్థలం ఉండటం లేదు. దీనికి బయటే అవకాశం కనిపిస్తోంది.

కొన్నిచోట్ల పార్కుల నిర్వహణ భారంగా ఉన్నప్పటికీ కాలనీ కమిటీలు సమష్ఠిగా ప్రణాళికలు వేసుకుని.. తిరిగి జీవీఎంసీకి దరఖాస్తు పెట్టుకుని నిధులు పొందడం ద్వారా పార్కుల్ని పునరాభివృద్ధి చేసుకుంటున్నారు. తమ పరిశీలనలో 95 శాతం పార్కుల్లో పచ్చికల నిర్వహణ బాగుందని జీవీఎంసీ అధికారులు అంటున్నారు.

పచ్చదనానికే ఓటు..: 
గతంతో పోల్చితే ఇప్పుడు పచ్చదనం మీద నగరవాసుల్లో మంచి అవగాహన వచ్చిందనేది ఒక పరిశీలన. అయితే వారివారి ఇంటి ఆవరణల్లో మొక్కలు పెంచే స్థలం లేనివారు మాత్రమే వాటిని విస్మరిస్తున్నారని.. మిగిలినవారు మొక్కల ప్రేమికులుగా విరివిగా నాటుతున్నారని నిపుణులు అంటున్నారు. నగరంలో సుమారు 40శాతం పైగా ఇళ్లలో ఆవరణలు బాగున్నాయని.. వాటిలో కొంతభాగం మొక్కల పెంపకానికి వదిలేస్తున్నారనేది జీవీఎంసీ పరిశీలనలో తేలింది.

ఇంటిపైనే ఆహ్లాదం..: 
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 33శాతం పచ్చదనం నగరంలో ఉండాలని అంటారు. భవనాల నుంచి వచ్చే వేడిగాలిని, ఈ చెట్ల నుంచి వచ్చే చల్లగాలి సమతౌల్యం చేసేలా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పుడు నగరంలో జీ+1 సంస్కృతిని దాటి జీ+3, అంతకుమించి భవనాల నిర్మాణాలు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో 33 శాతం పచ్చదనం ఏమాత్రం సరిపోదని నిపుణులు భావిస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇంటి పైకప్పుల మీద పచ్చికల్ని పెంచే సంస్కృతికి అలవాటుపడాలని పిలుపునిస్తున్నారు. ఇప్పటికే నగరంలో ఈ తరహా సంస్కృతి 2 నుంచి 5శాతం వరకు ఉండొచ్చనే అంచనాలున్నాయి. దీన్ని విరివిగా పెంచగలిగితే ఆక్సిజన్‌ పరంగా మంచి లాభాలుంటాయని, కాలుష్యం కూడా తగ్గుతుందని అంటున్నారు.

పార్కు కావాలి అనుకుంటే.. 
కాలనీల్లో మంచి పార్కును ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కచ్చితంగా ఉండి తీరాలని అంటున్నారు జీవీఎంసీ ఉద్యాన అధికారి దామోదర్‌. వారి ప్రాంతంలో స్థలం అందుబాటులో ఉంటే జీవీఎంసీ ఉద్యానం, ఇంజినీరింగ్‌ విభాగాల్ని సంప్రదించి అనుమతులు తీసుకోవాలని అన్నారు. ఆ కాలనీ అసోసియేషన్‌ పార్కు నిర్మాణానికి సంబంధించి 1/3 నిధుల్ని సమకూర్చుకుని బ్యాంకులో వేసుకుంటే.. జీవీఎంసీ వారికి 2/3 నిధుల్ని వన్‌టైం గ్రాంట్‌గా అందిస్తుందని తెలిపారు. వారే నిర్మించుకుని, నిర్వహించుకోవాలని ఆయన అంటున్నారు. దీన్ని జీవీఎంసీ పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఆ పార్కును వాణిజ్యపరంగా మార్చాలనుకోవాలన్నా జీవీఎంసీ అనుమతులు తప్పనిసరి.

రాజస్థాన్‌ బాట ఆదర్శం.. 
విక్‌సత్‌ అనే స్వచ్ఛంద సంస్థ పలు రాష్ట్రాల్లో పచ్చదనం నేపథ్యంలో పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇదే సంస్థ ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో మొక్కల పెంపకం మీద వినూత్న పద్ధతుల్ని తీసుకునివచ్చింది. జైపూర్‌, ఉదయ్‌పూర్‌, బికనేర్‌ లాంటి ప్రాంతాల్లో కొన్ని కాలనీ కమిటీల్ని ఏర్పాటు చేయడమే కాకుండా.. ఆయా వీధుల్లో నాటిన మొక్కల్ని సంరక్షించే బాధ్యతను ప్రతీ వీధికి పదిమందికి అప్పగిస్తున్నారు. వారు చేయాల్సిందల్లా కేవలం ఆ మొక్కలకు రక్షణ బాధ్యతలు తీసుకోవడమే. ఆ మొక్కలకు నీరు పోసేందుకు ప్రత్యేక సిబ్బంది ఉన్నా.. వీరు మాత్రం ఆ మొక్కలకు ఎలాంటి హానీ కలగకుండా నిత్య నిఘా వేయడం, రక్షణ కవచాలు ఏర్పాటుచేయడం చేస్తారు. ఇది ఇప్పటికీ అమలవుతోంది.

పచ్చికల థెరపీ.. 
నగరంలో ఇంకా పచ్చదనం భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఇప్పటిదాకా సాగిన మొక్కల పెంపకంపై మీద సర్వత్రా అభినందనలే వస్తున్నాయి. జీవీఎంసీ పరిధిలో మొత్తం 50లక్షలకు పైగా మొక్కలు వివిధ విభాగాలవారు నాటినట్లుగా లెక్కలు చూపుతున్నారు. ఇందులో గ్రీన్‌విశాఖ కింద 30 లక్షల వరకు మొక్కలు నాటినట్లు అంచనాలున్నాయి. అలాగే నగరంలోని 23 పరిశ్రమల పరిధిలో ప్రత్యేక పచ్చికల్ని ఏర్పాటు చేసినట్లూ చెబుతున్నారు. రైల్వేపరంగా గతేడాది వారివారి స్థలాల్లో 72వేల మొక్కలు నాటినట్లుగా చూపుతున్నారు. వీరితో పాటు నేవీవారు కూడా ఇక్కడి సంప్రదాయ మొక్కల్నే నాటారు. కంబాలకొండ, సింహాచలం, యారాడ, కైలాసగిరిలో మంచి మొక్కలు, చెట్లు ఉన్నాయి. స్థానిక సంప్రదాయ మొక్కల్ని ఇలాగే విరివిగా పెంచుకుంటూపోతే విశాఖ నగరమొక ‘గ్రీన్‌ థెరపీ’లా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

vsp-sty4b.jpg
Link to comment
Share on other sites

18 minutes ago, mahesh1 said:

Vizag la job vaste akakde settle itha na laddu lodi

stand in queue.....akkkada edho consultancy vundhi vayya.....Big consultncy.....kanukkoni cheptha.

Link to comment
Share on other sites

6 minutes ago, BaabuBangaram said:

stand in queue.....akkkada edho consultancy vundhi vayya.....Big consultncy.....kanukkoni cheptha.

cheppu vasta..

Link to comment
Share on other sites

మొక్కలను చంపేశారు..! 
రూ.కోటి ఖర్చు చేశారు 
రెండేళ్లుగా కాపాడినవన్నీ ఎండిపోయాయి 
ఈనాడు, అమరావతి 
kri-gen1a.jpg

విజయవాడ బెంజిసర్కిల్‌ నుంచి రామవరప్పాడు వరకు జాతీయ రహదారి, సర్వీసు రోడ్లకు మధ్యలో ఇరువైపులా ఉన్న పచ్చదనం మొత్తం సర్వనాశనం అయిపోతోంది. గత రెండేళ్లలో మూడు దఫాలుగా బెంజిసర్కిల్‌ నుంచి రామవరప్పాడు వరకూ 4.5 కిలోమీటర్ల దూరంలో రహదారికి ఇరువైపులా ఉన్న చెట్ల మధ్య ప్రాంతాన్ని శుభ్రం చేసి.. అందమైన మొక్కలను నాటించారు. మొక్కల కొనుగోలుకు, నాటించడానికి కూలీలకు, వాటికి నీరుపోసి సంరక్షించడానికి ఇప్పటివరకూ కార్పొరేషన్‌ నిధులను రూ.కోటి వరకు ఖర్చు పెట్టారు. నిన్నమొన్నటి వరకు వాటికి నీటిని పోసేవారు. ప్రస్తుతం పైవంతెన పనుల కోసం బెంజిసర్కిల్‌ నుంచి రమేష్‌ ఆసుపత్రి జంక్షన్‌ వరకూ ఉన్న చెట్లన్నింటినీ కొట్టేశారు. దీంతో వాటి కిందనే ఉన్న అనేక మొక్కలనూ తొలగించేశారు. రమేష్‌ ఆసుపత్రి నుంచి రామవరప్పాడు వరకూ మొక్కలు అలాగే ఉన్నా.. ఇదే అదనుగా వాటికీ నీళ్లు పోయడం మానేశారు. దీంతో ఎంతో విలువైన ఆ మొక్కలన్నీ ప్రస్తుతం ఎండిపోయాయి. రెండేళ్లుగా చేసిన కృషి, పెట్టిన డబ్బులు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. అసలే డబ్బులు లేక.. ఇబ్బందిపడుతున్న విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఇలా.. అభివృద్ధి చేసిన వాటినీ దుర్వినియోగం చేయడం దారుణం. ప్రకృతిని నిర్లక్ష్యం చేసిన పాపానికి.. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొనాల్సి వస్తోంది. విజయవాడ, గుంటూరు నగరాల్లో పచ్చదనం ఉన్నదే.. తక్కువ అది కూడా లేకుండా చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రకృతి మార్పుల నేపథ్యంలో వచ్చే ఐదు నుంచి పదేళ్లలో నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. విజయవాడలాంటి నగరాలలో ఇప్పటికే బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి ఉంటోంది. మరో నాలుగు డిగ్రీలు పెరగడమంటే.. ప్రాణాలను పణంగా పెట్టడమే. గత ఏడాదితో పోలిస్తేనే.. ఈసారి మరింత ఎండలు పెరిగిపోయాయి. ఏప్రిల్‌ నెలారంభం నుంచే 40డిగ్రీలకు పైగా ఎండ తీవ్రత నమోదవుతోంది. ప్రస్తుతం ఉదయం 10గంటలకే ఎండలు 41డిగ్రీలను దాటుతున్నాయి. అయినా.. భవిష్యత్తు ప్రమాదాన్ని వూహించే పరిస్థితి లేకుండాపోతోంది. రెండేళ్ల కిందటివరకూ జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ఈ చెట్ల మధ్య ప్రాంతమంతా ముళ్లపొదలు, డొంకలతో అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది. నగరంలోనికి ఎవరు వచ్చినా.. ఇటువైపు నుంచే రావాలి. అందుకే నగర ముఖద్వారంగా ఉన్న ఈ ప్రాంతంపై అప్పటి కలెక్టర్‌ బాబు.ఎ, కమిషనర్‌ వీరపాండియన్లు ప్రత్యేక దృష్టిసారించారు. విజయవాడకు చెందిన క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎన్విరాన్‌మెంట్‌ సొసైటీ సహకారం అందించింది. అంతా కలిసి.. జాతీయ రహదారికి ఇరువైపులా.. శుభ్రంగా చేసి.. మధ్యలో నడకదారులను ఏర్పాటు చేసి, చిన్న పార్కుల మాదిరిగా చేశారు. ఈ ప్రాంతంలో ఆహ్లాదకరమైన, విలువైన మొక్కలను కడియం నర్సరీల నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చి మరీ ఇక్కడ నాటించారు. ఒక్కో మొక్క రూ.25 నుంచి రూ.500 వరకూ విలువ చేసేవి వీటిలో ఉన్నాయి. పలు రకాల క్రోటన్‌లు, నీడలో పెరిగే జాతుల మొక్కలు చాలారకాలు వీటిలో ఉన్నాయి. కొన్ని చిన్నవి, మరికొన్ని పెద్దవి కలిపి రకరకాల సైజుల్లోని మొక్కలున్నాయి. కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో కొన్ని, సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మరికొన్ని చొప్పున.. వేల సంఖ్యలో ఈ మొక్కలను నాటారు. వీటిలో చాలావరకూ తీసి వేరేచోట నాటేందుకు అనువైనవే ఉన్నాయి. అయినా.. ఒక్క మొక్కనూ తీసింది లేదు. ఈ విలువైన చిన్న మొక్కలను సర్వనాశనం చేశారు.

మిగతావి ఎందుకొదిలేశారో.. 
బెంజిసర్కిల్‌ నుంచి రమేష్‌ ఆసుపత్రి వరకూ ఉన్న చెట్లను కొట్టేయడంతో వాటి కింద ఉన్న మొక్కలనూ పీకి పడేశారు. అక్కడి నుంచి రామవరప్పాడు వరకూ ఉన్న మొక్కలను ఎందుకు గాలికొదిలేశారనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. బెంజిసర్కిల పైవంతెన కోసం చెట్లను కొట్టడంతో అక్కడి మొక్కలు చచ్చిపోయాయనుకోవచ్చు. మరి మిగతా చెట్లన్నీ ఉండగా.. వాటి కింద నాటిని మొక్కలకు నీళ్లు పోయకుండా ఎందుకు వదిలేశారనేది తేల్చాల్సి ఉంది. వీటికి నీళ్లను పోసి.. సంరక్షించాల్సిన బాధ్యతను ఓ గుత్తేదారుకు అప్పగించారు. దొరికిందే సందన్నట్టుగా.. బెంజిసర్కిల్‌ ప్రాంతంలో చెట్లను కొట్టడంతో.. మొత్తం నాలుగున్నర కిలోమీటర్ల మేర మొక్కలకు నీళ్లు పోయడం ఆపేశారు. దీనివల్లే ఈ విలువైన మొక్కలన్నీ ప్రస్తుతం ఎండిపోయి.. చచ్చిపోయాయి. స్థానికంగా ఉండే ఆర్టీసీ కాలనీ సహా పలువురు సంఘాలు ముందుకొచ్చి.. ఆ మొక్కలు చాలా విలువైనవి కావడంతో తాము తీసుకెళ్తామన్నా.. అక్కడున్నవాళ్లు అనుమతించలేదని వాపోతున్నారు.

ప్రత్యామ్నాయంగా ఒక్కటీ నాటలేదు.. 
అటవీప్రాంతం ఎకరం తీసుకుంటే.. రెండెకరాల్లో చెట్లు చూపిస్తేనే అనుమతి ఇస్తున్నారు. ఒక చెట్టుకు రెండు చెట్లు చూపించాల్సి ఉంటుంది. విజయవాడ లాంటి నగరాల్లోనూ ఇదే విధానం అమలు చేయాల్సి ఉంది. గన్నవరం నుంచి విజయవాడ వరకూ ముస్తాబాద్‌, బుడమేరు, లంబాడీ, పాయకాపురం, బెజవాడ డొంక పేర్లతో.. చుట్టుపక్క గ్రామాల నుంచి నగరానికి 17రకాల డొంక రోడ్లు ఉన్నాయి. ఈ లింకు రోడ్లన్నీ విజయవాడకే వస్తున్నాయి. వీటన్నింటి పక్కనా వేల సంఖ్యలో మొక్కలు నాటొచ్చు. కానీ ఒక్క మొక్క నాటడం లేదు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును వేశారు.. అటూఇటూ ఒక్క మొక్క నాటలేదు. కేవలం డివైడర్ల మధ్యలో అలంకరణ మొక్కలను నాటారు. ఇవి కేవలం చూసేందుకు అందంగా ఉండేందుకు తప్ప వీటివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.

Link to comment
Share on other sites

3 minutes ago, solman said:

@ARYA uncle ilanti threads eppudu vestavu nuvvu *&Y&

thaata already oka 200 pages taadu vesa..ika evado mod gadu stomach burning tho lepesadu ika lite teskunna :) 

Link to comment
Share on other sites

9 minutes ago, ARYA said:

thaata already oka 200 pages taadu vesa..ika evado mod gadu stomach burning tho lepesadu ika lite teskunna :) 

malli start cheyyi uncle

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...