కడప జిల్లాలోని గండికోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని 2015లో గండికోటను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అలాగే జమ్మలమడుగు నుంచి గండికోట వరకు ఉన్న 14 కిలోమీటర్ల రహదారిని రూ.16కోట్లతో నాలుగు వరుసల దారిగా విస్తరిస్తామని ప్రకటించారు. ఇప్పుడా హామీలు నెరవేరబోతున్నాయి. గండికోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మరో నెల రోజుల్లో అంకురార్పణ జరగనుంది. గండికోట వద్ద పెన్నా నది భూ నిధిలోని 2వేల ఎకరాల్లో అయిదు జోన్లుగా పర్యాటక వసతులను అభివృద్ధి చేయాలని రాష్