Jump to content

ఈమెను చూసి జగన్ అంత భయపడుతున్నాడా ?


Hitman

Recommended Posts

తొలిసారి ఎమ్మెల్యే అయిన తండ్రిచాటు బిడ్డ ! మంత్రిపదవిలో నిలదొక్కుకునేందుకు ప్రయాసపడుతున్న లీడర్. ఆమెను చూసి విపక్షం అంత భయపడుతోందా ? 15 రోజుల్లో ఇద్దర్ని చేర్చుకొని పావులు కదుపుతోందా ? నంద్యాల చుట్టూ అసలు ఏం జరుగుతోంది ?

కర్నూల్లో ఎన్నికల హడావుడి ఎక్కువైంది. అది కూడా అనుకోని పరిస్థితుల్లో ! 2014 ఎన్నికల సమయంలో శోభానాగిరెడ్డి యాక్సిడెంట్ లో చనిపోవడంతో ఆళ్లగడ్డ ఎన్నిక ప్రత్యేకంగా జరిగింది. అటు తర్వాత మొన్న భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఇప్పుడు నంద్యాలలో ఉపఎన్నికల వచ్చింది. మా నాయన చనిపోయి వచ్చిన ఉపఎన్నిక కాబట్టి టిక్కెట్ మాకేనంటున్నారు అఖిల ప్రియ. అటు ముందు నుంచి టీడీపీ తరపున మేం కావలి కాస్తున్నాం కాబట్టి మాకే దక్కాలంది శిల్పావర్గం. ఇప్పుడు పార్టీ మారేసరికి అసలు గొడవే లేదు అనుకోండి ! మామూలుగా అయితే విపక్షం హుషారుగా సిద్ధపడి ఉండాలి. కానీ జగన్ మాత్రం కనుచూపుమేరలో ఉన్నవాళ్లందరినీ చేర్చుకుంటూ పోతున్నాడు.

 

మొన్న గంగుల. ఇప్పుడు శిల్పా ! ఇంతమందిని చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఎందుకింత భయపడుతున్నాడు ? ఎందుకంటే… నంద్యాలలో అఖిల ప్రియ గేరు మార్చింది. నేను చూసుకుందా నంద్యాల అని చంద్రబాబు ఇచ్చిన భరోసాతో అడుగు వేస్తోంది హుషారుగా ! పదివేల పక్కా ఇళ్లు కట్టిస్తోంది. డ్రైనేజీ పనులు… మరుగు రొడ్లు… గిడ్డంగుల నిర్మాణం లాంటివన్నీ వేగంగా జరుగుతున్నాయ్. కళ్లముందు పనులు కనిపిస్తున్నాయ్. ఎవరేంటో నంద్యాలకి తెలుసు. అయినా ఏదోరకంగా పరువు నిలుపుకోవాలన్న ప్రయాసలో వరసగా రెండు చేరికలు జరిగాయ్. డిఫన్స్ లో ఉన్నాడురా జగన్ అనే ఫీలింగ్ జనంలోకి పంపుకున్నాడు స్వయానా ! అంత ఎందుకు భయపడుతున్నాడు అంటే… సింపుల్ అఖిలప్రియ పనితీరు ! పార్టీ అండ్ భూమా గుడ్ విల్. దాని మీదు నిలబడ్డం సాధ్యం కాదన్న అపనమ్మకం. దానికి మరోపేరే భయం !

Link to comment
Share on other sites

By taking both Silpa and Gangula .. Jagan has raised the stakes in Nandhyal

If he loses .. he will be losing not to TDP but to a young woman called Bhooma Akhila Priya.

She will have her revenge against the YSR family which tormented her.

Finish them .. bury them .. young lady

ఈమెను చూసి జగన్ అంత భయపడుతున్నాడా ?

Link to comment
Share on other sites

4 minutes ago, Annayya_fan said:

By taking both Silpa and Gangula .. Jagan has raised the stakes in Nandhyal

If he loses .. he will be losing not to TDP but to a young woman called Bhooma Akhila Priya.

She will have her revenge against the YSR family which tormented her.

Finish them .. bury them .. young lady

ఈమెను చూసి జగన్ అంత భయపడుతున్నాడా ?

intaki Nandyal lo TDP candidate evaru? 

Link to comment
Share on other sites

8 minutes ago, Annayya_fan said:

bhuma brahmananda reddy antunnaru

నంద్యాల నియోజకవర్గంలో పట్టుకోసం భూమా బ్రహ్మనందరెడ్డి ప్రయత్నాలు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పట్టుకోసం భూమా బ్రహ్మనందరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. భూమా కుటుంబానికి టిక్కెట్టును కేటాయించాల్సి వస్తే భూమా బ్రహ్మనందరెడ్డిని ఆ కుటుంబం నుండి బరిలోకి దింపే అవకాశాలు లేకపోలేదు.భూమా నాగిరెడ్డి సోదరుడి కొడుకే బ్రహ్మనందరెడ్డి. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. భూమా అనుచరులు ఎవరూ కూడ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. భూమా ఇచ్చిన నిధులు ఏమైనా పెండింగ్ లో ఉన్నాయా అంటూ తన అనుచరులను అడిగి తెలుసుకొన్నారు. ఈ క్రమంలోనే రూ. కోటి విలువైన ప్రతిపాదనలు పంపిన గోస్పాడు, గోవిందపల్లె రోడ్డును ఆయన పరిశీలించారు.భూమాలేని లోటును తీర్చేందుకు శాయశక్తులా కృషిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.తన కుటుంబం మొదటి నుండి రాజకీయాలతో సంబంధం ఉన్నందున అన్ని విషయాలపై తనకు అవగాహాన ఉందన్నారు బ్రహ్మనందరెడ్డి.

bl@st

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...