Jump to content

ఇంజినీర్ ఆస్తులు రూ.500కోట్లు!


TampaChinnodu

Recommended Posts

ఇంజినీర్‌ ఆస్తులు రూ.500కోట్లు! 
అనిశా సోదాల్లో వెలుగులోకి..

విజ‌య‌వాడ‌: అనివీతి నిరోధ‌క‌ శాఖ అధికారులే విస్తుపోయే అక్రమార్జన వ్యవహారం బయటపడింది.  ప్రజారోగ్యశాఖ పురపాలక‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ డాక్టర్ పాము పాండురంగారావు ఆదాయానికి మించి ఆస్తుల కేసు అతిపెద్దదిగా నమోదైంది. ప్రాథమిక అంచనా ప్రకారం ఆక్రమాస్తుల విలువ సుమారు రూ.500 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. పాండురంగారావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

ఆదాయానికి మించి ఆస్తుల అభియోగంపై పాండురంగారావు ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక బృందాలు ఏకకాలంలో 14 చోట్ల సోదాలు జరిపాయి. ప్రాథమికంగా రూ.12 కోట్ల విలువైన రిజిస్టర్డ్‌ ఆస్తులను గుర్తించారు. ప్రస్తుత మార్కెట్  విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ.500కోట్ల వరకు ఉంటుందని అనిశా అధికారులు అంచనా వేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పాండురంగారావు నివాసంలో ఉదయం నుంచి బాగా పొద్దుపోయేంత వరకు అనిశా బృందం సోదాలు జరిపింది. అక్రమాస్తుల విలువ మదింపు చేసేందుకు గంటల సమయం పట్టింది. తనిఖీ బృందాలు ప్రాథమికంగా సేకరించిన వివరాలతో అనిశా డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.పి.ఠాకూర్  ఐదు పేజీల ప్రకటన విడుదల చేశారు. మొత్తం 42 ప్లాట్ల కొనుగోలు చేశార‌ని, ఒక్క విశాఖలోనే 20 ప్లాట్లు వరకు ఉన్నాయ‌ని తెలిపారు. గుంటూరులో 8, హైదరాబాద్‌లో 7, పశ్చిమగోదావరిలో 6, విజయనగరంలో ఒక ప్లాట్‌ను గుర్తించిన‌ట్లు చెప్పారు.

హైదరాబాద్‌లో జీ+2 గృహంతోపాటు పెంట్‌హౌస్ ఒకటి... విశాఖ, కృష్ణా జిల్లా కొచ్చెర్లలో రెండు సొంతిళ్లులు పాండురంగారావు నిర్మించిన‌ట్లు తెలిపారు. హైదరాబాద్‌లో వాణిజ్య భూమి ఎకరం, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో 24 ఎకరాల వ్యవసాయ భూమి పాండురంగారావు.. అతని కుటుంబ సభ్యుల పేరిట ఉన్నట్లు కనుగొన్నారు.  విశాఖపట్నంలోని ఆరోగ్య నగరంలో అశ్విని ఆసుపత్రి నిర్మాణానికి రూ.4 కోట్ల పెట్టుడి పెట్టారు. విశాఖపట్నంలో తన కుమారుడి పేరిట రైటన్‌ సాఫ్ట్‌ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్‌ సంస్థ ఉంది. అతని భార్య పేరిట హెచ్ఎం టెక్నోక్రాట్స్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీ ఉంది. సుదీర్‌ సోలార్‌ పవర్‌ అండ్‌ సునీల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థలో 66 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు ఆధారాలు సేకరించారు. 
పాండురంగారావు నివాసం నుంచి రూ.9 లక్షల నగదు, రూ.25 లక్షల  బ్యాంకు డిపాజిట్ పాస్‌పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. బంగారం బిస్కెట్లు,  నాణాలు, ఆభరణాలు, స్వర్ణ వజ్రాభరణాలు సుమారు కేజీకి పైగా అనిశా సోదాల్లో బయటపడ్డాయి. మ‌రో తొమ్మిది కేజీల వెండి వస్తువులు లభించాయి. ఇందులో ఎక్కువ సంఖ్యలో వెండి కంచాలు, గ్లాసులు ఉన్నాయి.  1.95 లక్షల అమెరికన్‌ డాలర్లు లభ్యమయ్యాయి. ఓ ద్విచక్ర వాహనం కూడా స్వాధీనం చేసుకున్నారు. 

Link to comment
Share on other sites

  • Replies 40
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    20

  • DiscoKing

    5

  • Akkumm_Bakkumm

    3

  • Kool_SRG

    2

Top Posters In This Topic

24 minutes ago, SANANTONIO said:

CITI_c$yCITI_c$y

dorikonolle dongalu

aina 500 crores endi ra ayya

evadiko kadupu mandi kali untadi inka

Kattappa kadu kavochu anduke pattukuni untaru.. just to bluff the people that the govt is against corruption ani cupinchadaniki. Just like the way mukku dora did in Nayeem case.@3$%

Link to comment
Share on other sites

27 minutes ago, Akkumm_Bakkumm said:

Kattappa kadu kavochu anduke pattukuni untaru.. just to bluff the people that the govt is against corruption ani cupinchadaniki. Just like the way mukku dora did in Nayeem case.@3$%

IT department,  full central support to chelaregi pottunaru...Katappa ayina ok..kasiga unnaru..good going...@~`

Link to comment
Share on other sites

3 minutes ago, Hitman said:

IT department,  full central support to chelaregi pottunaru...Katappa ayina ok..kasiga unnaru..good going...@~`

show off konni days ki. after few months bayataki vachi same ade job lo malli danda shuru. nothing new. decades nundi nadusthunna process.

Link to comment
Share on other sites

కోట్ల కట్టల‘పాము’
 
రూ.500 కోట్లు.. ప్రజారోగ్య శాఖ ఈఎన్‌సీ అక్రమ సంపాదన 
 
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/తాడేపల్లి: రాష్ట్ర ప్రజారోగ్య శాఖలో ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ)గా పనిచేస్తున్న ఉన్నతాధికారికి అక్రమ సంపాదన అనే అనారోగ్యం పట్టుకుంది. ఏకంగా రూ.500 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టాడు. పలు నగరాలు, పట్టణాల్లో భారీ భవనాలు, ఇళ్ల స్థలాలు,  వాహనాలు, విలువైన గృహోపకరణాలు, బంగారం, వెండి ఆభరణాలు, వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు, బ్యాంకు ఖాతాల్లో నగదు.. ఇలా అన్ని రూపాల్లో దాచిపెట్టాడు. తన మిత్రుడితో కలిసి విశాఖపట్నంలో రూ.100 కోట్ల విలువైన కార్పొరేట్‌ ఆసుపత్రి నిర్మిస్తున్నాడంటే అతడి అక్రమార్జన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరకు పాపం పండి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలలో చిక్కాడు. రాష్ట్ర చరిత్రలో ఇదే అతిపెద్ద అవినీతి కేసు అని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అతడి మిత్రుడిని కూడా అధికారులు అరెస్టు చేశారు. 
 
ఎక్కడ చూసినా ఆస్తులే ఆస్తులు  
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రాష్ట్ర ప్రజారోగ్య శాఖ ఈఎన్‌సీ డాక్టర్‌ పాము పాండురంగారావు, అతడి వ్యాపార భాగస్వామి, విశాఖపట్నం ఆంధ్రా వైద్య కళాశాల ప్రొఫెసర్, కేజీహెచ్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నల్లి బాబూ విజయ్‌కుమార్‌ ఇళ్లు, వారి బంధువులు, స్నేహితుల నివాసాలపై శుక్రవారం ఏసీబీ  దాడులు చేపట్టింది. గుంటూరు జిల్లా తాడేపల్లి, విజయవాడ, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలతోపాటు హైద రాబాద్‌లో పాండురం గారావు నివాసాలు, ఆస్తులపై దాడులు చేశారు.  విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌ నగరాల్లో నివాస స్థలాలు, హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు పక్కన ఎకరం ఖాళీ స్థలం ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు కుమారులు, భార్య పేర్లపై ఉన్న పలు ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 18 జిల్లాల్లో పాండురంగారావుకు రూ.500 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పాండురం గారావు నివాసంలో దాదాపుగా 100 ఆస్తి పత్రాలతోపాటు కీలకమైన సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. మొత్తం 42 నివాస ప్లాట్ల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోగా, అందులో 22 ప్లాట్లు విశాఖపట్నంలోని ఖరీదైన ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. తాడేపల్లిలో పాండురంగారావును ఏసీబీ అధికారులు విచారించారు. 
 
కుమారులకు కంపెనీలో వాటాలు 
విశాఖపట్నంలో పాండురంగారావు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆయన మిత్రుడు ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్, బావమరిది, జీసీసీ రిటైర్డ్‌ జనరల్‌ మేనేజర్‌ పి.కృష్ణారావు, సమీప బంధువు, జీవీఎంసీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రాజేంద్రకుమార్‌ల ఇళ్లల్లోనూ సోదాలు చేశారు. ఏకకాలంలో ఎనిమిది చోట్ల దాడులు జరిగాయి. మాధవధారలోని విజయ్‌కుమార్‌ నివాసం, కేజీహెచ్‌లోని కార్యాలయం, కలెక్టరేట్‌ డౌన్‌లోని క్లినిక్, వుడా పార్కు వద్ద ఉంటున్న ఆయన కుమార్తె ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు. పాండురంగారావు బావమరిది ఉంటున్న కొమ్మాదిలోని రెండంతస్తుల భవనంలో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. పాండురంగారావు కుమారుల కు ఆరిలోవలోని సెల్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో వాటాలు ఉన్నట్లు కనుగొన్నారు. పాండురంగారావు పేరుతో నాలుగు ప్రాంతాల్లో 6.50 ఎకరాల భూములు, మూడు చోట్ల ఇళ్లు, ఏడు ప్రాంతాల్లో స్థలాలు ఉన్నాయి. ఆయన భార్య పేరుతో 35 ప్రాంతాల్లో స్థలాలు(ఫ్లాట్స్‌) ఉన్నాయి. ఆయన కుమారుల పేరుతో ప్రైవేట్‌ సంస్థల్లో రూ.66 లక్షల పెట్టుబడులు ఉన్నాయి. 
 
విజయ్‌కుమార్‌కు రూ.3.58 కోట్ల ఆస్తులు 
పాండురంగారావు వ్యాపార భాగస్వామి, ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్‌ ఆస్తులపై కూడా ఏసీబీ దాడులు నిర్వహించింది. విశాఖపట్నం, నర్సాపురంలో జరిగిన సోదాల్లో రూ.3.58 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు.  
 
కేసులు నమోదు: ఏసీబీ డీజీ 
తిరుపతి క్రైం: రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయానికి మించి ఆస్తులు కూడపెట్టిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి, వారి ఆస్తులపై దాడులు చేశామని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ చెప్పారు. ఆయన శుక్రవారం తిరుపతి ఏసీబీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. విజయవాడలో పబ్లిక్‌ హెల్త్‌ విభాగంలో ఇంజనీర్‌ అండ్‌ చీఫ్‌గా పనిచేస్తున్న పాము పాండరంగారావు(58), అతడి కుటుంబ సభ్యుల పేరిట రూ.12 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించామన్నారు. పాండురంగారావుకు 7 ప్లాట్లు, 3 ఇళ్లు, అతని భార్య  రాజ్యలక్ష్మి కి 35 ప్లాట్లు, 21 వ్యవసాయ భూములు, 2 ఇళ్లు, వారి కుమారుడు  సునీల్‌ పేరిట 3 కంపెనీలు, 2 ఫార్మా సంస్థలు, నగదు, బ్యాంక్‌ బ్యాలెన్స్, వెండి, బంగారు నగలు, వాహనాలను  గుర్తించామన్నారు. పాండురంగారావును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు. ఆంధ్రా మెడికల్‌ కళాశాల ప్రొఫెసర్‌  నల్లి బాబూ విజయ్‌కుమార్‌ ను అరెస్ట్‌ చేసి, విశాఖ ఏసీబీ కోర్టుకు తరలించామన్నారు. 
 
గతంలోనూ ఫిర్యాదులు 
కృష్ణా జిల్లా కలిదిండి మండలం కొచ్చర్ల గ్రామానికి చెందిన పాము పాండురంగారావు 1987లో డీఈఈగా ప్రభుత్వ సర్వీసులో చేరారు. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ నుంచి చీఫ్‌ ఇంజనీర్‌ వరకు పదోన్నతులు పొందుతూ గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీవీఎంసీ)లోనే కొనసాగారు. ఇక్కడే అంతులేని సంపాదనకు శ్రీకారం చుట్టారు. ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్‌తో మిత్రబం ధం ఏర్పరచుకున్నారు. వీరిద్దరూ కలిసి విశాఖపట్నం ఆరిలోవ హెల్త్‌సిటీలో రూ.100 కోట్లతో మల్టీపర్పస్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మిస్తున్నట్లు తెలిసింది. పాండురంగారావుపై ఏసీబీకి గతంలోనూ ఫిర్యాదులు అందాయి.  
Link to comment
Share on other sites

1 minute ago, DiscoKing said:

thank you ACB... 

Already 58 years age. case court lo decide ayye time ki 20-30 years padathadi. matter over.

Link to comment
Share on other sites

2 minutes ago, TampaChinnodu said:

Already 58 years age. case court lo decide ayye time ki 20-30 years padathadi. matter over.

so  ee lekana jagan case kooda safe ee antav

Link to comment
Share on other sites

4 minutes ago, DiscoKing said:

so  ee lekana jagan case kooda safe ee antav

center decide sese daaka safe ee. time vachinappudu shashikala case type lo overnight judgement vachesthadi.

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

center decide sese daaka safe ee. time vachinappudu shashikala case type lo overnight judgement vachesthadi.

hmm delhi tour baaga working anamata @3$% 

Link to comment
Share on other sites

2 minutes ago, DiscoKing said:

hmm delhi tour baaga working anamata @3$% 

jagan cases , notes for vote cases rendu move kaavu. political situation batti move avvalsina situation vasthey move sepistharu.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...