Jump to content

దువ్వాడ జగన్నాథం రివ్యూ


ye maaya chesave

Recommended Posts


                                             Image result for duvvada jagannadham wallpapers


చిత్రం : ‘దువ్వాడ జగన్నాథం’ 

నటీనటుల: అల్లు అర్జున్ - పూజా హెగ్డే - రావు రమేష్ - మురళీ శర్మ - సుబ్బరాజు - పోసాని కృష్ణమురళి - తనికెళ్ల భరణి - చంద్రమోహన్ - వెన్నెల కిషోర్ - శశాంక్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: అయానంక బోస్
స్క్రీన్ ప్లే: రమేష్ రెడ్డి - దీపక్ రాజు
నిర్మాత: దిల్ రాజు
కథ - మాటలు - దర్శకత్వం: హరీష్ శంకర్


కథ: 

చిన్నతనం నుంచే అన్యాయం అంటే సహించని బ్రాహ్మణ కుర్రాడు దువ్వాడ జగన్నాథం అలియాస్ డీజే (అల్లు అర్జున్). ఓవైపు తండ్రితో కలిసి క్యాటరింగ్ నడుపుతూనే.. మరోవైపు ఒక పోలీస్ సహకారంతో అక్రమార్కుల భరతం పడుతుంటాడు. తన ఐడెంటిటీ తెలియకుండా డీజే పనులు చక్కబెడుతున్న సమయంలో ఒక భారీ కుంభకోణం బయటికి వస్తుంది. దాని వల్ల తన ఆత్మీయుడు చనిపోవడంతో డీజే రంగంలోకి దిగుతాడు. ఈ కుంభకోణం వెనుక ఉన్నఅసలు వ్యక్తి  రొయ్యల నాయుడు (రావు రమేష్)..  మరి డీజే.. అతణ్ని ఎలా ఎదుర్కొన్నాడు.. తన మిషన్ ఎలా కొనసాగించాడు.. ఈ కుంభకోణం వల్ల బాధితులైన కుటుంబాల్ని ఎలా ఆదుకున్నాడు.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ: 

అవడానికి రొటీన్ కధే అయినా హీరో ఆశయానికి  మంచి డెప్త్ ఉన్న పాయింట్ నే ఎంచుకున్నాడు దర్శకుడు హరీష్ శంకర్ . ఐతే ఆ మెయిన్ పాయింట్ ని అక్కడక్కడా మాత్రమే టచ్ చేస్తూ మిగతా సినిమా అంతా  ఫార్ములా ప్రకారం సాగుతుంది కధనం. మొదటి 20 నిముషాలు ఆసక్తికరంగా సాగిన  ఫస్టాఫ్, హీరో హైదరాబాద్ వచ్చాక కామెడీ సన్నివేశాలతో  సాఫీ గానే సాగిపోతుంది, లవ్ ట్రాక్ ని మరీ టేకిట్ ఈజీ తరహాలోనే డీల్ చేసాడు. విలన్ ఎంట్రీ తో మళ్ళీ కాస్త చలనం వస్తుంది సినిమా లో. ఆ ఊపుని అలాగే కంటిన్యూ చేస్తూ ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంటుంది. ఐతే ముందుగానే చెప్పుకున్నట్టు మరీ ఫార్ములా ప్రకారం కధనం సాగడం తో సెకండాఫ్ లో విలన్ హీరో ల మధ్య గేమ్  కాస్త ఆలస్యంగా స్టార్ట్ అవుతుంది ,అయినప్పటికీ విలన్  హీరో కి చెక్ పెట్టే  ఎపిసోడ్ ,వెంటనే హీరో ఛార్జ్ తీసుకునే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా బాగా వచ్చాయి. అంత బాగా క్లైమాక్స్ కి లీడ్ సెట్ చేసిన దర్శకుడు అనవసరంగా కామెడీ ట్రాక్ లోకి వచ్చి హీరో/విలన్ క్యారెక్టర్ ల తో పాటు సినిమాకి తగ్గ ఎండింగ్ ఇవ్వలేకపోయాడు.అసలు కధనం లో ఇంపార్టెన్స్ ఉన్నలవ్ ట్రాక్ ని ఇంకా సరిగ్గా ప్లాన్ చేసుకుని ఉంటే క్లైమాక్స్ కి మంచి లీడ్ కుదిరేది. మొత్తానికి మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు సభ్య సమాజానికి సందేశం ఇచ్చే అవకాశం ఉన్నా, ఫార్ములా గిరి గీసుకోవడం వలన  మరీ క్యాలిక్యులేటడ్ ఔట్పుట్ మాత్రమే ఇవ్వగలిగాడు ఈ 'డీజే'.


నటీనటులు: 

టైటిల్ రోల్ లో అల్లు అర్జున్ ఎప్పటిలాగే ఆకట్టుకుంటాడు. పూజ హెగ్డే ఇంతకుముందు తెలుగు లో చేసిన రెండు సినిమాలకి ఇందులో తాను కనిపించిన విధానానికి పొంతనే లేదు, తన గ్లామర్ సినిమాకి  అదనపు ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. మెయిన్ విలన్ గా రావు రమేష్ అదరగొట్టాడు. ప్రతి సన్నివేశం లో తనదైన టైమింగ్ తో అలరించాడు. మురళి శర్మ, చంద్ర మోహన్ ఆయా పాత్రలకు సరిపోయారు. సుబ్బరాజు ఒకే . వెన్నెల కిశోర్  ని సరిగా వాడుకోలేదు. తనికెళ్ల భరణి, పోసాని తదితరులు ఒకే.


సాంకేతిక వర్గం :

దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు పరవాలేదు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. హరీష్ శంకర్ డైలాగ్స్  కూడా బాగానే వర్కవుట్ అయ్యాయి. కెమెరా/ఎడిటింగ్ వర్క్ ఒకే.


రేటింగ్ : 5.5/10

Link to comment
Share on other sites

1 minute ago, DiscoKing said:

neeku website undha?

మొదటి 20 నిముషాలు ఆసక్తికరంగా సాగిన  ఫస్టాఫ్

Pssss.gif

Link to comment
Share on other sites

7 minutes ago, Picha lite said:

మొదటి 20 నిముషాలు ఆసక్తికరంగా సాగిన  ఫస్టాఫ్

Pssss.gif

hahha :D ante anniyya alavaatu fadda fraanam kada, elevations ki mariginam.. :D

 

so aa budda hero ala target fix avudu adhi baga ekkesindi, dialouges kooda bagunnay ga police station scene, DJ aa suit intro kooda :) 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...