Jump to content

ఉద్యోగులకు కాగ్నిజెంట్ చేదు వార్త


TampaChinnodu

Recommended Posts

ఉద్యోగులకు కాగ్నిజెంట్‌ చేదు వార్త 
29brk100-job1aa.jpg

దిల్లీ: సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌(సీటీఎస్‌) కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. సంస్థలో పని చేసే ఉద్యోగులకు వచ్చే మూడు నెలల వరకూ ఎలాంటి ప్రమోషన్లు, జీతాలు పెంచడం లేదని వెల్లడించింది. సాధారణంగా కాగ్నిజెంట్‌ ఏటా జులై నెలలో ఉద్యోగులకు జీతాలు పెంచడంతో పాటు పదోన్నతి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేస్తోంది. ఇందుకోసం జూన్‌లోనే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. కానీ ఈ ఏడాది జూన్‌ నెల ఆఖరికి వచ్చినా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో ఉద్యోగుల్లో పలు అనుమానాలు మొదలయ్యాయి. వీటికి తెరదించుతూ యాజమాన్యం తాజాగా పదోన్నతి, జీతం పెంచడంపై తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి పదోన్నతులు, జీతాలు అమలయ్యేలా చూస్తామని తెలిపింది. వృద్ధి రేటు మందగించడం, కార్యకలాపాల వ్యయం పెరగడం వల్ల మూడు నెలలు వాయిదా వేసినట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది.

ఈ నేపథ్యంలో సంస్థ చీఫ్‌ పీపుల్‌ అధికారి జిమ్‌ లెన్నాక్స్‌ సిబ్బంది, ఉద్యోగులకు ఓ ప్రకటన జారీ చేశారు. అక్టోబరు 1 నుంచి అమలయ్యే నిబంధనల ప్రకారం...

* మేనేజర్‌ లెవల్‌ సిబ్బందికి బేసిక్‌ పే ఆధారంగా జీతాన్ని పెంచుతామని తెలిపారు. 
* సీనియర్‌ మేనేజర్‌, ఆపై వారికి వారి పనితీరును బట్టి బోనస్‌ రూపంలో ఒకేసారి లేదా నెల వారీ వేతనంలో అందజేస్తామన్నారు. 
* ఉద్యోగుల నుంచి వైస్‌ ప్రెసిడెంట్‌ స్థాయి ఉన్న వారికి అక్టోబరు 1 నుంచి కొత్త వేతనాలు అమలవుతాయని తెలియజేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాగ్నిజెంట్‌ సంస్థల్లో సుమారు 2,61,200 ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్క భారత్‌లోనే ఈ సంస్థల్లో సుమారు 1.5లక్షల మంది పనిచేస్తున్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...