Jump to content

అమరావతి మధ్యలో ఐకానిక్ టవర్:నారాయణ


TampaChinnodu

Recommended Posts

అమ‌రావ‌తి మ‌ధ్య‌లో ఐకానిక్ ట‌వ‌ర్‌:నారాయ‌ణ‌ 
14brk132-min.jpg

అమరావతి: న‌వ్యాంధ్ర రాజ‌ధాని న‌గ‌రానికి  ఓ వైపు ఎన్టీఆర్, మరో వైపు బీఆర్ అంబేడ్క‌ర్‌ భారీ విగ్రహాలు ఉండేలా  పరిపాలన నగర ప్రణాళికను ఖరారు చేసిన‌ట్టు మంత్రి నారాయ‌ణ తెలిపారు. నగరం మధ్యలో ఐకానిక్ టవర్.. రాజధాని మొత్తం కన్పించేలా 500 మీటర్ల ఎత్తులో నిర్మించనున్న‌ట్టు మీడియాకు తెలిపారు.  శుక్ర‌వారం నార్మ‌న్ ఫోస్ట‌ర్ ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మై  ఆగస్టు 15 నాటికి అసెంబ్లీ ఆకృతిని ఖరారు చేయడంతోపాటు సెప్టెంబర్ 30 నుంచి అసెంబ్లీ నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు.  ఆగస్టు 30 నాటికి హైకోర్టు ఆకృతులను ఖరారు చేయడంతో పాటు అక్టోబర్ 15 నుంచి హైకోర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా కార్యాచరణ రూపొందించారు. సచివాలయ ఆకృతుల ప్రణాళిక సెప్టెంబర్ 15 నాటికి పూర్తికానుంద‌ని,  నవంబర్ మొదటి వారం  తర్వాత శాశ్వత సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయ‌ని మంత్రి చెప్పారు. 10 అంతస్థులుగా శాశ్వత సచివాలయ నిర్మాణం జరుగనుంద‌ని,  హెచ్‌వోడీ కార్యాలయాలు, సచివాలయం ఒకే ప్రాంగణంలో 40 లక్షల చదరపు అడుగులలో ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు నారాయ‌ణ లిపారు.  అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ నిర్మాణ పనులకు మొత్తం మూడు దశల్లో టెండర్లు పిలవాలని నిర్ణ‌యించామ‌న్నారు.  పునాదులు, నిర్మాణం, తుది ఆకృతులు, అంతర్గత వసతులు (ఇంటీరియర్స్‌) కు విడివిడిగా టెండర్ల ప్రక్రియ జరుగనుంద‌న్నారు. పనులు ప్రారంభించాక ఏడాదిన్నరలోగా నిర్మాణ ప్రక్రియ పూర్తిచేయనున్నారు. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...