Jump to content

India vs Sri Lanka IND Tour of SL 2017


Kool_SRG

Recommended Posts

21 hours ago, Kool_SRG said:

Anta Dhoni guidance eh ani antunna @JANASENA

టెస్టు క్రికెట్‌లా ఆడమని ధోనీ చెప్పాడు..! 
25brk112-bhuvi.jpg

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఇచ్చిన సలహాతోనే తాను ఒత్తిడి లేకుండా ఆడగలిగానని శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో అర్ధశతకంతో రాణించి భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన భువనేశ్వర్‌ కుమార్‌ తెలిపాడు. ఎలాంటి గందరగోళానికి లోనుకాకుండా టెస్టు మ్యాచ్‌ మాదిరిగా ఆచితూచి ఆడాలని ధోనీ తనకు సలహా ఇచ్చినట్లు విలేకరుల సమావేశంలో భువీ పేర్కొన్నాడు. రెండో వన్డేలో ఓటమి అంచుల వరకూ వెళ్లిన భారత్‌ను గెలిపించడంలో అతని పోరాట పటిమకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్‌ అద్భుత బ్యాటింగ్‌ క్రికెట్‌ ప్రేమికులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. 131 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో 27ఏళ్ల భువనేశ్వర్‌ 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమిండియాకు చిరస్మరణీయ విజయం అందించిన విషయం తెలిసిందే. ‘ఓపెనర్లు శుభారంభం చేయడంతో భారత్‌ అలవోకగా విజయం సాధిస్తుందని అనుకున్నా. అనూహ్యంగా వరుస వికెట్లు కోల్పోవడంతో ఓటమి కోరల్లో చిక్కుకుంది. ఈ తరుణంలో బ్యాటింగ్‌కు దిగిన నేను భారత్‌ను గెలిపిస్తానని వూహించలేదు. మిస్టర్‌ కూల్‌ ధోనీ నా దగ్గరకు వచ్చి సుధీర్ఘ ఫార్మాట్‌ వలె ఒత్తిడి లేకుండా ఆడుకోమని చెప్పటంతో నేను స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయగలిగాను’ అని చెప్పాడు. కెరీర్‌లో భువనేశ్వర్‌కిది తొలి అర్థశతకం కావడం విశేషం. సిరీస్‌లో భాగంగా మూడో వన్డే ఆగస్టు 27న కాండీలో జరగనుంది.

 

 

"When I went in to bat, MS told me to play my natural game like I play in Test cricket," Bhuvneshwar said.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...