Jump to content

Ap ki 4.5 lakh houses yellow ppt by tdp it wing


Raithu_bidda_

Recommended Posts

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర పట్ణణాభివృద్ధి శాఖ మరో రూ.2,25,245 ఇళ్లను మంజూరు చేసింది. రూ.14,140 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3,378 కోట్లు ఇస్తుంది. ఇందులో 1,66,296 ఇళ్లు అందుబాటు ధరల్లో (అఫర్డబుల్‌ హౌసింగ్‌ ప్రోగ్రాం), 58,949 ఇళ్లను లబ్ధిదారులే నిర్మాణం చేపట్టే (బెనిఫిషియరీ లెడ్‌ కన్‌స్ట్రక్షన్‌) కార్యక్రమాల కింద కేటాయించారు. ఇదివరకే కేంద్ర ప్రభుత్వం ఏపీకి 1,95,067 ఇళ్లు మంజూరు చేసింది. తాజా కేటాయింపులతో మొత్తం ఇళ్ల సంఖ్య 4,20,312కి చేరినట్లయింది. 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకొని వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఇందుకు ఆమోదముద్ర వేశారు. సోమవారం జరిగిన సమావేశంలో కేంద్ర గృహనిర్మాణ శాఖ పర్యవేక్షణ సమితి మిగతా అధికార లాంఛనాలు పూర్తి చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు 1.93 లక్షల ఇళ్లు మంజూరు చేసినందున  ఇదివరకు కేటాయించిన ఇళ్ళ  నిర్మాణ ప్రగతిని బట్టి ఈ దఫా ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు నిబంధనలు ప్రస్తావించినప్పటికీ  విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పట్టణ పేదలనుంచి ఇళ్లకున్న డిమాండ్‌ను వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా చెప్పి కొత్తగా 2.25 లక్షల ఇళ్లకు ఆమోదముద్ర వేయించారు. ఈ 4.20 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.24,834.18 కోట్లు ఖర్చు చేస్తాయి.

ఏపీలో పట్టణాలవారీగా మంజూరైన ఇళ్లు 
ధర్మవరం-8,832, హిందూపురం-2,750, పామిడి-2,599, అనంతపురం-2,000, మదనపల్లె-,3773, చిత్తూరు-3,009, రాజమండ్రి-,5862, మండపేట-3,262, ఏలేశ్వరం-2,145, గుంటూరు-10,000, పిడుగురాళ్ల-5,737, వినుకొండ-4,554, బాపట్ల-2,231, కడప-3,834, జమ్మలమడుగు-2,091, ప్రొద్దుటూరు-4,153, నంద్యాల-2,500, ఆత్మకూరు-4,731, కావలి-4,000, వెంకటగిరి-4,707, శ్రీకాకుళం-5,140, విశాఖపట్నం-12,244, నెల్లిమర్ల-2,252, ఏలూరు-13,436, తణుకు-3,539, జంగారెడ్డిగూడెం-2,883.

Link to comment
Share on other sites

Even if they build these houses( they might build few atleast) usually Avi anni free ga isthara or will they charge nominal fee like 1 lakh ki single bedroom and 2 lakhs ki 2 bed room ani. I always had this doubt

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...