Jump to content

ఒలింపిక్స్లో క్రికెట్!


JANASENA

Recommended Posts

31brk-cirket-india1.jpg
ఇంటర్నెట్‌డెస్క్‌: ఒలింపిక్‌ క్రీడల్లో క్రికెట్‌ను ప్రవేశపెట్టాలని ఐసీసీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోందా? క్రికెట్‌ పెద్దన్న బీసీసీఐ వాటిని సాగనీయడం లేదా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు!

ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలని ఐసీసీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఐతే అన్ని అగ్రశ్రేణి జట్లు, ఆటగాళ్లు ఆడితేనే ఈ అంశం పరిశీలిస్తామని అంతర్జాతీయ ఒలింపిక్‌ మండలి (ఐఓసీ) బదులిచ్చింది. దీంతో ఈ ప్రతిపాదనను ఎప్పట్నుంచో వ్యతిరేకిస్తున్న బీసీసీఐని ఒప్పించాలని ఐసీసీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. క్రికెట్‌ ఒలింపిక్‌ క్రీడ కాదన్నది బీసీసీఐ అభిమతం. ఐసీసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా బీసీసీఐ మద్దతు తప్పనిసరి. సెప్టెంబర్‌లోగా బిడ్‌ వస్తే కానీ కొత్త క్రీడల గురించి ఐవోసీ పరిశీలించదు.

ఈ నేపథ్యంలో తమకు సహకరించాలని ఐసీసీ కోరుతున్నా భారత్‌ ఆసక్తి కనబరచడం లేదు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని బీసీసీఐ పాలకుల కమిటీ అధినేత వినోద్‌ రాయ్‌ సీఈవో రాహుల్‌ జోహ్రీని కోరారు. పాలనాధికారుల నుంచి ఆయన అభిప్రాయాలు కోరగా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెడితే ఐఓసీ చెప్పినట్టే నడుచుకోవాలని, బీసీసీఐకి పూర్తి స్వేచ్ఛ ఉండదని చెప్పినట్టు తెలిసింది. గడువు దగ్గర పడుతుండటంతో ఏం జరుగుతుందో చూడాలి మరి!

31brk-cirket-india2.jpg
Link to comment
Share on other sites

Kastam inta short span lo atleast in 2020 since 24 Jul 2020 – 9 Aug 2020  is olympics dates this is Cricket season starting most of the tour schedules would have been already decided...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...