Jump to content

విదేశాల్లో సినిమా పేరుతో సేవాపన్ను ఎగవేత


BaabuBangaram

Recommended Posts

జూనియర్‌ ఎన్టీఆర్‌ రూ.1.10 కోట్ల మినహాయింపు 
షోకాజ్‌-కం-డిమాండ్‌ నోటీసు జారీ : కాగ్‌ 
రణబీర్‌కపూర్‌ లావాదేవీలపై సమగ్ర పరిశీలన

దిల్లీ: సినిమా హీరోలు విదేశాల్లో చేసిన సినిమాలను సేవల ఎగుమతుల కింద చూపుతూ సర్వీస్‌ ట్యాక్స్‌ ఎగవేస్తున్నట్లు కాగ్‌ పేర్కొంది. టాలీవుడ్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ రికార్డులను హైదరాబాద్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ కమిషనరేట్‌ పరిశీలించినప్పుడు ఈ విషయం బయటపడినట్లు పేర్కొంది. 2015 జులైలో లండన్‌కు చెందిన వైబ్రంట్‌ విజువల్స్‌ లిమిటెడ్‌ అనే సంస్థ ద్వారా కుదుర్చుకొన్న ఒప్పందం ప్రకారం జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో నటించడానికి రూ.7.33 కోట్లు స్వీకరించినట్లు తెలిపింది. తన సేవలను ఎగుమతి చేస్తున్నట్లు చెప్పి ఆయన రూ.1.10 కోట్ల సర్వీసు ట్యాక్స్‌ మినహాయింపునకు క్లెయిమ్‌ చేసినట్లు వెల్లడించింది. ఇదే తరహాలో బాలివుడ్‌ నటుడు రణ్‌బీర్‌కపూర్‌ కూడా తాను నటించిన ‘ఆయే దిల్‌హై ముస్కిల్‌’ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్‌కూ ఇలాంటి మినహాయింపే పొందినట్లు తెలిపింది. ఆ సినిమాను ధర్మ ప్రొడక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారత్‌, న్యూయార్క్‌లో నిర్మించినట్లు కాగ్‌ పేర్కొంది. అందులో నటించినందుకు రూ.6.75 కోట్లను లండన్‌ కేంద్రంగా పని చేసే ఏడీహెచ్‌ఎం ఫిలిమ్స్‌ లిమిటెడ్‌ ద్వారా పొందినట్లు తెలిపింది. ఈ సినిమా విదేశాల్లో షూటింగ్‌ చేసుకున్నందున తన సేవలను ఎగుమతి చేసినట్లు చెప్పి ఆయన రూ.83.43 లక్షల సర్వీసు పన్ను చెల్లించలేదని కాగ్‌ పేర్కొంది. రణ్‌బీర్‌ కపూర్‌ విషయంలో మంత్రిత్వశాఖ వివరణ ఇస్తూ అతను ఒకటికి మించిన లొకేషన్లలో సేవలు అందించారని, ఒకటికి మించిన లొకేషన్లలో షూటింగ్‌ జరిగినప్పుడు, అందులో ఎక్కువ భాగం విదేశాల్లో చోటుచేసుకున్నప్పుడు ఆ సేవలు పన్ను పరిధిలోకి రావని చెప్పినట్లు తెలిపింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ విషయంలో లేవనెత్తిన అభ్యంతరాన్ని మాత్రం మంత్రిత్వశాఖ పరిగణనలోకి తీసుకొని రూ.1.10 కోట్ల పన్ను మినహాయింపునకు సంబంధించి షోకాజ్‌-కం-డిమాండ్‌ నోటీసు జారీ చేసినట్లు వెల్లడించింది. అలాంటి కేసులు ఇంకా ఏమైనా ఉన్నాయేమో పరిశీలించాలని సంబంధిత సర్కిల్‌ అధికారులను ఆదేశించినట్లు తెలిపింది. రణబీర్‌ కపూర్‌ విషయంలో కేంద్ర మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాధానం ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని కాగ్‌ పేర్కొంది. నట సేవలు సినిమాలో అంతర్భాగమని, ధర్మా ప్రొడక్షన్స్‌ సంస్థ భారత్‌లోనే ఆ సినిమాను నిర్మించిందని తెలిపింది. అతని సేవలను విదేశీ సంస్థ ఉపయోగించుకొందని చెప్పడం సరి కాదని వ్యాఖ్యానించింది. అదే వాదనను మంత్రిత్వశాఖ జూనియర్‌ ఎన్టీఆర్‌ విషయంలో మాత్రం అంగీకరించినట్లు పేర్కొంది. అందువల్ల రణబీర్‌కపూర్‌, ధర్మా ప్రొడక్షన్స్‌, ఏడీహెచ్‌ఎం ఫిల్మ్స్‌ మధ్య జరిగిన లావాదేవీలన్నింటిపై దృష్టి సారించి వారి సేవలపై పన్ను విధించిందీ లేనిదీ పరిశీలించాల్సి ఉన్నట్లు కాగ్‌ తెలిపింది. 

Link to comment
Share on other sites

11 minutes ago, NinduChandurudu said:

london lo teesthe edo benefits unnai

emi levu....just tax eggotachhu...not only london any foreign location.....

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...