Jump to content

జనవరి 3 నుంచి మెట్రో పరుగులు!


TampaChinnodu

Recommended Posts

రాజధానికి కొత్త రవాణా సౌకర్యం 
జనవరి 3 నుంచి మెట్రో పరుగులు! 
ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం 
రెండు కారిడార్లలో మొదలు 
నాగోలు నుంచి బేగంపేట వరకు 
మియాపూర్‌ నుంచి అమీర్‌పేట వరకు.. 
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి 
8main7a.jpg

ప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. అన్నీసవ్యంగా జరిగితే వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా రెండు కారిడార్లలో ప్రారంభోత్సవానికి అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. అమీర్‌పేటలో, సికింద్రాబాద్‌ ఒలిఫెంటా వంతెన వద్ద ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపేసి పగలూరాత్రి పనులు నిర్వహిస్తున్నారు. రాజధాని నగరంలో 72 కి.మీ. పొడవున మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని కొన్నేళ్ల కిందట ప్రభుత్వం తలపెట్టింది. వివిధ కారణాల వల్ల పాతబస్తీలో పనులు మొదలుకాలేదు. ప్రస్తుతం 66 కి.మీ. మేర పనులు జరుగుతున్నాయి. ఏడాది క్రితమే నాగోలు నుంచి మెట్టుగూడ వరకు 8 కి.మీ. నిర్మాణం పనులు పూర్తయ్యాయి. భద్రతా తనిఖీలనూ పూర్తి చేశారు. ఈ మొత్తం దూరంలో ఏడు రైల్వేస్టేషన్లు ఉన్నాయి. మియాపూర్‌ నుంచి ఎస్‌ఆర్‌నగర్‌ వరకు 12 కి.మీ. మేర పనులు కూడా ఎనిమిది నెలల క్రితమే పూర్తయ్యాయి. దీని పరిధిలో 10 స్టేషన్లు ఉన్నాయి. పూర్తిస్థాయి అనుసంధానత లేకపోడం వల్ల ఈ రెండు కారిడార్లలో మెట్రో రైలు సేవలను ప్రారంభించినా పెద్దగా ప్రయోజనం ఉండదన్న ఉద్దేశంతో ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖత చూపలేదు. మెట్టుగూడ నుంచి బేగంపేట వరకు నిర్మాణం పనులు చాలా వరకు కొలిక్కి వచ్చాయి. ఒలిఫెంటా వంతెన వద్ద అతి పెద్ద ఉక్కు వంతెన ఏర్పాటైతేనే ఈ మార్గంలో బేగంపేట వరకు రైలు నడిపేందుకు అవకాశం ఉంది.

8main7b.jpg

ప్రభుత్వ ఆదేశం మేరకు గత రెండు రోజుల నుంచి ఈ వంతెన ఏర్పాటు పనులను ఎల్‌అండ్‌టీ అధికారులు మొదలుపెట్టారు. మంగళవారం నుంచి ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో వంతెనను ఏర్పాటు చేసి మిగిలిన పనులను నవంబర్‌ నెలాఖరుకల్లా పూర్తి చేయాలనీ, డిసెంబరు ఆఖరుకల్లా ప్రయోగ పరీక్ష పూర్తి చేయాలని అనుకుంటున్నారు. దీనివల్ల బేగంపేట వరకు రైలును నడిపేందుకు వీలవుతుంది. బేగంపేట నుంచి అమీర్‌పేట వరకు లైను నిర్మాణం వేగంగా జరుగుతోంది. రెండోదశ కింద బేగంపేట నుంచి అమీర్‌పేట వరకు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇక మియాపూర్‌ నుంచి ఎస్‌ఆర్‌ నగర్‌ వరకు కాకుండా అమీర్‌పేట వరకు మెట్రో రైలు నడిపితే మేలని ప్రభుత్వం భావిస్తోంది. అమీర్‌పేట వద్ద మార్పిడి స్టేషన్‌ను నిర్మించాల్సి ఉంది. దీనికి కనీసం ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. దీని నిర్మాణాన్ని కొనసాగిస్తునే అమీర్‌పేట వరకు రైలు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమీర్‌పేట నుంచి నాంపల్లి వరకు కూడా దాదాపు పనులు చివరి దశకు వచ్చాయి. రెండోదశలో అమీర్‌పేట నుంచి నాంపల్లి వరకు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇమ్లిబన్‌ వద్ద మూసీనదిపై భారీ మార్పిడి స్టేషన్‌ నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయ్యేందుకు మరో ఏడెనిమిది నెలలు పట్టేలా ఉంది. ప్రస్తుతం మూడు కోచ్‌లతో ఉన్న 53 మెట్రో రైళ్లు నగరానికి చేరాయి. హైదరాబాద్‌లో వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జాతీయ సైన్సు కాంగ్రెస్‌ సదస్సు జరగనుంది. 3న సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు. ప్రధాని కార్యక్రమం అధికారికంగా ఖరారు కాకపోయినా ఆయన హాజరవుతారనే ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యఅతిథిగా హాజరవ్వాలంటూ సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రధానమంత్రిని కోరగా, సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ రెండు కారిడార్లలో మెట్రోనూ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు పోలీసులు కూడా ప్రధాని కార్యక్రమ రక్షణ ఏర్పాట్లపై ఇప్పట్నుంచే కసరత్తు చేపట్టారు.

Link to comment
Share on other sites

5 minutes ago, Pipucbn said:

Ye January 3rd oo paper lo mention chesada?

January 2018 ki kooda start avvakunte inka tharuvatha start sesi kooda waste . already veetiki assalu response ela vuntado soodali.

Link to comment
Share on other sites

A good project missed its deadlines because of political situations...

even if it starts in2018, it will take a while to get people on it...not before 2020...

Link to comment
Share on other sites

1 minute ago, boeing747 said:

June tarvata hyd roads anni addham la merustayi annar ga, ekkada emi changes levu mari...chustante inka chethaga ayyayi kaani em improve avledu.

Addalu pagili poyayi babu pagili poyayi

Link to comment
Share on other sites

5 hours ago, Android_Halwa said:

A good project missed its deadlines because of political situations...

even if it starts in2018, it will take a while to get people on it...not before 2020...

Adhem ledu, due to traffic congestion, implement chesina ventane full fledge ga use chestaru

Link to comment
Share on other sites

6 hours ago, Kontekurradu said:

tondaraga start ayithe, rush anna taguddi, 
roads anni repair chestaro ante vadili 10gutharo 

Ala anipistadi gaani pedagga emi taggadu...

Link to comment
Share on other sites

2 minutes ago, Kool_SRG said:

Ala anipistadi gaani pedagga emi taggadu...

ante, baaag G balsinollu eeakuv ayipoyaru HYD lo, przathi adu car lende bayataki ravatla Kontekurradu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...