Jump to content

విశాఖలో సరికొత్త ఐటీ వేదిక ‘టెక్ హబ్’


TampaChinnodu

Recommended Posts

విశాఖలో సరికొత్త ఐటీ వేదిక ‘టెక్‌ హబ్‌’ 
ఐటీ సంస్థల కోసం అధునాతన వసతులతో భవనం 
తొమ్మిది అంతస్తుల్లో 1.75 లక్షల చ.అడుగుల ప్రాంగణం 
రేపు అధికారికంగా ప్రారంభం 
22ap-main15a.jpg

ఈనాడు-విశాఖపట్నం: విశాఖ ఐటీ రంగంలో కొత్త శకం ప్రారంభంకానుంది. గురువారం నగరంలో ఎనిమిది కొత్త ఐటీ సంస్థలను ‘టెక్‌హబ్‌’ భవనంలో ప్రారంభించేందుకు రాష్ట్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం నగరంలోని సత్యం కూడలిలో విస్తృతమైన మౌలిక సదుపాయాలతో నిర్మించిన ‘టెక్‌హబ్‌’ భవనం ముస్తాబవుతోంది. విశాఖ నుంచి ఇప్పటికే ఏటా రూ.1800 కోట్లకు పైగా ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి. సుమారు వంద వరకు సంస్థలు ఐటీ సేవలందిస్తున్నాయి. చాలామంది ఐటీ ఆధారిత సంస్థల్ని ఏర్పాటుచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇన్నాళ్లూ తగిన ప్రాంగణం అందుబాటులో లేక ముందుకు రాలేకపోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌ చొరవ తీసుకున్నారు. ఐటీ సంస్థలకు కేటాయించడానికి వీలుగా టెక్‌మహీంద్ర సంస్థ భవనాన్ని లీజుకు తీసుకున్నారు. తొమ్మిది అంతస్తుల్లో 1.75 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలు నేరుగా నిర్వహించుకోడానికి వీలుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ భవనానికి ‘టెక్‌హబ్‌’ అని పేరు పెట్టారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఐటీ ఏజెన్సీ (ఎపీటా) ఆధ్వర్యంలో ఇప్పటికే ఐదు అంతస్తుల్లో పూర్తి స్థాయిలో వసతులను అభివృద్ధి చేశారు. రెండు నెలల్లో దశలవారీగా ఎనిమిది ఐటీ సంస్థలకు ప్రాంగణాన్ని కేటాయించారు. ఆయా సంస్థలు నేరుగా తమ కార్యకలాపాలను ప్రారంభించుకోడానికి వీలుగా ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ విధానంలో సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఫలితంగా భవనం అధికారికంగా ప్రారంభించడానికి ముందే ఆయా సంస్థల్లో కార్యకలాపాలు జోరందుకున్నాయి. ఇప్పటికే 800 మంది ఉద్యోగాలు నియమితులయ్యారు. మిగిలిన నాలుగంతస్తుల్లోనూ మౌలిక సదుపాయాలను కల్పించి రెండు మూడు నెలల్లో ప్రముఖ ఐటీ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టారు. వీటి వల్ల మరో 1200 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. టెక్‌హబ్‌ భవనంలో మొత్తం రెండు వేల మంది సౌకర్యంగా ఉద్యోగాలు చేసుకునేలా వసతి కల్పించారు.

సాంకేతిక పరిజ్ఞానాలకు అగ్రప్రాధాన్యం 
విశాఖలో ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, బీపీవో, కేపీవో సంస్థలే ఎక్కువగా ఉన్నాయి. నాలుగో పారిశ్రామిక విప్లవంగా పేరొందిన కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌), మెషిన్‌లెర్నింగ్‌, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ రంగ పరిశోధన, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) తదితర రంగాల్లో కూడా విశాఖ ప్రగతి సాధించాలన్న ఉద్దేశంతో ఆయా పరిజ్ఞానాల ఆధారంగా పనిచేసే సంస్థలకు టెక్‌హబ్‌లో స్థానం కల్పించారు.

ప్రారంభించనున్న సంస్థలివే... 
డిజిపబ్‌ అపెక్స్‌ కొవాంటేజ్‌ ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వెంచర్‌ ఆఫ్‌షోర్‌ ఇన్ఫోమ్యాట్రిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఐడీఏ ఆటోమేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జివా డిజిటల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అవ్యా ఇన్వెన్‌ట్రాక్స్‌, వర్చువల్‌ గార్డ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అంజూర్‌ ఇన్ఫోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, విస్మయ ప్రీమీడియా సర్వీసెస్‌ సంస్థ మొదటి ఐదు అంతస్తుల్లోనూ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఆయా సంస్థలను ఐటీ మంత్రి లోకేష్‌ గురువారం అధికారికంగా ప్రారంభించనున్నారు.

విశాఖ ఐటీ ప్రగతిలో మైలురాయి
రాష్ట్రంలో ఐటీ సంస్థలు ప్రారంభించుకోవాలనుకునే వారి కోసం టెక్‌మహీంద్ర భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం లీజుకు తీసుకుంది. ఐటీ సంస్థలు నేరుగా తమ కార్యకలాపాలు ప్రారంభించుకునేలా అన్ని వసతులు అభివృద్ధి చేశాం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే వూపందుకుంటున్న మెషిన్‌ లెర్నింగ్‌, కృత్రిమ మేధ తదితర రంగాల సంస్థలు కూడా ఇక్కడ కాలుమోపనున్నాయి.
- జె.ఎ.చౌదరి, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు
Link to comment
Share on other sites

చాలామంది ఐటీ ఆధారిత సంస్థల్ని ఏర్పాటుచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇన్నాళ్లూ తగిన ప్రాంగణం అందుబాటులో లేక ముందుకు రాలేకపోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌ చొరవ తీసుకున్నారు. ఐటీ సంస్థలకు కేటాయించడానికి వీలుగా టెక్‌మహీంద్ర సంస్థ భవనాన్ని లీజుకు తీసుకున్నారు. 

Jai Lokesh babu.bl@st

Link to comment
Share on other sites

35 minutes ago, perugu_vada said:

Tech companies lo oche jobs ni iuda loki babu vadu ap janam ki jobs thepinchinatlu khaatha lo veskuntadu ga, IT lo recruitment emi region basis lo cheyaru kada

Ankul okkasaari aa companies google chesi chudu .. asalu vaatini IT companies ani elaaa anna ani feel authav

 

lokeshu thopu

dhammunte aapu

Link to comment
Share on other sites

4 minutes ago, TOM_BHAYYA said:

Ankul okkasaari aa companies google chesi chudu .. asalu vaatini IT companies ani elaaa anna ani feel authav

 

lokeshu thopu

dhammunte aapu

Tech M lanti vatini antuna uncle

yeah chusa, ah companies anni computer repair shops la unnay anthe :o edho dappu kodutunadu ani pulkas ki mathram teledha

Link to comment
Share on other sites

One Solution Ahead

At Apex CoVantage we are human process engineering experts. Our award-winning software solutions prove that balancing the cognitive power and creativity of the human mind with the processing power of computers delivers the most effective, efficient results.

 

 

lol kavi em cheppa dalchikunnado 

Link to comment
Share on other sites

DIGIPUB APEX COVANTAGE AP PRIVATE LIMITED is an unlisted private company incorporated on 30 May, 2017

JIVA DIGITAL SERVICES PRIVATE LIMITED is an unlisted private company incorporated on 25 April, 2017

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...