Jump to content

Saudi Traditions


ariel

Recommended Posts

సౌదీలో కలకలం.. పురుషుల దుస్తుల్లో కారులో ఓ మహిళ..
24-08-2017 15:43:26
 
636391862118289776.jpg
రియాధ్: సోషల్ మీడియాలోని ఓ వైరల్ వీడియోతో సౌదీలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్.. ఎక్కడ చూసినా ఆ వీడియోపైనే చర్చ రచ్చ. సౌదీ సంప్రదాయాలకు విరుద్ధంగా, చట్టాలను వ్యతిరేకిస్తూ ఓ మహిళ ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో ఓ వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. కొంతమంది మాత్రం ఆమెకు మద్ధతిస్తున్నారు. ఈ రభసకు కారణమైన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
అల్ ఖఫ్జీకి చెందిన ఓ మహిళ సౌదీలో పురుషులు వేసుకునే దుస్తులను వేసుకుని, ముఖానికి ముసుగు వేసుకుని చట్టాలను అతిక్రమించడమే కాకుండా.. ఏకంగా కారును నడిపింది. ఇద్దరు స్త్రీలు కారు ముందు సీట్లలో ఉండగా, మరో ఇద్దరు పురుషులు కారు వెనక సీట్లలో కూర్చున్నారు. సౌదీ చట్టాల ప్రకారం మహిళలు డ్రైవింగ్ చేయడానికి వీల్లేదు.  దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వెల్లువెత్తాయి. వారిపై వెల్లువలా అధికారులుకు ఫిర్యాదులు అందాయి. దీంతో అప్రమత్తమయిన పోలీసులు.. ఆ కారు ఎవరిదో గుర్తించి యజమానికి నోటీసులు జారీ చేశారు. మొదట్లో కారులో ఉన్న మహిళలు ఎవరో తెలియదని చెప్పినా.. ఆ తర్వాత పోలీసుల ఒత్తిడి మేరకు ఎట్టకేలకు వివరాలు వెల్లడించాడు. అయితే మహిళల వివరాలు తెలియజేసిన తర్వాత మరో కొత్త కేసు వారిపై నమోదయింది. ఎటువంటి సంబంధం లేని స్త్రీలు, పురుషులు ఒక్క చోట చేరడం కూడా సౌదీ సంప్రదాయాలకు విరుద్ధం. కారులో ఉన్న ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలకు ఎటువంటి సంబంధం లేదనీ, ఒకే కుటుంబానికి చెందిన వారు కాదని తెలియడంతో కొత్త సమస్య వచ్చిపడింది. దీంతో ఈ దుశ్చర్యకు పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...