Jump to content

TDP - PPT - E-lavadevis lo mundunna AP spastam chesina E-Taal


ARYA

Recommended Posts

Image may contain: 1 person, smiling

 

ఈ-పరుగులో తెలుగు రాష్ట్రాలు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. కేంద్రం నిర్వహిస్తున్న ‘ఎలక్ట్రానిక్‌ లావాదేవీల గణాంక, విశ్లేషణ సంస్థ’ (ఈ-తాల్‌) పరిశీలనలో ఇది స్పష్టమైంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘ఈ-లావాదేవీల’ సంఖ్య 1073.40 కోట్లు. ‘ఈ-పాలన’ సంస్కరణలను అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. 

ఈ-పాలన ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సేవలను ప్రజలు ఎలా ఉపయోగించుకుంటున్నారు? ఎలక్ట్రానిక్‌ లావాదేవీల సరళి ఎలా ఉందనే అంశాలను ‘ఈ-తాల్‌’ సంస్థ నిత్యం మదింపు చేస్తుంది. కేంద్రం అమలుచేస్తున్న 31 మిషన్‌ మోడ్‌ పథకాలు(ఎంఎంపీ), 21 మంత్రిత్వ శాఖలు అందించే 2267 ఈ-సేవలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అందిస్తున్న ఈ-సేవలను ఈ సంస్థ పరిశీలిస్తోంది. వీటన్నింటినీ తన కోర్‌ డ్యాష్‌బోర్డుకు అనుసంధానిస్తూ పర్యవేక్షిస్తుంది. ఇందులో తేలిన అంశాల ప్రకారం రోజుకు సగటున దేశవ్యాప్తంగా 4.65 కోట్ల 
ఈ-లావాదేవీలను నిర్వహిస్తున్నారు.

ఈ-పాలన ద్వారా ఆంధ్రప్రదేశ్‌ 204 రకాల సేవలను కల్పిస్తోంది. జనన మరణ ధ్రువీకరణ, పన్నుల చెల్లింపు, డ్రైవింగ్‌ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, ఇలా పలు రకాల ఈ-సేవలను... వివిధ శాఖలు వివిధ రకాల ఈగవర్నెన్స్‌ సేవలను అందిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు దేశంలోనే ఎక్కువగా గుజరాత్ లో 38.87 కోట్లు, ఏపీలో 32.55 కోట్లు, తెలంగాణలో 29.02 కోట్ల ఈ -లావాదేవీలు నమోదయ్యాయి. గుజరాత్‌ ప్రభుత్వం 146 రకాల సేవలే కల్పిస్తున్నప్పటికీ అక్కడ ఈ- లావాదేవీలు నిర్వహిస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు. వేయి మంది జనాభాకు ఏపీలో ఈ ఏడాదికి సగటున 6,564 లావాదేవీలు జరిగాయి.

దేశంలో ఈ ఏడాది ప్రభుత్వ ఈ-గవర్నెన్స్‌ సేవల సైట్ల ద్వారా 4.02 కోట్ల బ్యాంకింగ్‌ లావాదేవీలు జరుగగా ఆంధ్రప్రదేశ్‌లో 8.49 లక్షల లావాదేవీలు, తెలంగాణలో 2.03లక్షల లావాదేవీలు జరిగాయి. మధ్యప్రదేశ్‌ లో మాత్రం ఎక్కువగా 2.80 కోట్ల లావాదేవీలను నిర్వహించారు.
 
 
 
 
 
 
 
 
 
 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...