Jump to content

TDP TIMES - GOOD MORNING YELLOW ARMY - 8/25/17


ARYA

Recommended Posts

21054870_1793456640667919_8492917787395043724_o.jpg?oh=67398a4399c33fd8ebfdb4daade92430&oe=5A60A10E

 

Good Morning Yellow Army 

ఎన్టీఆర్ 1961లో విడుదలైన 'సీతారామ కళ్యాణం' నుండి 1992లో విడుదలైన 'సామ్రాట్ అశోక' వరకు 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ అద్భుత నటుడిగా గుర్తింపు పొందడం చేత ఆయనలోని దర్శకుడు మరుగున పడిపోయారని, లేకపోతే ఎన్టీఆర్ లో ఉన్న దర్శక ప్రతిభ మామూలుది కాదని పరిశ్రమలో చాలామంది అభిప్రాయం. 

ఎన్టీఆర్ స్క్రిప్ట్ వర్క్ అంతా 'షాట్స్ ప్రకారం' రాసుకునే వారంట. అలా రాసుకోవాలంటే ఎక్కడ కెమెరా పెడితే ఏ దృశ్యం వెండితెరపైన ఎలా కనబడుతుందో దర్శకుడు ముందే ఊహించగలగాలి. అంత ఊహాశక్తి ఎన్టీఆర్ కు ఉండేది. పై చిత్రం 'చాణక్య చంద్రగుప్త' సినిమా చిత్రీకరణలో తీసిన ఫోటో. 

ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన చిత్రాలలో ఇదొకటి. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవని అంటుంటారు. అలాంటిది ఒకే చిత్రంలో ముగ్గురు అగ్రకథానాయకులు నటించవచ్చని నిరూపించారు ఎన్టీఆర్‌. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు చాణక్యుడిగా నటించగా ఎన్టీఆర్ చంద్రగుప్తునిగా నటించారు. తమిళ కథానాయకుడు శివాజీ గణేశన్ అలెగ్జాండర్ గా నటించారు. 

సినిమా అంతా చాణక్యుని పాత్ర ఆధిక్యత కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా చాణక్యునితో మొదలై చాణక్యునితోనే ముగుస్తుంది. చివరి 15 నిమిషాలలో ఎన్టీఆర్ అసలు కనిపించరు. పైగా కథలో చాణక్యుని(ఎ.ఎన్.ఆర్.) వద్ద చంద్రగుప్తుడు(ఎన్టీఆర్) చేతులు కట్టుకునే నిలబడతాడు. అక్కడ చాణక్యునిగా నటిస్తున్నది దాదాపు 30 సంవత్సరాల పాటు ఎన్టీఆర్ కి పోటీగా నిలిచిన అగ్రనటుడు అక్కినేని నాగేశ్వరరావు. అటువంటి మరో అగ్రహీరోకు తాను దర్శకత్వం వహిస్తున్న సినిమాలో తనకు మించిన పాత్రను ఇవ్వాలంటే ఎంత దమ్ముండాలి? ఎంత విశాల మనస్తత్వం ఉండాలి? తన అభిమానుల గురించి ఎంతగా ఆలోచించాలి? దర్శకుడు తానే కాబట్టి కథలో చాణక్య చంద్రగుప్తులిద్దరికీ సమాన ప్రాధాన్యత ఉన్న సన్నివేశాలను మాత్రమే పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. కానీ అది చరిత్ర. ఇక్కడ వక్రీకరణలు చేయకూడదు. పైగా నటులెంతటి వారైనా వారు పోషిస్తున్న పాత్రలను బట్టి ఒదిగిపోవాలి. అందుకని ఒక దర్శకుడిగా తన పని తాను చేసుకుపోయారు ఎన్టీఆర్. ఇక్కడ నటుడిగా, దర్శకుడిగా రెండు బాధ్యతలు చేపట్టి... రెండింటికీ న్యాయం చేశారు. 
ఈ తెలుగు చారిత్రాత్మక చిత్రం 1977లో ఇదే రోజున అంటే ఆగష్టు 25న విడుదలైంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...