Jump to content

TDP - PPT - BCs ki pelli kaanuka CBN Rs 25k kaanuka


ARYA

Recommended Posts

Image may contain: 1 person, text

 

బలహీనవర్గ కుటుంబాలకు ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక ప్రకటించింది. ఇక నుంచి ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు పెళ్లి ఖర్చులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం వెల్లడించారు. తన కార్యాలయంలో బీసీ ఫెడరేషన్లు, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ బీసీలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చంద్రబాబు అన్నారు. మరిన్ని వర్గాలకు అందించనున్న సంక్షేమ పథకాల వివరాలను ముఖ్యమంత్రి ప్రకటించారు. 

- ఆదరణ పథకంలో బలహీనవర్గాలకు అత్యంత అధునాతన పరికరాలను ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. 
- కాపు విద్యార్థులందరికీ బీసీల మాదిరిగానే ఉపకార వేతనాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 
- బీసీ ఫెడరేషన్‌ నుంచి ఐదుగురి సభ్యులతో కూడిన బృందానికి రూ.10 లక్షలతో స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టే ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. 

ఇప్పటివరకూ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ... 
కాపు కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు, ఉపకార వేతనాలకు రూ.1,474.75 కోట్లు, వసతి గృహాలకు రూ.845 కోట్లు, బీసీ ఫెడరేషన్లకు రూ.300 కోట్లు, స్వయం ఉపాధికి రూ.5,013.50 కోట్లు కేటాయించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ ఏడాది 8.80 లక్షల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయిస్తే ఇప్పటివరకు 6,77,976 మంది నమోదు చేయించుకున్నారని, 3.30 లక్షల లక్ష్యంలో ఈబీసీ విద్యార్థులు 2,34,132 మంది పేర్లు నమోదు చేయించుకున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాలు రూ.137.25 కోట్లు విడుదల చేశామని, ఆగస్టు 16 వరకు బకాయిల కోసం రూ.76.35 కోట్లు వెచ్చించామని తెలిపారు. బోధన రుసుంల కింద బడ్జెట్‌లో రూ.1,042 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు రూ.521 కోట్లు విడుదల చేశామన్నారు. ఈబీసీ విద్యార్థులకు రెండు విడతలుగా రూ.216.37 కోట్లు, పాత బకాయిల కోసం రూ.216.14 కోట్లు ఇచ్చిన విషయాన్ని వివరించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...