Jump to content

Women Fight For Bathukamma Sarees - Must watch


Indiatoday2030

Recommended Posts

2 hours ago, Bhai said:

endhuku tagalabettaru??

 

quality baledana?? Evaro idhi scam ani post vesaru.. matter ento choodaledu

Cheera value 500 ani quote chesi 1 crore+ sarees order chesi teppisthe...Cheera quality chusthe 50 rupees laga undi..so migilina dabbulu anni scam lo ki poyyani news ochhindi.

Link to comment
Share on other sites

7 minutes ago, godfather03 said:

Cheera value 500 ani quote chesi 1 crore+ sarees order chesi teppisthe...Cheera quality chusthe 50 rupees laga undi..so migilina dabbulu anni scam lo ki poyyani news ochhindi.

:3D_Smiles:

Link to comment
Share on other sites

గులాబీ మాయ: ఛీ.. ఛీ.. ఇదేం చీర.!
September 18 , 2017 | UPDATED 03:30 IST
batukamma_saree_tlg1505749471.JPG

''ఇవ్వకపోతే నిన్నెవడడిగిండు.. నీ భార్య (మరీ దారుణంగా మాట్లాడార్లెండి) కట్టుకుంటదా.? 50 రూపాయల చీర ఇస్తవా.? బిచ్చగాళ్ళు కూడా కట్టుకోరు.. పనికెళ్తే మూడొందల కూలి వస్తది.. పని మానుకుని లైన్‌లో నిల్చున్నది 50 రూపాయల చీర కోసమా.?'' 

- అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం 'బతుకమ్మ చీర' పేరుతో చీరల పంచుడు కార్యక్రమం చేపడితే, దానికి జనం నుంచి వస్తున్న రెస్పాన్స్‌ ఇది. 

అక్కడా ఇక్కడా కాదు, సాక్షాత్తూ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ఖాతాలోనే, చీరల గురించి మహిళలు 'మంత్రాలు' చదివేస్తున్న వైనం వీడియోల రూపంలో దర్శనమిస్తోంది. గిట్టనివాళ్ళు చేస్తోన్న దుష్ప్రచారమని టీఆర్‌ఎస్‌ నేతలు ఖండించొచ్చుగాక. మంత్రి కేటీఆర్‌ కూడా అదే మాట చెప్పార్లెండి. కానీ, జనం ఏమనుకుంటున్నారో పాలకులు తెలుసుకోవాలి కదా.! 

కొన్ని చోట్ల, బతుకమ్మ చీరలను తగలబెట్టారు. అలా తగలబెట్టించింది విపక్షాలేనని కేటీఆర్‌ మండిపడిపోయారు. కానీ, అక్కడ రాజకీయ పార్టీలకు చెందిన నేతలెవరూ కన్పించలేదు. పైగా, తగలబెట్టిన చీరల చుట్టూ మహిళలు గుమికూడి, బతుకమ్మ ఆటలు ఆడుతూ, కేసీఆర్‌ సర్కార్‌ని బండ బూతులు తిట్టేశారు. అఫ్‌కోర్స్‌, మరికొన్ని చోట్ల విపక్షాల ఆందోళనలు కొనసాగాయనుకోండి.. అది వేరే విషయం. 

పండగలు పబ్బాలు పేరు చెప్పి, పబ్లిసిటీ స్టంట్లు చేయడం ప్రభుత్వాలకి కొత్తేమీ కాదు. పప్పులంటారు, ఉప్పులంటారు.. ఇంకేవేవో చెబుతుంటారు. అన్నీ మేడిపండు చందమే. ఆయా ప్యాకెట్లు తెరిచి చూస్తే అందులో పురుగులే వుంటాయి మరి. అదేమంటే, సరఫరాదారుపై చర్యలని ప్రభుత్వాలు తప్పించుకోవడం సర్వసాధారణమైన విషయం. 

బతుకమ్మ పండగ కోసం కోటి నాలుగు లక్షల చీరలను తెలంగాణ వ్యాప్తంగా పంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో చీర ఖరీదు ఐదు వందల రూపాయలని తెలంగాణ ప్రభుత్వమే ప్రకటించింది. కానీ, పంపిణీ జరుగుతోన్న చీరల ఖరీదు 50 నుంచి 100 రూపాయల లోపేనన్నది మెజార్టీ వాదన. 50 రూపాయల చీర పంచి, 500 రూపాయల ఖర్చుని ప్రభుత్వం లెక్కల్లో చూపడమే నిజమైతే, బతుకమ్మ పేరుతో పాలకులు అడ్డంగా బొక్కేస్తున్నారనుకోవాలా.?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...