Jump to content

అనారోగ్యం పేరుతో భారీ కుంభకోణం


TampaChinnodu

Recommended Posts

అనారోగ్యం పేరుతో భారీ కుంభకోణం 
హైదరాబాద్‌లో వెలుగుచూసిన ట్యాక్స్‌ రిఫండ్‌ స్కామ్‌ 
27brk-incometax.jpg

హైదరాబాద్‌: అనారోగ్యం పేరుతో భారీ స్కామ్‌కు పాల్పడ్డారు కొందరు సాంకేతిక నిపుణులు. తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి తాము కట్టిన ఆదాయపు పన్నును వెనక్కి తీసుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 200 మంది ఐటీ ఉద్యోగులు ఈ మోసానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌లో తాజాగా వెలుగుచూసిన నిజాలివి.

ఆదాయపు పన్ను రిఫండ్‌లో అవకతవకలు చోటుచేసుకోవడంతో ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మోహన్‌ బాబు హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైం స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు.. ఈ కుంభకోణంలో ఇద్దరు ఐటీ అధికారుల హస్తం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఐటీ ప్రాక్టీషనర్స్‌ ఎన్‌. శ్రీకాంత్‌ గౌడ్‌, మహ్మద్‌ ఖలీల్‌లపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతో పరిచయం పెంచుకుని వారికి ఐటీ రిఫండ్‌ తీసుకునేందుకు సాయం చేసినట్లు విచారణలో తేలిందని సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రామ్‌కుమార్‌ తెలిపారు.

‘ఐటీ చట్టాల ప్రకారం.. వైద్య ఖర్చులను ఆదాయపు పన్ను శాఖ రిఫండ్‌ చేస్తుంది. ఈ ఇద్దరు అధికారులు ఐటీ ఉద్యోగులను కలిసి వారు పన్ను రిఫండ్‌ చేసుకునే విధానాన్ని వివరించారు. కుటుంబసభ్యులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని బిల్లులు సృష్టించి పన్నులు రిఫండ్‌ చేయించారు. అలా ఒక్కో ఉద్యోగి రూ. 50వేల నుంచి రూ.లక్ష వరకు లబ్ధి పొందారు. ఇందుకోసం సదరు ఉద్యోగుల వద్ద నుంచి నిందితులు 10శాతం కమిషన్‌ తీసుకున్నారు. దీని వల్ల ఐటీశాఖకు రూ.1.36కోట్ల నష్టం వాటిల్లింది.’ అని రామ్‌కుమార్‌ వెల్లడించారు. అయితే ఇలా వీరు మాత్రమే కాదని.. నగరంలో చాలా మంది ఇలా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.

దాదాపు 200 మంది ఉద్యోగులు ఇలా రిఫండ్‌ చేసుకోగా.. 50 మంది పొలారీస్‌ కంపెనీకు చెందినవారని రామ్‌కుమార్‌ వెల్లడించారు. దీనిపై తదుపరి విచారణ చేపట్టామన్నారు.

Link to comment
Share on other sites

Quote

ఈ కుంభకోణంలో ఇద్దరు ఐటీ అధికారుల హస్తం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఐటీ ప్రాక్టీషనర్స్‌ ఎన్‌. శ్రీకాంత్‌ గౌడ్‌, మహ్మద్‌ ఖలీల్‌లపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతో పరిచయం పెంచుకుని వారికి ఐటీ రిఫండ్‌ తీసుకునేందుకు సాయం చేసినట్లు విచారణలో తేలిందని 

inko round of fresh bribes isthey malli case close. simple. 

Link to comment
Share on other sites

14 minutes ago, Kontekurradu said:

maa vadu ila 2006 nunid sesthunaud 

ela chestaru details please ?

how much they will save by doing this ? mari only 200 ppl ani  antunadu veedu its  a small number kadha

Link to comment
Share on other sites

2 hours ago, MeetFriendz said:

ela chestaru details please ?

how much they will save by doing this ? mari only 200 ppl ani  antunadu veedu its  a small number kadha

ippatiki dorikindi 200. inka investigate sesthe majority of software employees ide sestharu.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...