Jump to content

అపార్ట్మెంట్లో అనాథలా శవం


BaabuBangaram

Recommended Posts

బల్లిపై కాలేసి జారిపడి ఒంటరి వృద్ధుడి మృతి 
నెలరోజులుగా కుళ్లిపోయిన మృతదేహం 
అమెరికాలో ఉన్న కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ స్వదేశానికి వచ్చిన కుమార్తెలు 
తాళమేసి ఉన్న ఫ్లాట్లో శవాన్ని చూసి విలవిల 
హైదరాబాద్‌లో ఆలస్యంగా వెలుగులోకి.. 
న్యూస్‌టుడే - నాగోలు 
5hyd-main6a.jpg

పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు. తండ్రికి మాత్రం దేశంపై అభిమానం.. ఇక్కడికి వచ్చెయ్యండి నాన్నా అని కుమార్తెలు విమానం టిక్కెట్లు పంపినా ఒప్పుకోలేదు. సొంతూరిపై మమకారంతో ఈ నేలను వదిలి వెళ్లడానికి ఆయనకు మనస్కరించలేదు. భార్యను అమెరికా పంపించి, తను ఒక్కడే ఇక్కడ ఉంటున్నారు. నెలరోజులుగా ఆయన ఆచూకీ లేకపోవడంతో వెతుక్కుంటూ వచ్చిన భార్య, కుమార్తెలు ఫ్లాట్‌లో నిర్జీవంగా పడి ఉన్న ఆయనను చూసి బోరుమన్నారు. ఒకరోజు, రెండ్రోజులు కాదు.. ఏకంగా నెలరోజులుగా ఆయన అలాగే పడి ఉండడం విషాదకరం. హైదరాబాద్‌లో ఈ ఉదంతం వెలుగుచూసింది. రాజమహేంద్రవరానికి చెందిన డబ్బయ్యేళ్ల వృద్ధుడైన మూర్తి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైరయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు అమెరికాలో స్థిరపడ్డారు. తల్లిదండ్రుల కోసం నెలనెలా డబ్బు పంపేవారు. ‘మీరిద్దరూ ఒంటరిగా అక్కడ ఎందుకు ఉండడం.. అమెరికా వచ్చేయండి..’ అని పట్టుబట్టిన వారు ఆరునెలల కిందట విమానం టికెట్లు కూడా పంపించారు. కాని దేశంకాని దేశానికి వెళ్లడం ఇష్టంలేని మూర్తి కుమార్తెల దగ్గర కొంతకాలం గడిపి రమ్మని చెప్పి భార్యను మాత్రం పంపించి తాను ఇక్కడే ఉండిపోయారు.

అప్పుడప్పుడు హైదరాబాద్‌కు రాక 
మూర్తి కుమార్తె ఒకరికి ఎల్బీనగర్‌ వద్ద రాక్‌టౌన్‌లోని సాయిమారుతీ రెసిడెన్సీలో ఓ ఖాళీ ఫ్లాట్‌ ఉంది. మూర్తి ఎప్పుడైనా నగరానికి వచ్చినప్పుడు అందులో ఉండేవారు. ఆగస్టు 18న బంధువుల ఇంట్లో శుభకార్యానికని హైదరాబాద్‌ వచ్చారు. ఆ తర్వాతి నుంచి ఆయన ఆచూకీ లభించలేదు. దీంతో భార్య, కుమార్తెలు మంగళవారం ఉదయం అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ఎల్బీనగర్‌లోని తమ ఫ్లాట్‌కు చేరుకుని తెరిచేందుకు ప్రయత్నించారు. ఎంతకీ తెరుచుకోకపోవడంతో పగలగొట్టించిన వారు ఒక్కసారిగా గది నుంచి దుర్వాసన రావడంతో అవాక్కయ్యారు. హాల్లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న తండ్రి మృతదేహాన్ని చూసి నివ్వెరపోయి బోరుమని విలపించారు.

స్నానం చేసి తల తుడుచుకుంటూ.. 
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చి చేరుకుని ఆ వృద్ధుడి మృతికి కారణాలను అన్వేషించారు. సుమారు నెల క్రితం ఫ్లాట్‌కు వచ్చిన ఆయన స్నానం చేసి, హాల్లోకి వస్తుండగా నేలపై వెళ్తున్న ఓ బల్లిపై పొరపాటున కాలేసి.. ఒక్క ఉదుటున జారి పడ్డారని, తల గోడకు బలంగా తాకడంతో గాయపడి చనిపోయారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చనిపోయిన బల్లి.. కాలు జారిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. వైద్య సాయం అందక అపస్మారకస్థితికి చేరుకుని చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.

ఎవరికీ ఎందుకు తెలియలేదు? 
సెంట్రల్‌లాక్‌ సిస్టం కావడంతో బయటి నుంచి చూస్తే తలుపు తాళం వేసినట్లుగానే ఉండేది. లోపల ఓవ్యక్తి ఉన్నట్లు ఎవరికీ తెలియలేదు. ఆ ఫ్లాటు చివరి అంతస్తులో ఉండడం.. కిటికీలన్నీ మూసి ఉండటంతో చుట్టుపక్కలవారికి దుర్వాసన సోకలేదు. 4నెలల క్రితమే పాత వాచ్‌మన్‌ మానేయడంతో కొత్త వ్యక్తి వచ్చాడు. అతడికి ఈ ఫ్లాటు ఎవరిదనే విషయం కాని, అందులో ఎవరైనా ఉంటున్నారా అనే విషయం తెలియకపోవడంతో దానిపై దృష్టి పెట్టలేదు.

పిల్లలకు అనుమానం రాలేదా? 
ఫ్లాట్‌కు వచ్చి స్నానానికి వెళ్లేముందు ఆయన తన ఫోన్‌ ఛార్జింగ్‌కు పెట్టారు. అప్పటి నుంచి అది అలాగే ఉంది. అమెరికా నుంచి కుటుంబసభ్యులు ఫోన్‌ చేస్తుంటే మోగేది కాని లేపడంలేదు. పెద్దాయన అప్పుడప్పుడూ తమపై అలిగితే ఫోన్‌ చేసినా స్పందించేవారు కాదని.. ఈసారీ అలాంటిదేమైనా జరిగిందేమోనని భార్య, కుమార్తెలు భావించారు.

ఇదీ అపార్ట్‌మెంట్‌ సంస్కృతి! 
నగరమంటే లక్షలాది జనంతో కిటకిటలాడే జనారణ్యం.. కాని సాటిమనిషి చనిపోయి నెలరోజులు గడిచినా ఎవరికీ తెలియని వైనమే విషాదకరం. అయిదో అంతస్తులోని వీరి ఫ్లాట్‌ ఖాళీగానే ఉండేదని, మూర్తి ఎప్పుడో ఓసారి వచ్చేవారని, ఎవరితోనూ పెద్దగా మాట్లాడే వారు కాదని.. అందుకే ఆయన గురించి, వారి కుటుంబం గురించి పెద్దగా వివరాలు తెలియవని అపార్ట్‌మెంట్‌వాసులు చెప్పారు. చివికిపోయిన స్థితిలో ఉన్న ఆయన మృతదేహాన్ని కొండంత విషాదంతో అంత్యక్రియల కోసం స్వస్థలానికి బయలుదేరారు కుటుంబ సభ్యులు.

Link to comment
Share on other sites

26 minutes ago, bottu_seenu said:

mari one month nunchi respond kakunna ela untaru follow up cheyyakunda? 

aa maa nayana edaki pothadule, aligi vuntadu ani anukoni

Flights tickets seap ga levu ani, eeapudu seap ga vunte appude veldamani decide ayyi vuntaru 


Seap ga dorakataniki 1 month pattindi, alla place lo manam vunna ade sestam 

Link to comment
Share on other sites

1 minute ago, bottu_seenu said:

ye matter aligineda? silly reason like kontekurrodu said above 

silly reason ani anukoltaniki reason, flight tickets costly ga vundatame next day book sesthe. 

adi cover seyyataniki, ma nayana aligindu ani sollu told 

Link to comment
Share on other sites

16 minutes ago, BaabuBangaram said:

ayina one month varaku respond avvaledhu ante kaneesam yevaro okaru india ki vachhi police complaint ivacchu kadha....chi dheenamma 

lite lelo, its done and dusted 

 

Link to comment
Share on other sites

52 minutes ago, Kontekurradu said:

silly reason ani anukoltaniki reason, flight tickets costly ga vundatame next day book sesthe. 

adi cover seyyataniki, ma nayana aligindu ani sollu told 

nuvvu cheppindi silly anatledu bhayya, nuvvu vesina satire correct ae antunna 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...