Jump to content

Navyandhralo Hyperloop


SonyKongara

Recommended Posts

నవ్యాంద్రలో హైపర్‌ లూప్‌!
636428747397528704.jpg
  • అత్యంత వేగవంతమైన పౌర రవాణా వ్యవస్థ
  • కాలుష్యరహితం.. అతి తక్కువ ప్రయాణ ఖర్చు
  • విజయవాడ, అమరావతి కేంద్రంగా 4 మెగా కారిడార్లు
  • బెజవాడ-అమరావతి- గుంటూరు-తెనాలి కారిడార్‌కూ ప్రతిపాదన
  • హైపర్‌ లూప్‌ సంస్థతో అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ చర్చలు
విజయవాడ, ఆంధ్రజ్యోతి : అత్యంత వేగవంతమైన పౌరరవాణా వ్యవస్థగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ‘హైపర్‌ లూప్‌’ను నవ్యాంధ్రలో ప్రవేశపెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. హైస్పీడ్‌ రైళ్లు, బుల్లెట్‌ ట్రైన్ల కంటే వేగవంతమైన, కాలుష్యరహిత, చౌక ప్రయాణం హైపర్‌ లూప్‌తో సాధ్యమవుతుంది. ఈ కారణంతోనే అన్ని దేశాలు ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపుతున్నాయి. దుబాయ్‌ ఏకంగా 100 కిలోమీటర్ల మేర హైపర్‌ లూప్‌ను ఏర్పాటు చేసుకోవటానికి హైపర్‌ లూప్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపించటంతోపాటు ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించే బాధ్యతను అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(ఏఎంఆర్‌సీ)కి అప్పగించింది. వెంటనే రంగంలోకి దిగిన ఏఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి రెండు రోజులుగా హైపర్‌లూప్‌ సంస్థ ప్రతినిధుల బృందంతో చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా.. విజయవాడ నుంచి అమరావతికి అక్కడి నుంచి హైదరాబాద్‌కు, అమరావతి నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నంకు, విజయవాడ నుంచి అమరావతి మీదుగా బెంగళూరుకు, విజయవాడ నుంచి అమరావతి మీదుగా చెన్నైకు నాలుగు మెగా కారిడార్లను ఏర్పాటు చేసే అవకాశాలపై వీరు చర్చలు జరుపుతున్నారు. తాము సూచించిన నాలుగు రూట్లలో హైపర్‌ లూప్‌ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా ఏఎంఆర్‌సీ ఎండీ హైపర్‌ లూప్‌ సంస్థ ప్రతినిధులను కోరారు. వీటితోపాటు విజయవాడ - అమరావతి - గుంటూరు - తెనాలి నడుమ ఇంతకు ముందు ప్రతిపాదించిన హైస్పీడ్‌ ట్రైన్‌ స్థానంలో హైపర్‌లూప్‌ ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలనూ పరిశీలించాలని సూచించారు. వీటికి సంబంధించిన సమగ్ర నివేదికలు ఇవ్వాలని కోరారు.
 
గరిష్ఠ వేగం 1200 కిలోమీటర్లు
అమెరికా నుంచి వచ్చిన హైపర్‌లూప్‌ సాంకేతిక బృం దం రామకృష్ణారెడ్డికి హైపర్‌లూప్‌ వ్యవస్థ గురించి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించింది. కనిష్ఠంగా 300 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 1200 కిలోమీటర్ల వేగంతో హైపర్‌లూప్‌ ప్రయాణించగలదని వారు తెలిపా రు. పరిమిత కిలోమీటర్ల కంటే సుదూర ప్రాంతాలకు ఈ వ్యవస్థ అత్యుత్తమంగా ఉంటుందని, గరిష్ఠంగా 300 కిలోమీటర్లు ఆపైన అయితే బాగుంటుందని వివరించారు. హైపర్‌లూప్‌ కారిడార్లలో పరిమిత సంఖ్యలో మాత్రమే స్టేషన్స్‌ ఉంటాయని ప్రతినిధులు తెలిపారు. విజయవాడ - అమరావతి - గుంటూరు - తెనాలి సర్క్యులర్‌ కారిడార్‌లో గరిష్ఠంగా ఐదు స్టాపులకు అవకాశం కల్పిస్తే హైపర్‌లూప్‌ను ఏర్పాటు చేయవచ్చా అని ఏఎంఆర్‌సీ ఎండీ ప్రశ్నించారు. దీనికి హైపర్‌లూప్‌ ప్రతినిధులు స్పందిస్తూ.. అధ్యయనం చేసిన చెబుతామని తెలిపారు.
 
ఏమిటీ హైపర్‌లూప్‌?
అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ కేంద్రంగా 2014 నుంచి హైపర్‌లూప్‌ సంస్థ పనిచేస్తోంది. హైపర్‌లూప్‌లు విద్యుత్‌ చోదక శక్తితో పనిచేస్తాయి. హైపర్‌లూప్‌ కోచ్‌లు ప్రయాణించేందుకు భూగర్భంలో కానీ.. భూమిపై పిల్లర్ల మీద కానీ ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగా ఆరు మీటర్ల వెడల్పుతో కూడిన భారీ ట్యూబును హైపర్‌ లూర్‌ కారిడార్‌ పొడవునా నిర్మిస్తారు. ఈ ట్యూబ్‌లో హైపర్‌లూప్‌ కోచ్‌లు నడుస్తాయి. విద్యుత్‌ శక్తితోపాటు ట్యూబ్‌ లోపల ఏర్పాటు చేసే మాగ్నటిక్‌ లెవిటేషన్‌, ఏరో డైనమిక్‌ ట్రాక్‌ వ్యవస్థ వల్ల ఈ కోచ్‌ ఎటూ పడిపోకుండా గంటకు 300 కిలోమీటర్ల నుంచి 1200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఒక్కో కోచ్‌లో 50 మంది వరకు ప్రయాణించవచ్చు. పాసింజర్‌ కోచ్‌లతోపాటు సరుకు రవాణా కోచ్‌లు కూడా ఉంటాయి. సాధారణ రైళ్లలో ఒక్కసారిగా గరిష్ఠ వేగం నుంచి కనిష్ఠ వేగానికి.. కనిష్ఠ వేగం నుంచి గరిష్ఠ వేగానికి చేరుకోవాలంటే కొంత సమయం పడుతుంది. కానీ హైపర్‌ లూప్‌ వ్యవస్థలో ఈ ప్రక్రియ సత్వరం జరగడం విశేషం.
Link to comment
Share on other sites

  • 1 year later...
On 10/6/2017 at 2:01 PM, SonyKongara said:

2019 ki idi complete avochu..Amaravathi oka range lo vuntundi idi complete ithe

Bro charges ela pettaru

Eppati nunchi start 

Link to comment
Share on other sites

On 10/6/2017 at 3:31 AM, SonyKongara said:

2019 ki idi complete avochu..Amaravathi oka range lo vuntundi idi complete ithe

Yes better than student sucides for development

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...