Jump to content

విజయవాడ... వెనిస్లా .. Thank You CBN


TampaChinnodu

Recommended Posts

విజయవాడ... వెనిస్‌లా 
నదీతీరం.. ఆహ్లాదకరం 
మూడు కాలువల వెంట పచ్చదనం 
వ్యాపార, పర్యటక ప్రాంత అభివృద్ధికి చర్యలు 
భూమార్పిడి ప్రక్రియకు ఆమోదం 
amr-sty1a.jpg

రాష్ట్ర రాజధాని అమరావతిలో అంతర్భాగంగా.. అతిముఖ్యమైన నగరంగా అభివృద్ధి చెందుతున్న బెజవాడ ఇక పర్యటక ప్రాంతంగా, అతి సుందరమైన పచ్చని నగరంగా విరాజిల్లనుంది. నగరం వెలుపల పారే జలసిరులు.. నగరం లోపల జాలువారే కాలవలు అందానికి మచ్చుతునకలు కానున్నాయి. మూడు కాలవలతో వెనిస్‌ నగరంగా పేరొందిన విజయవాడ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో నదీపరివాహక ప్రాంతంతో పాటు ఇతర చోట్ల కూడా వినోద, వాణిజ్య సముదాయాలతో పర్యటక ప్రాంతంగా రూపుదిద్దడానికి అనువైన కార్యాచరణ ప్రస్తుతం వేగంగా ముందుకు సాగుతోంది. ఇక అవసరమైన భూమార్పిడికి సైతం ఇప్పటికే విజయవాడ కౌన్సిల్‌ ఆమోదం తెలపగా, ప్రాజెక్టుకు అనుబంధమైన పనులను సీఆర్డీఏ, అమరావతి అభివృద్ధి కార్పొరేషన్లు ముందుకు తీసుకువెళుతున్నాయి.

విజయవాడ కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

నగరంలోని అతిముఖ్యమైన కృష్ణానదీతీరాన్ని పర్యటకంగా అభివృద్ధి చేసే ప్రాజెక్టు ప్రారంభమైంది. నగరం నుంచి వెళ్లే ఏలూరు, బందరు, రైవస్‌ కాలవల వెంట భూములను సైతం బహుళ ప్రయోజనాలకు అనువుగా మార్పు చేయనున్నారు. ఈ కాలవలను కేంద్రంగా చేసుకుని వెనిస్‌లా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు చేపడుతున్నారు. అందుకు ఇప్పటికే ఎంపికచేసిన ప్రాంతాలను సందర్శకులకు అనువుగా, ఆకర్షణగా, సానుకూలంగా, ఆహ్లాదకరంగా మార్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

నగరపాలక సంస్థ ఆమోదం 
కృష్ణానది తీరం వెంట ఉన్న వివిధ ప్రభుత్వ శాఖలు, నగరపాలక సంస్థకు చెందిన స్థలాలను నూతన ప్రాజెక్టుకు అనువుగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ఆలోచనకు నగరపాలక సంస్థ పాలకులు, అధికార యంత్రాంగం మద్దతు పలికారు. ఇందుకోసం ఇప్పటికే కౌన్సిల్‌లో భూమార్పిడికి అనువైన ప్రతిపాదనలకు తీర్మానించారు. ప్రాజెక్టులో నీటిపారుదల శాఖ, రెవెన్యూ, సీఆర్డీఏ, ఆర్టీసీ, రైల్వే, ఆర్‌అండ్‌బి, నగరపాలక సంస్థలు పరోక్ష భాగస్వాములు కానున్నాయి. నగరపాలక సంస్థ మాత్రం పర్యవేక్షక బాధ్యతలు చేపడుతుంది. మాస్టరు ప్లానుకు అనుబంధంగా కార్పొరేషన్‌ పరిధిలోని భవనాలను, భూములను స్వాధీనం చేసుకోనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం నగరపాలక సంస్థ కార్యాలయ భవనాలు, సబ్‌స్టేషన్‌, రాజీవ్‌గాంధీపార్కు, రాజీవ్‌గాంధీ హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌, హోల్‌సేల్‌ పూల మార్కెట్లను తరలించి అక్కడ పర్యాటకులు, సందర్శకుల కోసం రిటైల్‌మాల్స్‌, ఎగ్జిబిషన్‌హాల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌ వంటి వాటిని ఏర్పాటు చేస్తారు.

మినహాయింపు లేనట్టే.. పర్యాటక ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్న నగరపాలక సంస్థ కార్యాలయాలు ఉన్న ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న జీ+8 బహుళ అంతస్తుల భవనంతోపాటు, కౌన్సిల్‌ భవనాన్ని ఆయా ప్రాజెక్టు నుంచి మినహాయించాలన్న కౌన్సిల్‌ అభ్యర్థనను ప్రభుత్వం తిరస్కరించింది. ఇదే తరహా మినహాయింపులు మిగిలిన శాఖల నుంచి కూడా వస్తే వివిధ సమస్యలు ఉత్పన్నం అవుతాయని, ప్రాజెక్టు స్వరూపానికి విఘాతం కలుగుతుందని భావిస్తున్నారు. మాస్టరుప్లాను యథావిధిగా కొనసాగాలంటే ప్రస్తుతం ఉన్న పలు నిర్మాణాలకు ఎటువంటి మినహాయింపులు ఇవ్వకూడాదని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రాజెక్టు కింద ప్రయోజనం 
కొత్తగా ప్రతిపాదించిన నదీపరివాహక ప్రాంతంలోని పర్యాటక ప్రాజెక్టు కింద సమకూరే లాభాల్లో అత్యధికశాతం వాటాను నగరపాలక సంస్థ చేజిక్కించుకోనుంది. స్థలాలు, భవనాలు వదులుకునే నీటిపారుదలశాఖ, రైల్వే, ఆర్టీసీ, ఇతర శాఖలు లాభాల్లో 2 నుంచి 3 శాతం వాటా పొందనుండగా, నగరపాలక సంస్థ మాత్రం పర్యవేక్షక బాధ్యతలు నిర్వహించనుండడంతో లాభాల్లో 10 శాతం వాటా ఆర్జించనుంది. ఇందుకు సంబంధించి శాఖల భాగస్వామ్యంతో కూడిన ఎస్‌పివిని ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది.

నదీపరీవాహక ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్లానుకు అనువుగా విడుదల చేసిన 674 ఉత్తర్వు ఆధారంగా భూమార్పిడికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీని ప్రకారం ఇక్కడ వివిధ నిర్మాణాలు చేపడతారు.

నగరపాలక సంస్థ పరిధిలో ఒకపైపున ఉన్న 2.90 ఎకరాల స్థలంలోని 1.50 ఎకరాల్లో బహుళ అంతస్తుల భవనంతోపాటు, పచ్చదనంతో కూడిన రహదార్లు అభివృద్ధి చేస్తారు. మిగిలిన 1.40 ఎకరాల స్థలాన్ని రిక్రియేషన్‌ కోసం కేటాయిస్తారు.

సబ్‌ స్టేషన్‌తోపాటు, మిగిలిన నగరపాలక సంస్థకు చెందిన 5.26 ఎకరాల స్థలంలో 4.36 ఎకరాల్లోని నగరపాలక సంస్థ భవనాలు, కట్టడాలు ఉన్న స్థలంలో కొత్తగా బహుళ అంతస్తుల భవనాలు, పచ్చదనంతో కూడిన రహదార్ల ఏర్పాటునకు చర్యలు తీసుకుంటున్నారు.

రాజీవ్‌గాంధీ పార్కు స్థలంగా ఉన్న 9.01 ఎకరాల స్థలంలో బహుళ అంతస్తుల భవనాలు, రహదార్లు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం 2.30 ఎకరాల స్థలాన్ని మిశ్రమస్థలంగా వినియోగంలోకి తేనున్నారు.

రాజీవ్‌గాంధీ పార్కు వెంట ఉన్న 3.51 ఎకరాల రైల్వే స్థలంలో పచ్చదనంతో కూడిన రహదార్లతోపాటు, బహుళ అంతస్తుల భవనం నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో 0.85 సెంట్ల భూమిని మిశ్రమభూమిగా వినియోగిస్తారు.

కాలువల వెంట పచ్చదన రహదారులు 
నగరంలోని కృష్ణానది తీరంతో పాటు, కాలవల వెంట పాంతాలను పచ్చదనంతో కూడిన రహదార్లుగా అభివృద్ధి చేసేలా అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక ప్రణాళికలను తయారు చేసింది. వాహన చోదకులు, పాదచారులకు పచ్చదనంతో కూడిన అందాలు కనువిందుచేసేలా ప్రాజెక్టును తీర్చిదిద్దుతారు.

రహదారి 1: పవిత్రసంగమం నుంచి పున్నమిఘాట్‌, కనకదుర్గ గుడి, కృష్ణవేణిఘాట్‌, ప్రకాశం బ్యారేజీ, రాజీవ్‌గాంధీ పార్కు వరకు

రహదారి 2: ఏలూరు కాలువ వెంట పాతప్రభుత్వ ఆస్పత్రి నుంచి ప్రారంభమై.. రైల్వేస్టేషన్‌ను కలుపుతుంది.

రహదారి 3: బందరుకాలువ ఒడ్డున రాజీవ్‌గాంధీపార్కు మొదలు బస్‌టెర్మినల్‌, కృష్ణలంక, కనకదుర్గా వారధి జంక్షన్‌ వరకు

Link to comment
Share on other sites

oka doubt endi ante, oka roju emo Singapore anturu, inkoka roju emo Malaysia anturu, mona Japan anaru ipudu emo Venice anturu inthaku Amaravathi untada leka all mix fruit juice leka World Mixes of Amaravathi aitadi aa last ki?  Please genuine answer tumblr_n2zycbdBgb1spvnemo1_250.gif?14036

Link to comment
Share on other sites

7 minutes ago, 4Vikram said:

oka doubt endi ante, oka roju emo Singapore anturu, inkoka roju emo Malaysia anturu, mona Japan anaru ipudu emo Venice anturu inthaku Amaravathi untada leka all mix fruit juice leka World Mixes of Amaravathi aitadi aa last ki?  Please genuine answer tumblr_n2zycbdBgb1spvnemo1_250.gif?14036

last ki global village ani idhi choopistharu ra Image result for amaravathi town

Link to comment
Share on other sites

9 minutes ago, 4Vikram said:

oka doubt endi ante, oka roju emo Singapore anturu, inkoka roju emo Malaysia anturu, mona Japan anaru ipudu emo Venice anturu inthaku Amaravathi untada leka all mix fruit juice leka World Mixes of Amaravathi aitadi aa last ki?  Please genuine answer tumblr_n2zycbdBgb1spvnemo1_250.gif?14036

 

29 minutes ago, ARYA said:

Image result for sunil gifs

 

Link to comment
Share on other sites

25 minutes ago, TOM_SAMAJA said:

last ki global village ani idhi choopistharu ra Image result for amaravathi town

Wonderpul

25 minutes ago, ARYA said:

 

 

answer chepumante ee racha what re nasty CBN hater pellow *&Y&

21 minutes ago, SANANTONIO said:

bl@stbl@st

chinna world tour povalante direct amaravathi pothe aipoddemo

Singapore, Japan, Malasiya, Venis

Na doubt cleared Thank You @SANANTONIO vuncle Thank You CBN  tumblr_n2zycbdBgb1spvnemo1_250.gif?14036

Link to comment
Share on other sites

In this process, we will be polluting a river which is the life line of the delta..

entire downstream will be polluted ..another Kanpur in the making..

pollution will get into food chain system..

Link to comment
Share on other sites

16 minutes ago, Android_Halwa said:

In this process, we will be polluting a river which is the life line of the delta..

entire downstream will be polluted ..another Kanpur in the making..

pollution will get into food chain system..

nuvu velli cheyira erri ful eskuni comment cheyatam kaadu

Link to comment
Share on other sites

1 minute ago, pick said:

nuvu velli cheyira erri ful eskuni comment cheyatam kaadu

meeru vunnaru kada ITEM gallu pollute cheyanika...inka nenu enduku..!

maatala pollution saal, krishna delta govinda..! maatal, boothulatho sampestar ra ayya meeru public ni

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

meeru vunnaru kada ITEM gallu pollute cheyanika...inka nenu enduku..!

maatala pollution saal, krishna delta govinda..! maatal, boothulatho sampestar ra ayya meeru public ni

muneoday launzeer gajji tho sachipo fakeer nayala. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...