Jump to content

Underground drainage system for major panchayats


SonyKongara

Recommended Posts

భూగర్భ డ్రైనేజీలో మనమే ఆదర్శం
 
 
636434611636342535.jpg
  • 596కోట్లతో ఆరు నెలల్లో 157 గ్రామాల్లో పూర్తి
  • ముందుగా పనులు పూర్తిచేస్తే భారీ నజరానా
  • 1,340 మేజర్‌ పంచాయతీల్లో చేపట్టేందుకు సన్నాహాలు
  • 75లక్షల ఇళ్లల్లో చెత్త సేకరణకు కార్డుల పంపిణీ
  • ఘనవ్యర్థాల నిర్వహణతో రూ.వెయ్యి కోట్ల ఆదాయం
  • భూగర్భ డ్రైనేజీ వ్యవస్థపై సదస్సులో మంత్రి లోకేశ్‌
అమరావతి, అక్టోబరు 12 (ఆంధ్ర‌జ్యోతి): భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శం కావాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి నారా లోకేశ్‌ ఆకాంక్షించారు. గురువారం విజయవాడలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ హాల్లో గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థపై అవగాహన సదస్సును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ దేశంలోని అన్ని పట్టణాల్లో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ లేదని, మన గ్రామాల్లో సైతం దీన్ని పూర్తిచేసి దేశంలోనే ముందుండాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత మురుగునీటి పారుదల వ్యవస్థ అత్యంత ప్రధాన కార్యక్రమంగా గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు గుర్తించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమం చేపట్టిన ఆరు నెలల్లోపు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
 
తొలి విడతలో 157 నియోజకవర్గాల్లోని 157 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. దీనికోసం రూ.596 కోట్లు విడుదల చేస్తామన్నారు. అన్నిచోట్ల ఒకేసారి పనులు ప్రారంభిస్తామని, ముందుగా పనులు పూర్తి చేసిన గ్రామాలకు భారీగా నగదు అవార్డులు అందజేస్తామని ప్రకటించారు. 5వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న 1,340 గ్రామ పంచాయతీల్లో 2019లోగా భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. తాను దత్తత తీసుకున్న నిమ్మకూరు గ్రామంలో డ్రైనేజీకి ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నామని చెప్పారు. వాటికి పరిష్కారాన్ని కనుగొని ఈ బృహత్తర కార్యక్రమంలో నిమ్మకూరును తొలి యూజీడీ గ్రామంగా నిలిచేలా కృషి చేస్తామన్నారు.
 
ఘనవ్యర్థాల నిర్వహణ ద్వారా రాష్ట్రంలో 75లక్షల గ్రామీణ ఇళ్లలో చెత్త సేకరించే విధానంలో ఇంటింటికీ కార్డుల విధానాన్ని ప్రవేశపెట్టి రూ.వెయ్యి కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకునే ఆలోచనకు శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన బ్రోచర్‌ను లోకేశ్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్దప్రసాద్‌, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ అవంతి శ్రీనివాస్‌, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జెడ్పీ చైర్‌పర్సన్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, సర్పంచ్‌లు, కార్యదర్శులు, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

here's no merit to whatever anyone says here.

Truth is complicated to arrive at, and requires rigorous analysis, and extreme patience with numbers.

we are all just a bunch of handwavers.

 
Link to comment
Share on other sites

15 hours ago, nanda_jaffa said:

era sony ga nuvvemanna TDP paid artist vantara ...........

development Ni supprt chedta...develop cheese CBN, Lokesh Ni support chesta

Link to comment
Share on other sites

13 hours ago, gilly said:

edhyna planned ga chesthae bagundu leaders rotta gallu

chusthunam ga HYD ekkada place dorikthae akkada katti now oka 3cm rain kuda face chayaleni situation 

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...