Jump to content

14 రోజుల్లో నగరంలో 348 శాతం అధిక వర్షపాతం

TampaChinnodu

Recommended Posts

గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ మహా నగరం తడిసి ముద్దయింది. అధిక వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. రోడ్లు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల రోడ్లపై పడవలతో జనం రవాణా సాగించారు. ఇంతస్థాయిలో వర్షం పడటంపై వాతావరణ శాఖ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నాయి. అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు ఈ 14 రోజుల్లో నగరంలో 348 శాతం అధిక వర్షపాతం నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది.

నైరుతి రుతుపవనాలు నిష్క్రమించే వేళ ఇంతస్థాయిలో వర్షాలు కురవడం వాతావరణ శాఖ వర్గాలను నివ్వెరపరిచింది. రబీ ప్రారంభమైన ఈనెల ఒకటో తేదీ నుంచి 14వ తేదీ వరకు సాధారణంగా హైదరాబాద్‌లో 51 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. అయితే ఏకంగా 228.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఒక్కోరోజు 12 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదు కావడం గమనార్హం.

ఇక పాత రంగారెడ్డి జిల్లాలో ఇదే సమయంలో సాధారణంగా 56.5 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా, 141.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. అంటే ఏకంగా 151 శాతం అధిక వర్షపాతం రికార్డయింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమయంలో సాధారణంగా 52.7 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 96.5 మి.మీ. వర్షం కురిసింది. ఆ ప్రకారం సాధారణం కంటే 83 శాతం అధిక వర్షపాతం నమోదైంది.

ఖరీఫ్‌లో 13 % లోటు.. రబీ ఆశాజనకం
ఈ ఏడాది ఖరీఫ్‌లో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య 13 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌లో 49 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, జూలైలో 41 శాతం లోటు నమోదై పరిస్థితి తిరగబడింది. ఆగస్టులో 8 శాతం, సెప్టెంబర్‌లో 30 శాతం లోటు వర్షపాతమే నమోదైంది. లోటు వర్షపాతం కారణంగా ఖరీఫ్‌లో రాష్ట్రంలో 184 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.

307 మండలా ల్లో సాధారణ, 92 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అయితే రబీ మొదలైన ఈ 14 రోజుల్లో 83 శాతం అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఖరీఫ్‌లో వరి నాట్లు నిరాశాజనకంగా ఉన్నాయి. 86 శాతానికి మించలేదు. జలాశయాలు నిండక అనేక చోట్ల నాట్లు పడలేదు.

ఈసారి రబీ ప్రారంభంలోనే అధిక వర్షాలు కురుస్తుండటం, జలాశయాలు, చెరువులు నిండుతుండటంతో పరిస్థితి ఆశాజనకంగా ఉంది. గతేడాది ఖరీఫ్‌ కంటే రబీలోనే పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయి. అప్పట్లో సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలు నాటి రబీ గతినే మార్చేశాయి. ఈసారి కూడా రబీ బాగుంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

20 తర్వాత వర్షాలు తగ్గుముఖం
ఐదారు రోజుల్లో రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయి. దీంతో వర్షాలు తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు.. రానురాను తగ్గుముఖం పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వాస్తవంగా నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్‌ నెలాఖరు వరకు ఉంటాయి.

ఒక్కోసారి అక్టోబర్‌ 15 వరకు కొనసాగుతాయి. ఈసారి మాత్రం 20వ తేదీ వరకు ఉండనున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా నిష్క్రమించడం అసాధారణ విషయమేమీ కాదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వాతావరణంలో పెనుమార్పులకు ఇది సూచిక కాదని స్పష్టం చేశారు.

నగరాన్ని వీడని వాన
నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం శనివారం కూడా కొనసాగింది. అత్యధికంగా రాజేంద్రనగర్‌లో రాత్రి 9 గంటల వరకు 9.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. షాపూర్‌నగర్, కుత్బుల్లాపూర్‌లో 3 నుంచి 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. గోల్కొండ, పాశమైలారం తదితర ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది.

ఇటీవల కురిసిన వరుస వర్షాలతో నీట మునిగిన మల్కాజిగిరి, హబ్సిగూడతోపాటు పలు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బందులు ఇంకా కొనసాగుతున్నాయి. బేగంపేట బ్రాహ్మణవాడిలో నాలాలోని నీరు 5 అడుగుల మేర ఇళ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

1212.jpg

Link to comment
Share on other sites

39 minutes ago, TampaChinnodu said:

inni rains tho inka drinking Water problem poyinatte naa inka ee year HYD lo ? 

I don't think so bro. Padina vaana padinatte mori la naala la kalsipoindi. Fresh rain water proper ga ekkada store chestunru ani water problem ledankuntunav. Max reservoirs nindi untai but ground water levels em pergaledu 

Link to comment
Share on other sites

16 minutes ago, pahelwan said:

I don't think so bro. Padina vaana padinatte mori la naala la kalsipoindi. Fresh rain water proper ga ekkada store chestunru ani water problem ledankuntunav. Max reservoirs nindi untai but ground water levels em pergaledu 

yes. Ground water assalu store avvadu because of concrete jungle. But atleast reservoirs full ite drinking water ina vasthadi.

Link to comment
Share on other sites

2 minutes ago, TampaChinnodu said:

mineral water business is huge mafia now in Hyderabad.

Indian cities are all best places for adulteration Mafia..........&.,?

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:

inni rains tho inka drinking Water problem poyinatte naa inka ee year HYD lo ? 

Gone are the days when Hyd used to rely only on Osman sagar, Himayat sagar and manjeera water. mid 2003-04 lo Sagar nunchi krishna water vachindhi

now Hyd heavily relies on pumped godavari water and krishna water.

hyd lo drinking water problem endhi naa lavada , nenu chaala height lo unta city lo maaku naa bachpan nunchi drinking water issue ledhu , non drinking water usage kosam 1400ft borewell eskunnam adhi verey vishayam anukondi.

unless u r in a occupied basthi type colony, non approved and unregulated layout, If you have drainage and sewer line HMWS and SB is obligated to provide water connection .

Link to comment
Share on other sites

18 minutes ago, sattipandu said:

unless u r in a non approved and unregulated layout, HMWS and SB is obligated to provide water connection to every home.

ippudu situation ela vundo teliyadu kaani , few years back varaku ite they used to cut water supply few days in a week or supply for less number of hours even in approved layouts.

Link to comment
Share on other sites

1 minute ago, TampaChinnodu said:

ippudu situation ela vundo teliyadu kaani , few years back varaku ite they used to cut water supply few days in a week or supply for less number of hours even in approved layouts.

Yes few years back ante 2009-2013 , drinking water vachedhi kani konchem scarce ga vachedhi 

i remember it coz that was the time when i fit my home with Aquaguard to filter borewell water to supplement lack of drinking water.

Link to comment
Share on other sites

4 hours ago, TampaChinnodu said:

inni rains tho inka drinking Water problem poyinatte naa inka ee year HYD lo ? 

Yeah If that rainwater don't go into musi or drainage 

Link to comment
Share on other sites

19 hours ago, sattipandu said:

Gone are the days when Hyd used to rely only on Osman sagar, Himayat sagar and manjeera water. mid 2003-04 lo Sagar nunchi krishna water vachindhi

now Hyd heavily relies on pumped godavari water and krishna water.

hyd lo drinking water problem endhi naa lavada , nenu chaala height lo unta city lo maaku naa bachpan nunchi drinking water issue ledhu , non drinking water usage kosam 1400ft borewell eskunnam adhi verey vishayam anukondi.

unless u r in a occupied basthi type colony, non approved and unregulated layout, If you have drainage and sewer line HMWS and SB is obligated to provide water connection .

హమ్మయ్య! నీటి కష్టం తప్పినట్లే 
రోజూ సరఫరాకు మార్గం సుగమం 
వచ్చే వేసవిలో కొరత ఉండదు 
జలకళతో ప్రధాన ప్రాజెక్టులు 
hyd-gen1a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: మహానగరంతోపాటు శివారు ప్రాంతాలకు తాగునీటి కష్టాల నుంచి విముక్తి లభించనుంది. ప్రస్తుతం ప్రధాన ప్రాజెక్టులు జలకళ సంతరించుకోవడంతో ముందుముందు రోజూ సరఫరాకు మార్గం సుగమం కానుంది. శ్రీశైలం నిండడంతో కృష్ణమ్మ నాగార్జున్‌సాగర్‌లోకి పరవళ్లు తొక్కుతోంది. ఇదే ఒరవడి కొనసాగితే సాగర్‌ నిండే సూచనలు కన్పిస్తున్నాయి. దీంతో వచ్చే రెండేళ్ల వరకు నగర తాగునీటి సరఫరాకు ఎలాంటి ఢోకా ఉండదని అధికారులు భరోసా ఇస్తున్నారు. ప్రతిరోజూ నీటి సరఫరా అనేది ఇన్నాళ్లూ ఒక కలగా మారింది. ప్రస్తుతం ప్రధాన నగరంలో రోజు విడిచి రోజు, శివార్లలో 3 నుంచి 5 రోజులకోసారి ఇస్తున్నారు. వేసవిలో కష్టాలు మరింతగా ఉంటున్నాయి. జలాశయాలు అడుగంటిపోవడం వల్ల శివార్లలో వారం పది రోజులకు ఒకసారి మాత్రమే నీటి ముఖం చూసే కాలనీలు ఎన్నో. సరైన సరఫరా వ్యవస్థ లేకపోవడం ఒక కారణమైతే...నీటి కొరత కూడా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో రూ.1900 కోట్లతో మున్సిపల్‌ సర్కిళ్లలో తాగునీటి విస్తరణ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే 52 రిజర్వాయర్లలో 30 చోట్ల పనులు కొలిక్కి వచ్చాయి. 1300 కిలోమీటర్ల వరకు సరఫరా వ్యవస్థ పనులు కూడా పూర్తి చేశారు. తద్వారా ప్రధాన నగరమే కాదు...ఇక్కడ కూడా రోజూ నీటిని అందించే వీలు ఏర్పడనుంది.

కలుషిత జలాల సమస్య ఉండదు... 
రోజూ నీటి సరఫరా వల్ల కలుషిత జలాల నుంచి ప్రజలకు ఉపశమనం లభించడమేగాక వృథా కూడా అరికట్టే వీలు ఉంటుంది. ప్రస్తుతం ప్రధాన నగరంలో రోజు విడిచి రోజు ఇస్తున్నారు. దీంతో నీటి సరఫరా అయిన తర్వాత మరో 24 గంటల వరకు ఎలాంటి సరఫరా ఉండడం లేదు. సరఫరా ఆగినప్పుడు పైపుల్లో సంకోచ, వ్యాకోచాలు ఏర్పడతాయి. ఇలాంటి సమయాల్లో లీకేజీలు ఉన్నచోట బయట నుంచి మురుగు ఈ పైపుల్లోకి చేరుతోంది. రెండో రోజు సరఫరా చేసే సమయాల్లో దుర్వాసనతో కూడిన నీళ్లు వస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.. తొలి 5-10 నిమిషాల పాటు ప్రజలు వృథాగా నీటిని వదిలి పెడుతున్నారు. మొత్తం మురుగంతా పోయిన తర్వాత మళ్లీ పట్టుకుంటున్నారు. అదేవిధంగా ప్రధాన నగరంలో రెండు రోజులకోసారి, శివార్లలో మూడు, అయిదు రోజులకొకసారి సరఫరా చేయడం వల్ల ఇంట్లో బిందెలు, డ్రమ్ములతోపాటు ఖాళీ పాత్ర దొరికితే చాలు పట్టుకుంటున్నారు. ఇవన్నీ వినియోగించడం లేదు. మళ్లీ నీళ్లు వచ్చే రోజున వాటిని బయట పారబోసి తాజాగా పట్టుకుంటున్నారు. దీంతో భారీ ఎత్తున వృథా అవుతున్నాయి. రోజూ గంటపాటు నీటిని పంపిణీ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి తప్పుతుందని అధికారులు భావిస్తున్నారు. జలాశయాల్లోకి వరద వస్తున్న నేపథ్యంలో ముందు అనుకున్నట్లుగా రోజూ అందించే ప్రణాళికను పరిశీలించే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...