Jump to content

హత్య కేసుల్లో ప్రధాన సూత్రధారి డీఎస్పీ


TampaChinnodu

Recommended Posts

హత్య కేసుల్లో ప్రధాన సూత్రధారి డీఎస్పీ 
ప్రియురాలి హత్యకు రౌడీషీటరుతో రూ.కోటితో ఒప్పందం 
రూ.50 లక్షలు ఇవ్వకపోవడంతో ఎదురు తిరిగిన రౌడీ 
స్థానిక పత్రిక ఎడిటర్‌తో కలిసి ఆ రౌడీషీటర్‌ హత్యకు కుట్ర 
విశాఖలో సంచలనం కలిగించిన కేసుల్లో వీడిన మిస్టరీ 
14hyd-main9a.jpg

విశాఖపట్నం, న్యూస్‌టుడే: విశాఖ నగరంలో సంచలనం సృష్టించిన రెండు హత్య కేసుల్లో ఆర్టీసీలో విజిలెన్స్‌ డీఎస్పీ దాసరి రవిబాబును ప్రధాన నిందితుడని పోలీసు అధికారులు వెల్లడించారు. రౌడీషీటర్‌ కొప్పెర్ల సత్యనారాయణ రాజు అలియాస్‌ గేదెల రాజు హత్య కేసులో, గతేడాది సెప్టెంబరు 22న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ప్రియురాలు కాకర్ల పద్మలతది హత్యగా పరిగణిస్తూ ఆ కేసులోనూ రవిబాబు ప్రధాన నిందితుడిగా వారు పేర్కొన్నారు. గతేడాది మే వరకు అతను మధురవాడ ఏసీపీగా పని చేశారు. రౌడీషీటర్‌ హత్య కేసులో గాజువాకలోని క్షత్రియభేరి పత్రిక ఎడిటర్‌ భూపతిరాజు శ్రీనివాసరాజును పోలీసులు ఏ2 నిందితునిగా చూపించారు. మరో పది మందిని నిందితులుగా గుర్తించారు. వారిలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. రవిబాబు, భూపతిరాజు శ్రీనివాసరాజు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నా... వీరిద్దరినీ ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వీరిద్దరినీ ఏపీఎస్పీ బృందం అధీనంలో ఉంచినట్టు తెలుస్తోంది. పరారీలో ఉన్న డ్రైవర్‌ కేశవ్‌ కోసం గాలిస్తున్నారు. ఈ హత్యల కేసుల వివరాలను శనివారం నగర సంయుక్త పోలీస్‌ కమిషనర్‌ డి.నాగేంద్రకుమార్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘గాజువాకలోని శ్రీనగర్‌లో నివసిస్తున్న రౌడీషీటర్‌ కొప్పెర్ల సత్యనారాయణరాజు అలియాస్‌ గేదెల రాజు భార్య కుమారి తన భర్త కనిపించడంలేదని ఈ నెల 7న న్యూ పోర్టు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే రోజు సబ్బవరం మండలం గాలి భీమవరం శివారు ప్రాంతంలో ఓ వ్యక్తి మృతదేహం సగం వరకు కాలి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. కుమారిని అక్కడకు తీసుకెళ్లి చూపించగా శరీరంపై ఉన్న ఆభరణాల ఆధారంగా అది గేదెల రాజు మృతదేహంగా నిర్ధరించారు. ఈ ఘటనకు ముందు రోజు రాత్రి అతని ద్విచక్ర వాహనాన్ని ఓ వ్యక్తి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతను క్షత్రియ భేరి పత్రికా కార్యాలయంలో పనిచేస్తున్న గుమ్మడి రవిగా గుర్తించారు. అతని తీరు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు గట్టిగా నిలదీయడంతో అన్ని విషయాలు బయటపడ్డాయి.’

14hyd-main9b.jpg

ఏం జరిగిందంటే..?: ‘ఆర్టీసీలో విజిలెన్స్‌ డీఎస్పీగా పని చేస్తున్న దాసరి రవిబాబు విశాఖ జిల్లా పాయకరావుపేటలో గతంలో సీఐగా పని చేశారు. అక్కడి నుంచి పదోన్నతిపై విశాఖ వచ్చిన అతను పలు విభాగాల్లో ఏసీపీగా పని చేశారు. 2014 నవంబరు 9న మధురవాడ ఏసీపీగా బదిలీ అయ్యారు. పాయకరావుపేటలో రవిబాబు పనిచేసేటప్పుడు తనను నమ్మించి మోసం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే నూకరాజు కుమార్తె కాకర్ల పద్మలత 2016 మార్చి 22న నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆ తరువాత ఆమె తరచూ నగరానికి వస్తూ రౌడీషీటర్‌ గేదెల రాజు ఇంట్లో ఉండేది. ఇద్దరికీ రాజీ కుదురుస్తానని రాజు వారిస్తూ వచ్చాడు. అయినా ఆమె వినలేదు. ఆమెను అంతం చేయాలనుకున్న రవిబాబు పథకం పన్నాడు. పద్మలతను హత్య చేయడానికి కోటి రూపాయలకు రాజుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తొలుత రూ.50 లక్షలు ఇచ్చాడు. పనయ్యాక మిగిలిన రూ.50 లక్షలు ఇస్తానని నమ్మబలికాడు. ఈ నేపథ్యంలో గతేడాది పద్మలత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె గుండెపోటుతో మరణించిందంటూ అప్పట్లో పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదు. అనంతరం మిగిలిన రూ. 50 లక్షల కోసం గేదెల రాజు... రవిబాబుపై ఒత్తిడి తెచ్చాడు. విసిగిపోయిన ఆయన ఇతడిని కూడా అంతం చేయడానికి పథకం వేశాడు. భూ దందాల్లో ఆరితేరిన క్షత్రియభేరి పత్రిక ఎడిటర్‌ భూపతిరాజు శ్రీనివాసరాజుకు విషయం చెప్పాడు. సహకారం అందిస్తానని అతను చెప్పడంతో హత్యకు వ్యూహం పన్నారు. ఇందుకోసం విశాఖ ఆదర్శనగర్‌లో నివసిస్తున్న సువ్వాడ మహేష్‌(32)ను ఎంచుకున్నారు. ఇతను పలు కేసుల్లో ప్రధాన నిందితుడు. అతనితో రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మహేష్‌తో పాటు మరో ఎనిమిది మందిని సిద్ధం చేశారు. ఈ నెల 6న గాజువాకలోని క్షత్రియభేరి ప్రాంతీయ కార్యాలయంలో హత్య చేయాలని పథకం పన్నారు. ఈ క్రమంలోనే గేదెల రాజుని ఈ నెల 6న మధ్యాహ్నం 3.30 గంటలకు కార్యాలయానికి భూపతిరాజు పిలిచాడు. అప్పటికే అందరూ మారణాయుధాలతో లోపల సిద్ధంగా ఉన్నారు. గేదెల రాజు వచ్చిన వెంటనే భూపతిరాజు సైగ చేశాడు. ఆ వెంటనే అతనిపై ఒక్కసారిగా సువ్వాడ మహేష్‌, ఎర్ని శ్రీనివాసరావు, కేశవ్‌, అల్లా గోపి, మైలపిల్లి విజయ్‌కుమార్‌ అలియాస్‌ బిల్లా వెనక వైపు నుంచి కర్రలతో... బొంగా మురళి, ఆనంద్‌కుమార్‌ కత్తులతో దాడిచేశారు. గేదెల రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. పిల్లా త్రినాథ్‌, బెహరా కనకరాజు తమతో తీసుకొచ్చిన కార్పెట్‌లో భూపతిరాజు శ్రీనివాసరాజు, తోటివారి సహాయంతో మృతదేహాన్ని కట్టి పక్కన పెట్టారు. ఓ కారులో ఇద్దరూ వెళ్లి మృతదేహాన్ని గుర్తుపట్టకుండా కాల్చేందుకు అనువైన ప్రాంతాన్ని చూసి వచ్చారు. ఆ రోజు రాత్రి 7 గంటల సమయంలో ఏపీ31 డీకే 2314 వ్యానులో మృతదేహాన్ని తీసుకెళ్లి సబ్బవరం మండలం గాలి భీమవరం శివారు ప్రాంతంలో పెట్రోలు పోసి నిప్పంటించి పరారయ్యారు. అనంతరం క్షత్రియభేరి కార్యాలయానికి వచ్చి గోడలకు అంటుకున్న రక్తపు మరకల ఆనవాళ్లు కనిపించకుండా సున్నం వేశారు. బ్లీచింగ్‌ వేసి గదిని శుభ్రం చేశారు..’. అని నగర సంయుక్త పోలీస్‌ కమిషనర్‌ వివరించారు.

తెరపైకి పద్మలత హత్య కేసు: అప్పట్లో పద్మలత మరణంపై స్పందించని పోలీసులు ఇప్పుడు ఆమెది హత్యగా పరిగణిస్తున్నారు. ఈ రెండు కేసులను కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తామని నగర సంయుక్త పోలీస్‌ కమిషనర్‌ నాగేంద్రకుమార్‌ వెల్లడించారు. ఈ కేసులో గుమ్మడి రవి (55), సువ్వాడ మహేష్‌(32), ఎర్ని శ్రీనివాసరావు (30), అల్లా గోపి (30), మైలపల్లి విజయ్‌కుమార్‌ (25), బొంగా మురళి (25), కన్నం ఆనంద్‌కుమార్‌(49), పిల్లా త్రినాథ్‌ అలియాస్‌ తెల్లోడు (25), బెహరా కనకరాజు (39)లను అరెస్టు చేసి రిమాండుకు తరలించామన్నారు. 

Link to comment
Share on other sites

Quote

ఆర్టీసీలో విజిలెన్స్‌ డీఎస్పీ దాసరి రవిబాబును ప్రధాన నిందితుడని పోలీసు అధికారులు వెల్లడించారు.

Assalu RTC lo enduku DSP post. Dabbulu thagaleyyataaniki thappa.

Link to comment
Share on other sites

కిరాతక పోలీస్‌ 
రౌడీషీటర్‌ గేదెల రాజు హత్యకేసులో ఏ1 నిందితుడు డీఎస్పీ రవిబాబే.. 
ప్రియురాలు పద్మలతదీ హత్యే 
తొమ్మిది మంది అరెస్టు 
వెల్లడించిన సంయుక్త పోలీస్‌ కమిషనర్‌ 
vsp-top2a.jpg

ఒక నేరం.. మరో నేరానికి ఉసిగొల్పింది. క్రమశిక్షణకు మారుపేరుగా.. నీతికి.. న్యాయానికి.. ధర్మానికి.. ప్రతీకగా ఉండాల్సిన అధికారి.. నేరబాట పట్టాడు. నేరగాళ్లతో అంటకాగి.. ఓ మహిళ, మరో రౌడీషీటర్‌ హత్యకు కుట్ర పన్నాడు.. చివరకు ఆ రెండు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా మిగిలాడు...

ఆ వ్యక్తి దాసరి రవిబాబు... 
*ఆయన తీరు పోలీసు శాఖ ప్రతిష్ఠనే బజారుకీడ్చింది. ‘చట్టాన్ని కాపాడాల్సిన వారే చట్ట వ్యతిరేక పనులు చేయడం సరికాదు.. పోలీసు విభాగంలో ఉండి.. కీలకమైన డీఎస్పీ స్థాయి అధికారి హత్యకేసులో ఏ1గా మారడం.. సిగ్గుచేటని’.. విలేకర్ల సమావేశంలో నగర సంయుక్త పోలీసు కమిషనర్‌ నాగేంద్రకుమార్‌ వ్యాఖ్యానించటం గమనార్హం. 
*విశాఖ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన గేదెల రాజు హత్యకేసు.. దానితోపాటే గతేడాది సెప్టెంబరు 22న మృతి చెందిన ఎస్‌.రాయవరం మాజీ ఎంపీపీ కాకర్ల పద్మలత కేసుల్లో కీలక నిందితుడు డీఎస్పీ దాసరి రవిబాబేనని సంయుక్త పోలీస్‌ కమిషనర్‌ నాగేంద్రకుమార్‌ స్పష్టం చేశారు. అప్పట్లో పద్మలత మృతిని పోలీసులు పట్టించుకోలేదు. అనారోగ్యంతోనే ఆమె మృతి చెందిందన్న ప్రచారాన్ని నమ్మి దర్యాప్తు చేయలేదు. తాజాగా గేదెల రాజు హత్యతో ఆమెది కూడా హత్య అన్న కోణంలో దర్యాప్తు చేయనున్నారు. పద్మలత పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర్ల నూకరాజు కుమార్తె.

ఈనాడు, విశాఖపట్నం;న్యూస్‌టుడే, పూర్ణామార్కెట్‌

దాసరి రవిబాబు తనతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడని, తరువాత పట్టించుకోవడం మానేశాడని, ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని గతేడాది పద్మలత నగర పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఈ గొడవ సద్దుమణిగిందనే అంతా భావించారు. గేదెల రాజు కుటుంబంతో పద్మలతకు సన్నిహిత సంబంధం ఉందన్న విషయం తెలుసుకున్న దాసరి రవిబాబు.. ఆమెను హత్య చేసేందుకు అతనితోనే రూ. కోటికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. వీరి మధ్య ఒప్పందం జరిగిన కొద్ది రోజులకు పద్మలత అనారోగ్యం పాలైంది. ఆమెను చికిత్స కోసం కారులో బయటకు తీసుకెళ్తున్నపుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

హత్యకు రూ. కోటి నజరానా..: పద్మలతను హత్య చేసేందుకు గేదెల రాజుకు దాసరి రవిబాబు రూ. 50 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. మిగిలిన రూ. 50 లక్షలు అతను ఇవ్వకపోవటంతోనే గేదెల రాజు అతనిని రోజూ వేధించేవాడని.. ఈ విషయమై దాసరి రవిబాబు తనకు సన్నిహితుడైన క్షత్రియభేరి పత్రికా సంపాదకుడు భూపతిరాజు శ్రీనివాసరాజును సలహా అడిగినట్లు విచారణలో తెలిసినట్లు పోలీసులు వెల్లడించారు.

vsp-top2b.jpgఅనుమానాలెన్నో..?: గేదెల రాజు హత్యకేసులో వెలుగుచూసిన వాస్తవాలు.. పద్మలత మృతిపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. డీఎస్పీ దాసరి రవిబాబు చిక్కితే.. అసలు వాస్తవాలు బయటపడే అవకాశాలున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి నాలుగు రోజుల క్రితమే విజయవాడ - గుంటూరు సమీపంలో ఏ2 నిందితుడు భూపతిరాజు శ్రీనివాసరాజుతోపాటు.. రవిబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. విషయం బయటకు పొక్కకుండా రహస్య ప్రాంతంలో ఏపీఎస్పీ బృందం పర్యవేక్షణలో ఉంచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ హత్య కేసులో పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారం సేకరించినట్లు సమాచారం. ఏ1 నిందితుడు పోలీసు ఉన్నతాధికారి కావడంతో ఈ కేసుతో పోలీసుల ప్రతిష్ఠ రోడ్డున పడే పరిస్ధితి నెలకొంది. దీంతో కీలకమైన వ్యక్తులను మీడియా ఎదుట హాజరుపరచడంలో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏ2 నిందితుడితోపాటు.. అతని డ్రైవర్నూ అరెస్టు చూపలేదని తెలుస్తోంది.

భూ దందాల నుంచి హత్యల వరకు..:దాసరి రవిబాబు తీరుపై ఆది నుంచీ ఎన్నో ఆరోపణలున్నాయి. ఆయనపై ఫిర్యాదులు చేయడానికి ఎవరూ సాహసించలేదు. అధికారిక అండతో వ్యవహారాన్ని చాపకింద నీరులా నడిపేవారు. 2014 నవంబరు 9న మధురవాడ ఏసీపీగా దాసరి రవిబాబు బాధ్యతలు స్వీకరించారు. భూములకు గిరాకీ ఉన్న మధురవాడ ప్రాంతంలో ఆయన చక్రం తిప్పారు. మధురవాడ, భీమిలి, ఆనందపురం, పద్మనాభం తదితర ప్రాంతాల్లోని భూ వివాదాల్లో జోక్యం చేసుకుని రెండు చేతులా ఆర్జించాడనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అప్పట్లో ఈయన వ్యక్తిగత తీరుపైనా తీవ్రమైన ఆరోపణలు వచ్చినా పోలీసు అధికారులు స్పందించలేదు. 2016 మే 17న అక్కడ్నుంచి బదిలీ అయ్యారు. అప్పటి నగర పోలీసు కమిషనర్‌ అమిత్‌గార్గ్‌ కనుసన్నల్లో పనిచేస్తున్నట్లు అందర్నీ నమ్మించి ఈయన ఈ వ్యవహారం నుంచి చాకచక్కంతో తప్పించుకున్నారు.

పోలీసు ప్రతిష్ఠకు మసక: గేదెల రాజు, పద్మలత హత్య కేసుల్లో కీలక సూత్రధారిగా ఉన్న డీఎస్పీ దాసరి రవిబాబు తీరు ఏకంగా పోలీసు ప్రతిష్ఠనే బజారుకీడ్చింది. లంచాలు తీసుకుని అనిశాకు చిక్కుతున్న కేసులు నగర పోలీసులను ముఖం ఎత్తుకోకుండా చేస్తుంటే.. ఓ అడుగు ముందుకేసి హత్యకేసుల్లోనూ చిక్కుకోవడం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. భారీగా ఆస్తులు కూడబెట్టుకోవడమే కాకుండా హత్యకు భారీ నజరానాలు ముట్టజెబుతుండడం పరిశీలనాంశం. గతంలో భూదందాల వ్యవహారాలు వెలుగుచూసినా పోలీసు ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. ఈ పరిస్థితే పోలీసు ప్రతిష్ఠకు కోలుకోలేని దెబ్బతీయడానికి కారణమైందన్న తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో పలువురు గంజాయి మాఫియాకు, ఇతర అసాంఘీక కార్యకలాపాలకు దన్నుగా నిలుస్తున్నారు.

మెత్తబడ్డారా..?: యోగానంద్‌ నగర పోలీసు కమిషనర్‌ బాధ్యతలు స్వీకరించిన తొలిరోజుల్లో పోలీసు శాఖను ప్రక్షాళన చేసే దిశగా చర్యలు చేపట్టారు. 23 పోలీసు స్టేషన్లలో జనరల్‌ సిబ్బందిగా పనిచేస్తున్న వివిధ స్థాయుల వారిని ఆర్మ్‌డ్‌ రిజర్వుకు అప్పగించడంతోపాటు.. నెలవారీ నిర్వహించే నేర సమీక్షల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన దస్త్రాలలో కదలిక తెచ్చారు. తొలుత సిబ్బందిని పరుగులు పెట్టించినా క్రమేపీ పరిస్థితి నెమ్మదించింది. దిగువ స్థాయి సిబ్బందిపైనే పూర్తి భారం పడేసి పక్కకు తప్పుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. గత కొంతకాలంగా నగరంలో సీఐల నుంచి కానిస్టేబుళ్ల వరకు వివిధ సందర్భాల్లో ఆరోపణలు ఎదుర్కోవడంతోపాటు అనిశా దాడుల్లో చిక్కినా పై స్థాయి నుంచి కదలిక లేదు. కొంతకాలం క్రితం ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీసు స్టేషన్లో క్రైం కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిపై లైంగిక వేధింపుల ఆరోపణ వచ్చినా నేటికీ చర్యల్లేవు.

vsp-top2c.jpg

పద్మలతను పథకం ప్రకారమే హత్య చేశారా? 
ఈనాడు, విశాఖపట్నం; న్యూస్‌టుడే, పూర్ణామార్కెట్‌

అప్పట్లో ఏసీపీగా పనిచేసిన దాసరి రవిబాబుకు పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కుమార్తె పద్మలతతో సంబంధం ఉన్నట్లు వెల్లడవుతోంది.. ఆమెతో గొడవలు జరుగుతుండడంతో.. ఆమె అడ్డు తొలగించడానికి రూ.కోటి బేరం ఆడి. గేదెల రాజు సహాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం.

- విలేకర్ల సమావేశంలో విశాఖ నగర సంయుక్త పోలీసు కమిషనర్‌ డి.నాగేంద్రకుమార్‌


పద్మలత మృతిపై పోలీసులు దృష్టిసారించారు. ఆర్టీసీ విజిలెన్స్‌ డీఎస్పీ దాసరి రవిబాబుకు పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కూతురితో ఎలమంచిలిలో పనిచేస్తున్న కాలంలో వివాహేతర సంబంధం ఏర్పడింది. అనంతరం పదోన్నతిపై ఆయన మధురవాడ ఏసీపీగా వచ్చారు. ఆ తరువాత వారిద్దరి మధ్య దూరం పెరిగింది. పొరపొచ్చాలతో విభేదాలు చెలరేగాయి.. ఈ పరిస్థితులే ఆమెను అడ్డుతొలగించడానికి.. ఈ క్రమంలో మరో హత్యకూ కారణమనే వాదన పోలీసుల నుంచి వినిపిస్తోంది.

vsp-top2d.jpgvsp-top2e.jpgఫిర్యాదూ లేదు.. కేసూ లేదు..:ఏసీపీ రవిబాబు తనకు మధ్య సంబంధం ఉందని.. పెళ్లి చేసుకున్నాడని.. ఇప్పుడు ఎలాంటి భరోసా ఇవ్వకుండా వదిలించుకోడానికి ప్రయత్నిస్తున్నాడని ఆమె అప్పట్లో నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం అప్పట్లో వివాదాస్పదమయ్యింది. అప్పట్నుంచి న్యాయం కోసం పలుమార్లు పోలీసులను ఆశ్రయించింది. పోలీసు అధికారిపై ఆరోపణలు ఎదురవ్వడంతో ఆ శాఖ నుంచి సహకారం లోపించింది. ఇదే క్రమంలో వ్యూహాత్మకంగా గేదెల రాజుతో పరిచయం పెరిగింది. ఈమెకు న్యాయం చేస్తామని నమ్మబలికి కాలయాపన చేశారు. ఇదే క్రమంలో ఈమెకు మానసిక స్థితి బాగోలేదని నర్సీపట్నంలో భూత వైద్యుని దగ్గరకు, నాటువైద్యుని దగ్గరకూ తీసుకువెళ్లారు. గతేడాది సెప్టెంబరు 22న కార్లో వస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కుప్పకూలిందని.. వైద్యులను ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని.. మృతదేహాన్ని స్వగ్రామమైన ఎస్‌.రాయవరం మండలంలోని చినగుమ్మలూరుకు తీసుకెళ్లి అప్పగించారు. ఈ సమయంలో మృతురాలి సోదరుడితోపాటు గేదెల రాజు, మరో నాయకుడు ఉన్నట్లు తెలుస్తోంది. అస్వస్థతలో కుప్పకూలిందని నమ్మిన కుటుంబ సభ్యులు పద్మలత మరణంపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కానీ అప్పట్లో శరీరం రంగు మారిందని.. అప్పట్లో అనుమానాలు తలెత్తాయి. ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాకపోవటంతో పోలీసులూ పట్టించుకోలేదు.

హత్య కేసుతో..: తాజాగా గేదెల రాజు హత్యకేసుతో డొంక కదిలి.. పద్మలత మరణం సహజమరణం కాదని.. పథకం ప్రకారమే జరిగిందని సాక్షాత్తూ నగర సంయుక్త పోలీసు కమిషనర్‌ నాగేంద్రకుమార్‌ వెల్లడించడంతో అంతా ఉలిక్కిపడ్డారు. దీనిపై విచారణ చేపడతామని వెల్లడించడం.. గతంలో ఈ తరహా కేసులు చాలా ఛేదించామని చెప్పడంతో ఈ మిస్టరీ వెనుక లోతెంత..? అన్న ఆసక్తి అంతటా నెలకొంది.

Link to comment
Share on other sites

Quote

భూ దందాల నుంచి హత్యల వరకు..:దాసరి రవిబాబు తీరుపై ఆది నుంచీ ఎన్నో ఆరోపణలున్నాయి. ఆయనపై ఫిర్యాదులు చేయడానికి ఎవరూ సాహసించలేదు. అధికారిక అండతో వ్యవహారాన్ని చాపకింద నీరులా నడిపేవారు. 2014 నవంబరు 9న మధురవాడ ఏసీపీగా దాసరి రవిబాబు బాధ్యతలు స్వీకరించారు. భూములకు గిరాకీ ఉన్న మధురవాడ ప్రాంతంలో ఆయన చక్రం తిప్పారు. మధురవాడ, భీమిలి, ఆనందపురం, పద్మనాభం తదితర ప్రాంతాల్లోని భూ వివాదాల్లో జోక్యం చేసుకుని రెండు చేతులా ఆర్జించాడనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అప్పట్లో ఈయన వ్యక్తిగత తీరుపైనా తీవ్రమైన ఆరోపణలు వచ్చినా పోలీసు అధికారులు స్పందించలేదు. 2016 మే 17న అక్కడ్నుంచి బదిలీ అయ్యారు. అప్పటి నగర పోలీసు కమిషనర్‌ అమిత్‌గార్గ్‌ కనుసన్నల్లో పనిచేస్తున్నట్లు అందర్నీ నమ్మించి ఈయన ఈ వ్యవహారం నుంచి చాకచక్కంతో తప్పించుకున్నారు.

Fake news. Nippu CBN ruling lo no corruption.

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:

Assalu RTC lo enduku DSP post. Dabbulu thagaleyyataaniki thappa.

Vigilance officer ante corrupts ni pattukune officer usually anni govt offices lo police officer e untadu aa post la

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...