Jump to content

Hyderabad Metro

mahesh1

Recommended Posts

రోజూ 520 ట్రిప్పులు.. 
వేగం పెంపు, ఏసీ ప్రయాణం.. మెట్రోకు పెరిగిన ఆదరణ 
ఈనాడు, హైదరాబాద్‌
రైళ్ల వేగం, ట్రిప్పుల సంఖ్య పెరిగాక మెట్రోకు ప్రయాణికుల నుంచి ఆదరణా పెరిగింది. దీనికితోడు ఎండలు మండిపోతుండటంతో ఏసీ ప్రయాణానికి నగరవాసులు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల వరకు రోజువారీ ప్రయాణికుల సగటు 60 వేలకు పైగా ఉంది. ప్రస్తుతం ఈ సంఖ్య 65,000-75,000కు చేరింది. రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాక ప్రయాణ తీరుతెన్నులను ‘ఈనాడు’ పరిశీలించింది.
hyd-gen1a.jpg

మియాపూర్‌-అమీర్‌పేట-నాగోల్‌ 30 కి.మీ. దూరమైనా మెట్రో ప్రయాణించేది 27.6 కి.మీ. మాత్రమే. ఈ రెండు వేర్వేరు కారిడార్లలోని మెట్రో మార్గంలో ఈ నెల 21 నుంచి ఫ్రీక్వెన్సీ పెంచారు. రద్దీ సమయాల్లో ప్రతి 7 నిమిషాలకు, మిగతా సమయాల్లో 8 నిమిషాలకు ఒక రైలు నడుపుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు వరకు సర్వీసులు నడుస్తున్నాయి. చివరి రైలు డిపోకు చేరేసరికి 11 గంటలు దాటుతోంది. రెండు కారిడార్లలో కలిపి రానుపోను ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైలు సంస్థ ప్రతిరోజు 520 ట్రిప్పులను నడుపుతోంది.

నాలుగైదు నిమిషాల్లోనే.. 
ఏడెనిమిది నిమిషాలకు ఒక మెట్రో నడుపుతున్నా.. సగటున ఒక ప్రయాణికుడు ప్లాట్‌ఫాంపైకి వచ్చి రైలు కోసం ఎదురుచూస్తున్న  సమయం మూడు నాలుగు నిమిషాలకు మించడం లేదు. ప్రయాణికులు వచ్చే సరికి ప్లాట్‌ఫాంపై మెట్రో లేదంటే.. నాలుగు నిమిషాల్లోనే మరో మెట్రో వస్తోంది. ఐదో నిమిషంలో మెట్రోలో ఉంటే.. ఆరో నిమిషంలో బయలుదేరి వెళుతోంది.

ఇక్కడే కొంచెం సమస్య..  సమాచార ఆధారిత రైలు వ్యవస్థ (సీబీటీసీ) సాంకేతికత అనుమతి రావడంతో వేగం పెంచి మెట్రోరైళ్లను నడుపుతున్నారు. నాగోల్‌ నుంచి అమీర్‌పేట 16.7 కి.మీ. దూరానికి 33 నిమిషాలు పడుతోంది. నాగోల్‌ నుంచి బేగంపేట 15.2 కి.మీ.దూరం  28 నిమిషాల్లోనే వస్తోంది. రెండు నిమిషాల్లోనే ఒక స్టేషన్‌కు చేరుకొంటోంది. బేగంపేట నుంచి అమీర్‌పేట వరకు మాత్రం మలుపులు ఎక్కువగా ఉండటం, ట్రాక్‌ మారుతుండటంతో 1.5 కి.మీ. దూరానికే ఐదు నిమిషాల సమయం అవసరమవుతోంది.

* అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌ దాటి ముందుకు వెళ్లే వీలులేకపోవడంతో.. బేగంపేట స్టేషన్‌ తర్వాత గ్రీన్‌ల్యాండ్స్‌ దాటాక ట్రాక్‌ మారి అమీర్‌పేట ఫ్లాట్‌ఫాంపైకి వస్తోంది. ఇక్కడ ఒకటే ఫ్లాట్‌ఫాం వినియోగంలో ఉన్నందున.. ఒక మెట్రో వచ్చి వెళ్లాక మరొకటి వచ్చేలా జాగ్రత్తలు తీసుకునే క్రమంలో రెండు నిమిషాలు ఆలస్యం అవుతోంది.

* ఎస్‌ఆర్‌నగర్‌ నుంచి అమీర్‌పేట వరకూ ఇదే సమస్య ఉత్పన్నం అవుతోంది. కారిడార్లు మొత్తం అందుబాటులోకి వస్తే ఈ సమస్య ఉండదని మెట్రో వర్గాలు అంటున్నాయి.

ఐపీఎల్‌ రోజు ఆదుర్స్‌..  మెట్రో ఫ్రీక్వెన్సీ పెంచిన మరుసటి రోజు ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ జరిగింది. ఆదివారం కావడంతో 36వేల సామర్థ్యంతో పూర్తిగా నిండిపోయింది. స్టేడియం సమీపంలోనే స్టేషన్‌ ఉండటంతో అభిమానులు పెద్ద సంఖ్యలో మెట్రోని వినియోగించుకున్నారు. స్టేడియం వద్ద కార్లు, ద్విచక్ర వాహనాలకు పార్కింగ్‌ సమస్య ఉండటంతో మెట్రోవైపు మొగ్గుచూపారు. దాదాపు 22వేల మంది క్రికెట్‌ అభిమానులు ఆ రోజు మెట్రోలో ప్రయాణించారు.

Link to comment
Share on other sites

Eventually thats what it will happen...they will end up connecting until the airport..and with airport going for an exapnsion by adding another terminal and with projected rise in passenger capacity from 5 mpa to 10 mpa, it would nessaciate extending metro..

and its much easier to extend the metro as land acquiring and building will not create too many obstacles as it happened with in the city...

but the catch is, GMR earns decent revenue by charging for taxis, parking etc which is lucrative income. By making this airport metro friendly, they may loose decent earnings...and there is even talk that because of this reason only mmts expansion to shamshabad has been put on hold..

Link to comment
Share on other sites

Just now, Android_Halwa said:

ఏడాదిన్నరలో విమానాశ్రయానికి మెట్రో! 
పనులు వేగవంతం చేసిన సర్కారు 
నిర్మాణం తమ వల్ల కాదన్న ఎల్‌అండ్‌టీ 
టెండర్ల ద్వారా మరొకరికి అప్పగించే వీలు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో రైలు నడపాలని నిర్ణయించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తోంది. హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టును చేపట్టిన ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ సంస్థ కాకుండా టెండర్లు పిలిచి మరో సంస్థకు దీని నిర్మాణ బాధ్యతను అప్పగించాలని నిర్ణయించింది. ఏడాదిన్నరలోనే విమానాశ్రయానికి మెట్రో రైలును నడపాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఇప్పటికే నిర్మించిన మేరకు మెట్రో ప్రాజెక్టు వ్యయం అనుకున్నదానికంటే ఎక్కువ కావడంతో విమానాశ్రయం వరకు నిర్మాణాన్ని తాము చేపట్టలేమని ఎల్‌అండ్‌టీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించే బాధ్యతను ఢిల్లీ మెట్రో రైలు సంస్థకు అప్పగించారు. మొత్తంగా నిర్మాణానికి రూ.4,496కోట్ల మేర వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మొత్తంలో 10 శాతం రూ.440కోట్లను హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ తరఫున రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) రూ.440 కోట్లు, కేంద్రం రూ.440 కోట్లు, జీఎంఆర్‌ రూ.440 కోట్ల మేర భరించేలా ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తోందని సచివాలయ అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. మిగిలిన మొత్తాన్ని ఆర్థిక సంస్థల నుంచి రుణం కింద తీసుకోవాలని నిర్ణయించారు. నాలుగైదు నెలల్లో టెండర్లకు వెళ్లాలని భావిస్తున్నారు. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ వరకు 30.7 కిలోమీటర్ల మార్గంలో నాలుగైదు స్టేషన్లు మాత్రమే ఉంటాయని చెబుతున్నారు.
 
ముఖ్యాంశాలు

Link to comment
Share on other sites

I think its way too early to build and operate metro from hyd-shamshabad..

and building from rayadurgam-shamshabad it bad bad idea...seems there is political interest involved..

however falaknuma has a metro station planned already....all that they need to do is connect shamshabad with falaknuma...the distance reduces to just 16 KMS...

But rayadurgam nundi shamshabad...motham grrenfield area..to jack up the costs of land ie project sestunaremo...

Link to comment
Share on other sites

24 minutes ago, Android_Halwa said:

Eventually thats what it will happen...they will end up connecting until the airport..and with airport going for an exapnsion by adding another terminal and with projected rise in passenger capacity from 5 mpa to 10 mpa, it would nessaciate extending metro..

and its much easier to extend the metro as land acquiring and building will not create too many obstacles as it happened with in the city...

but the catch is, GMR earns decent revenue by charging for taxis, parking etc which is lucrative income. By making this airport metro friendly, they may loose decent earnings...and there is even talk that because of this reason only mmts expansion to shamshabad has been put on hold..

yes...mmts dead cheap autadi....kani dani extend cheyanivaledu....lobbied ani appatlone talk...

Link to comment
Share on other sites

  • 3 months later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...