Jump to content

న్యూజిలాండ్‌లో విదేశీయులు ఇళ్లను కొనలేరు


TampaChinnodu

Recommended Posts

న్యూజిలాండ్‌లో విదేశీయులు ఇళ్లను కొనలేరు 
31brk-95.jpg

వెల్లింగ్టన్‌: ఇక నుంచి విదేశీయులు న్యూజిలాండ్‌లో ఇళ్లు కొనుగోలు చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు ఆదేశ ప్రధానమంత్రి జసిండా అర్డెర్న్‌ ప్రకటించారు. 2018 నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. అయితే.. ఆస్ట్రేలియన్లకు మాత్రం ఈ నిషేధం వర్తించదు. విదేశీయులు ఎక్కువగా న్యూజిలాండ్‌లో ఇళ్లను కొనుగోలు చేస్తుండటంతో స్థానికులకు కొరత ఏర్పడుతోందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ‘న్యూజిలాండ్‌ దేశస్థులకు ఇళ్లు కొనుగోలు చేయడాన్ని సులభతరం చేస్తున్నాం. విదేశీయులు ఇక్కడ ఇళ్లు కొనుగోలు చేయడం, ధరలు పెంచడాన్ని నిలిపివేస్తున్నాం.’ అని అర్డెర్న్‌ ఈమెయిల్‌ ద్వారా తెలియజేశారు.

ఈ నిషేధం నుంచి ఆస్ట్రేలియన్లకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. అక్కడ న్యూజిలాండ్‌ దేశస్థులు ఎక్కువమంది నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియాకు మినహాయింపు ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. విదేశీయులు ఇక్కడ ఇళ్లను కొనుగోలు చేయడం వల్ల దాదాపు 50శాతం ధరలు పెరిగాయి. ఆక్లాండ్‌లో అయితే.. ధరలు రెట్టింపు ఉన్నాయి. వేగంగా ధరలు పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం పడే అవకాశం ఉందని కేంద్ర బ్యాంకు అభిప్రాయపడింది. ఈ నిషేధానికి సంబంధించిన బిల్లును న్యూజిలాండ్‌ పార్లమెంటులో డిసెంబరు 25న ప్రవేశపెట్టనున్నట్లు అర్డెర్న్‌ వెల్లడించారు.

Link to comment
Share on other sites

2 minutes ago, Piracy Raja said:

@TRUMP pls implement this in USA also @3$%

18% of homes bought by asians in 2016. Housing market will collapse in USA, ripple effect will yield to recession ... @~`

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...