Jump to content

చార్మినార్‌ స్ఫూర్తితో..


TampaChinnodu

Recommended Posts

సరికొత్త ఇమేజ్‌ 
యానిమేషన్‌, గేమింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ రంగంలో తెలంగాణను తీర్చిదిద్దుతాం 
త్వరలో కొత్త విధానం ఆవిష్కరణ 
అన్ని డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కోర్సులు 
పాఠశాల స్థాయిలోనూ శిక్షణ 
15 లక్షల మందికి ఉపాధి 
ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ 
ఈనాడు - హైదరాబాద్‌ 
5hyd-main1a.jpg

యానిమేషన్‌, గేమింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ రంగంలో తెలంగాణను విశ్వకేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇమేజ్‌ సౌధాన్ని రాష్ట్రానికి మణిహారంగా తయారుచేస్తామన్నారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని విజ్ఞాననగరం (నాలెడ్జ్‌సిటీ)లో రూ. 946 కోట్లతో నిర్మించనున్న ఇమేజ్‌ సౌధానికి ఆదివారం ఆయన.. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు.‘‘ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో యానిమేషన్‌, గేమింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2016లో 242.92 బిలియన్‌ డాలర్ల వ్యాపారం దీనికి జరిగింది. భారత్‌లో 1.39 బిలియన్ల మేరకు దీనికి మార్కెట్‌ ఉంది. 2021 నాటికి అది 3.12 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌లో ఇప్పుడే యానిమేషన్‌ యుగం నడుస్తోంది. తెలంగాణలో ఈ రంగం భారీఎత్తున విస్తరిస్తోంది. ఇప్పటికే ఇక్కడ గ్రీన్‌గోల్డ్‌, ఎలక్ట్రానిక్‌ ఆర్ట్స్‌, పర్పుల్‌టాక్‌, రోటోమేకర్స్‌, రాక్‌సాల్ట్‌, ముక్త, సెవెన్‌సీస్‌, గేమ్‌ శాస్త్ర, డీక్యూ ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి 100 పైగా ప్రసిద్ధ సంస్థలు ప్రారంభం కాగా 30 వేలమంది నిపుణులు పనిచేస్తున్నారు. బాహుబలి, అరుంధతి, మగధీర, ఈగ, లైఫ్‌ ఆఫ్‌ పై వంటి అద్భుతమైన దృశ్య ప్రభావిత సినిమాల నిర్మాణం ఇక్కడే జరగడం రాష్ట్రానికి గర్వకారణం. విజయవంతమైన పలు ఆంగ్ల చిత్రాల యానిమేషన్‌ పోస్టు ప్రొడక్షన్‌ పనులు ఇక్కడే జరిగాయి. ఈ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని గుర్తించి మా ప్రభుత్వం విశేష ప్రాధాన్యమిస్తోంది. తెలంగాణ ఐటీ రంగంలో అగ్రభాగాన ఉండడం యానిమేషన్‌, గేమింగుకు వూతంగా మారింది. దీనికోసం ఒక ఇంక్యుబేషన్‌ కేంద్రం ఏర్పాటు చేశాం. ఈ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి, అగ్రస్థానానికి చేరేందుకు. పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు కొత్త ఇమేజ్‌ విధానం తెస్తున్నాం. దీనికింద దేశంలో ఎక్కడా లేని విధంగా పెదఎత్తున రాయితీలు కల్పిస్తాం. భారీపరిశ్రమలకు కోరిన రాయితీలు ఇస్తాం. అంకుర పరిశ్రమలు, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, అంతర్జాతీయ ఖ్యాతిగల శిక్షణ సంస్థలకు చేయూతనిస్తాం. యానిమేషన్‌ పరిశ్రమలతో భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో వస్తాయి. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి చర్యలు చేపడతాం. శిక్షణ కోసం ప్రత్యేక ప్రతిభా కేంద్రం (సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ) ఏర్పాటు చేస్తాం. అన్ని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లోని ఫైన్‌ఆర్ట్స్‌ కోర్సుల్లో, ఐటీఐలలో, నైపుణ్య సంస్థల్లో యానిమేషన్‌, గేమింగు కోర్సులను చేరుస్తాం. పాఠశాలల్లోనూ చిత్రలేఖనం తప్పనిసరి పాఠ్యాంశంగా చేస్తాం. టాస్క్‌ ద్వారా శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. స్థానికుల ప్రతిభావిశేషాలను జాతీయ ఛానళ్లలో ప్రచారం చేయిస్తాం. ఇమేజ్‌ సౌధాన్ని సలాబత్‌ సత్వ సంస్థతో కలిసి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పది ఎకరాల్లో నిర్మిస్తున్నాం. దీనికి ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పిస్తాం. 15 లక్షల మందికి దీని ద్వారా ఉపాధి కలుగుతుంది..’’ అని కేటీఆర్‌ చెప్పారు.

మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. యూనిమేషన్‌ ద్వారా రాష్ట్ర ప్రతిష్ఠ పెరుగుతుందన్నారు. టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, ఎండీ వెంకటనర్సింహారెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌, పరిశ్రమల ప్రతినిధులు, సంఘాల నేతలు ఇందులో పాల్గొన్నారు.

చార్మినార్‌ స్ఫూర్తితో.. 
5hyd-main1b.jpg
‘హైదరాబాద్‌కు మకుటాయమానంగా నిలుస్తున్న చార్మినార్‌ స్ఫూర్తితో ఇమేజ్‌ సౌధం నమూనాను సిద్ధం చేశాం. చార్మినార్‌ మాదిరే ఇది అద్భుత నిర్మాణంగా హైదరాబాద్‌కు ఖ్యాతి తెస్తుంది. ఎటు చూసినా టీ ఆకారంలో ఈ నిర్మాణం ఉంటుంది. టీ అంటే తెలంగాణ, టీ అంటే టెక్నాలజీ.. మూడేళ్లలోనే దీని నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. వంద మీటర్ల ఎత్తు, 16 లక్షల చదరపు అడుగుల కార్యాలయాల స్థలంతో ఇది 2020 నాటికి సిద్ధమవుతుంది’ 
- ఐటీ మంత్రి కేటీఆర్‌
Link to comment
Share on other sites

  • Replies 49
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Kontekurradu

    15

  • TampaChinnodu

    10

  • TheBrahmabull

    9

  • Kool_SRG

    6

Top Posters In This Topic

33 minutes ago, Android__Halwa said:

puli ni chusi nakka vatha anattu gippudu mana yellow soldiers vachi ma cbn eppudo start anturemo

AP building designs kantey idi saala better gaa vundi. Building design means something. Aa AP designs lo Telugu thanam some one flease explain

Link to comment
Share on other sites

6 hours ago, TampaChinnodu said:

AP building designs kantey idi saala better gaa vundi. Building design means something. Aa AP designs lo Telugu thanam some one flease explain

neeku ala anipinchakpothe vinta kaani ala anipnchatam lo vinta emaunid
Ap meda daily crying ee kada, malli daniki covering kosam e pics easi edavatam deniki. 



 

Link to comment
Share on other sites

12 minutes ago, Kontekurradu said:

neeku ala anipinchakpothe vinta kaani ala anipnchatam lo vinta emaunid
Ap meda daily crying ee kada, malli daniki covering kosam e pics easi edavatam deniki. 



 

Abho..! Bagundi kada nd katha..

Link to comment
Share on other sites

1 minute ago, Kool_SRG said:

If I am right this design was earlier proposed for Police HQ building edo kadataaru ani talk vachindi ga..

I got it wrong this is the one for Police Command & Control center

 

Image result for new police headquarters hyderabad building

Link to comment
Share on other sites

24 minutes ago, pahelwan said:

Diniki PPT ane pedda word avsarama. It’s just 960 crores. 

PPT qualify kavali ante minimum 1000 crs and 5000 jobs undala?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...