Jump to content

Avoid Walks, Don't Smoke: Delhi Government's Advisory


TampaChinnodu

Recommended Posts

Odhu ra kottodhu ra chetlani undanivandi ra ani chepthe okadu vinaledhu ipudu 10ginchukuntunaru ...

"Vinashakaree viparetha buddhi ... " ani urike analey savandi ipudu manam cheskuna daniki manamey saddham ...

Link to comment
Share on other sites

కమ్ముకున్న విషం.. కాలుష్యపు ఉత్పాతం! 
దిల్లీలో కాలుష్య ‘అత్యయక’ పరిస్థితి 
10 మందిని మింగిన రోడ్డు ప్రమాదం 
8main1a.jpg

దిల్లీ: దేశరాజధానిని చుట్టుముట్టిన బూడిదరంగు కాలుష్య భూతం బుధవారం ఉత్పాతాన్ని సృష్టించింది. కాలుష్యం, పొగమంచుతో దృశ్య గోచరత అనేది మృగ్యం కావడంతో రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. కన్నుపొడుచుకున్నా కానరాని విషపు పొగ మూలంగా రైళ్లు, బస్సులు ఆలస్యంగా నడిచాయి. విమానాల రాకపోకలకూ అంతరాయం కలిగింది. ఎన్నోచోట్ల ట్రాఫిక్‌ జాంతో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. శ్వాససంబంధ సమస్యలు...కళ్లనీళ్లు కారడం వంటి ఇబ్బందులతో జనం ఆసుపత్రుల వద్ద క్యూలు కట్టారు. కాలుష్యపరంగా ‘అత్యయక పరిస్థితి’ని అధికారికంగా ప్రకటించారు. పంజాబ్‌, భటిండా నుంచి సిర్సా, హిస్సార్‌ మీదుగా దిల్లీ వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ప్రమాదాలు సంభవించకుండా ముందు జాగ్రత్తగా అధికారులే కొన్ని బస్సు సర్వీసులనూ రద్దు చేశారు. ఈ మార్గాల మీదుగా వెళ్లే ఎన్నో రైళ్ల వేళలకు మార్పుచేర్పులు తప్పనిసరైనాయి. బుధవారం ఉదయం వేళ యమునా ఎక్స్‌ప్రెస్‌ వే మీద కాలుష్యపు పొగ, మంచు మూలంగా వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఇరవైకి పైగా వాహనాలు ఢీకొన్న సంఘటనలో 22 మందికిపైగా స్వల్పంగా గాయపడ్డారు.

8main1b.jpg

ఘోర రోడ్డు ప్రమాదం... 
దట్టంగా కాలుష్యపు విషపు పొర అలముకోవడంతో ఎక్కడ ఏముందో కనిపించని స్థితిలో పంజాబ్‌లోని భుషోమండి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాము ప్రయాణిస్తున్న బస్సు పాడైపోవడంతో రోడ్డుపక్కనే నిలబడి ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజల పైకి ఓ టిప్పర్‌ దూసుకెళ్లి పదిమంది విద్యార్థులు దాని కిందపడి నుజ్జునుజ్జయ్యారు. మరోతొమ్మిదిమంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు అమ్మాయిలున్నారు.హరియాణాలోని సిర్సా, రోహ్‌తక్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల్లో కనీసం 13 మంది గాయపడ్డారు.

8main1c.jpg

విషాన్నే పీల్చారు 
రాజధాని దిల్లీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది... ఒక్కమాటలో చెప్పాలంటే దిల్లీ వాసులు బుధవారం ‘విషాన్నే’ఉచ్వాసించారు...నిశ్వాసించారు. ఎటు చూసినా ముఖానికి ‘మాస్క్‌’లు ధరించిన మనుషులు...చిక్కని బూడిదరంగు కాలుష్యపొరల మధ్య ఛాయాచిత్రాల్లా కదులాడుతూ కనిపించారు.

1952లో లండన్‌ నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన భారీ పొగమంచు విలయాన్ని దిల్లీలో పరిస్థితి బుధవారం కళ్లకు కట్టినట్లుగా ఉందని ‘ఎయిమ్స్‌’ సంచాలకులు రణదీప్‌ గులేరియా ఆవేదనగా పేర్కొన్నారు. ‘వైద్యపరంగా అత్యాయక పరిస్థితి’గా నేటి స్థితిని ఆయన అభివర్ణించారు. ఈ పరిణామంతో అవాక్కయిన అధికారులు ముందుగా చిన్నారులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఆదివారం దాకా పాఠశాలలన్నిటికీ మూకుమ్మడిగా సెలవు ప్రకటించేశారు. ఉదయపు నడక కార్యక్రమాలు మానేయాల్సిందిగా వైద్య అధికారులు సూచించారు. పిల్లలను ఇళ్లలో నుంచి వెలుపలికి రానీయకుండా చూడాల్సిందిగా కోరారు. నగరంలో నిర్మాణ పనులను నిలిపివేయించారు. ట్రక్కులు దిల్లీలోకి రాకుండా నిషేధించారు.

సూచీపై 500గా.... 
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) సూచీపై కాలుష్యం స్తాయి ఏకంగా 500గా చూపడం బుధవారం నాటి ప్రమాదకర పరిస్థితికి అద్దంపట్టింది. కార్బన్‌ మోనాక్సైడ్‌, సల్ఫర్‌డైయాక్సైడ్‌ తదితరాలు సమ్మిళితమై దిల్లీలో గాలిని విషపూరితం చేసేశాయి. గాలి కదలిక అన్నదే లేదు. ఇరుగుపొరుగున ఉన్న పంజాబ్‌, హరియాణాల నుంచి ఒక్కసారిగా వచ్చిన కాలుష్యపూరిత పొగ దిల్లీలో గాలిని నాణ్యతను విషతుల్యం చేసేశాయి.

ఇల్లొదిలి బయటకు రాకండి 
బుధవారం నాటి అత్యవసర పరిస్థితిని తన కార్యాలయం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. రాజధానిని కమ్ముకున్న దట్టమైన కాలుష్యం పొర అత్యంత విషపూరితమైనదనీ...అందుకే, ఇల్లు వదలి వెలుపలికి రాకుండా ఉండాలనీ ప్రభుత్వం ప్రజలను కోరింది. ఉబ్బసం, తదితర శ్వాససంబంధ ఇబ్బందులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అదనపు రైలు ట్రిప్పులను నడుపుతామంటూ దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. దిల్లీ పరిసరాలైన ఫరీదాబాద్‌, ఘజియాబాద్‌, గురుగ్రామ్‌, నోయిడాల్లో పరిస్థితి కూడా ఇంతే ఇబ్బంది కరంగా ఉంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...