Jump to content

లక్ష ఉద్యోగాలు..లక్ష కోట్ల పెట్టుబడులు


TampaChinnodu

Recommended Posts

లక్ష ఉద్యోగాలు..లక్ష కోట్ల పెట్టుబడులు 
అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారత కంపెనీల తోడ్పాటు 
మున్ముందూ ఇదే ధోరణి కొనసాగే అవకాశం 
సీఐఐ నివేదిక 
15business-news2a.jpg

వాషింగ్టన్‌: అమెరికాలో భారత కంపెనీలు లక్షల ఉద్యోగాలు సృష్టించడంతో పాటు లక్షల కోట్లు పెట్టుబడిగా పెట్టాయని ఓ నివేదిక వెల్లడించింది. తద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు విశేష తోడ్పాటును అందించాయని తెలిపింది. ‘భారత్‌ మూలాలు, అమెరికా భూమి’ పేరుతో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం అమెరికాలోని 50 రాష్ట్రాలు, పూర్టో రికోలో భారత్‌కు చెందిన 100 కంపెనీలు 1,13,423 మందికి ఉద్యోగాలు కల్పించాయి. అంతేకాకుండా ఆ దేశంలో ప్రత్యక్షంగా 1800 కోట్ల డాలర్లు (రూ.1,15,000 కోట్లు) పెట్టుబడిగా పెట్టాయి. భారత పరిశ్రమ, వృత్తి నిపుణులు అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగతికి గణనీయ సహకారాన్ని అందిస్తున్నారని అమెరికాలో భారత అంబాసిడర్‌ నవ్‌తేజ్‌ సర్నా తెలిపారు. ఇరు దేశాలు ఒకరి విజయానికి మరొకరు ఏవిధంగా పరస్పర సహకారం అందించుకుంటోన్నాయో చెప్పడానికి అమెరికాలో భారత కంపెనీల పెట్టుబడులే నిదర్శనమని సీఐఐ డైరెక్టర్‌ చంద్రజిత్‌ బెనర్జీ వెల్లడించారు. సీఐఐ నివేదికలోని మరికొన్ని వివరాలు ఇలా.. 
* భారత్‌కు చెందిన 100 కంపెనీలు అత్యధికంగా న్యూ జెర్సీలో 8,572 ఉద్యోగాలను సృష్టించాయి. ఆ తర్వాతి స్థానాల్లో టెక్సాస్‌ (7,251 ఉద్యోగాలు), కాలిఫోర్నియా (6,749), న్యూయార్క్‌ (5,135), జార్జియా (4,554) ఉన్నాయి. 
* అత్యధికంగా న్యూయార్క్‌లో 157 కోట్ల డాలర్లు, న్యూజెర్సీలో 156 కోట్ల డాలర్లు, మసాచుసెట్స్‌లో 93.1 కోట్ల డాలర్లు, కాలిఫోర్నియాలో 54.2 కోట్ల డాలర్లు, వ్యోమింగ్‌లో 43.5 కోట్ల డాలర్లను ప్రత్యక్షంగా పెట్టుబడులు పెట్టాయి. 
* ఒక్కో రాష్ట్రంపై సగటున భారత కంపెనీలు పెట్టిన పెట్టుబడి విలువ 18.7 కోట్ల డాలర్లు. 
* 85 శాతం కంపెనీలు రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులను అమెరికాలో పెట్టే యోచనలో ఉన్నాయి. 87 శాతం కంపెనీలు వచ్చే ఐదేళ్లలో మరింత మంది స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని భావిస్తున్నాయి. 
* కార్పొరేటు సామాజిక బాధ్యత కింద 14.7 కోట్ల డాలర్లు (రూ.1000 కోట్లు), పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు 58.8 కోట్ల డాలర్లు (4000 కోట్లు) ఖర్చు చేశాయి.

Link to comment
Share on other sites

“Indian roots on Land of Ameica”

‘భారత్‌ మూలాలు, అమెరికా భూమి’ పేరుతో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఈ నివేదికను రూపొందించింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...