Jump to content

మర్యాదగా బీజేపీకి ఓటేయండి... లేకుంటే అయిపోతారు...!

Piracy Raja

Recommended Posts

ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ నాయకులు నానా పాట్లు పడతారన్నది జగమెరిగిన సత్యమే. రోడ్ల తుడవడం మొదలు గంటెపట్టి వంట చేసేదాకా సకల కళలు ప్రదర్శించేందుకు కూడా నేతలు వెనుకాడరు. అయితే ఎన్నికల్లో భార్య తరపున ప్రచారంలోకి దిగిన ఓ బీజేపీ నేత మాత్రం... ఓటర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక బీజేపీ నేత రంజిత్ కుమార్ శ్రీవాస్తవ భార్య పోటీచేస్తున్నారు. ఆమె తరపున ప్రచారం చేసేందుకు బుధవారం యోగి ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు దారాసింగ్ చౌహాన్, రమాపతి శాస్త్రి కూడా హాజరయ్యారు. మంత్రుల సమక్షంలోనే ముస్లిం ఓటర్లను ఉద్దేశించి నోటికి పనిచెప్పిన శ్రీవాస్తవ...
 
‘‘ఇది సమాజ్‌వాదీ ప్రభుత్వం కాదు. మునుపటిలాగా మీరు డీఎం, ఎస్పీల దగ్గరికి వెళ్లి పనులు చేసుకోలేరు. మీ నాయకుల్లో ఎవరూ మీకు సాయం చెయ్యలేరు.  బీజేపీలో కూడా ఇవాళ మీకు ఎవరూ మధ్యవర్తులు లేరు. రోడ్లు, రహదారులు, డ్రెయిన్లు అన్నీ మున్సిపాలిటీ చేతుల్లోనే ఉంటాయి. ఇవికాక మీరింకా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ తప్పించుకోవాలంటే మా కార్పొరేటర్లను ఎన్నుకోండి. మీరు రంజిత్ సాబ్ భార్యకు ఓటు వేయకపోయినా, ఆమె ఎన్నికల్లో గెలవకపోయినా మిమ్ముల్ని మీరు దూరం పెట్టుకున్నట్టే. సమాజ్‌వాదీ పార్టీ కూడా మిమ్మల్ని కాపాడలేదు. ఇది బీజేపీ పాలన అని మర్చిపోకండి... ఇంతకు ముందెప్పుడూ లేనివిధంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది...అందుకని ముస్లిం ఓటర్లు మాకే ఓటేయాలని కోరుతున్నా. నేనేమీ అడుక్కోవడం లేదు. మీరు మాకు ఓటేస్తే మీకంతా మంచిజరుగుతుంది. లేకుంటే నిస్సందేహంగా కష్టాలపాలు కావాల్సిఉంటుంది...’’ అని బెదిరింపుల పర్వానికి దిగారు.
 
ఈ ప్రసంగం వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బీజేపీ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. ఈ వ్యాఖ్యలపై స్పందించేందుకు శ్రీవాస్తవ అందుబాటులో లేకపోయినప్పటికీ... బీజేపీ ప్రతినిధి ఆర్పీ సింగ్ ఆయన్ను వెనకేసుకొచ్చారు. 2012 ఎన్నికల్లో ఆయనకు ప్రజలు ఓటేయకపోయినా.. ఎలాంటి విచక్షణ లేకుండా అభివృద్ధి కోసం పనిచేసినట్టు ఆర్పీసింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉన్నందున తమ నేతలను గెలిపిస్తే ఇతర నేతలకంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తామని చెప్పడమే ఆయన ఉద్దేశమని వివరించారు.
Link to comment
Share on other sites

3 minutes ago, Piracy Raja said:

@3$%@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...