Jump to content

ఆసియాలోనే అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్‌ మందిరం


TampaChinnodu

Recommended Posts

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభం 
26brk71-sr1.jpg

అమరావతి: క్షేత్రస్థాయిలో ఉన్న అధికారి అక్కడి నుంచే ముఖ్యమంత్రితో నేరుగా సంభాషించే అత్యాధునిక వ్యవస్థ అమరావతి సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో అందుబాటులోకి వచ్చింది. ఆర్‌టీజీఎస్‌ ఏర్పాటు చేసిన ఈ కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. దీనిలో ఆసియాలోనే అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్‌ మందిరం(బార్కో)ను ఏర్పాటు చేశారు. అత్యాధునిక సాంకేతిక హంగులతో ఏర్పాటుచేసిన దీని ద్వారా అధికారులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే ఇబ్బంది నుంచి ఉపశమనం కలగనుంది. అధికారి సెల్‌ఫోన్‌ ద్వారా ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడి నుంచే నేరుగా ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చు. ఈ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి సర్వే లెన్స్‌ కెమెరాల ద్వారా రాష్ట్రం మొత్తాన్ని ముఖ్యమంత్రి నేరుగా వీక్షించొచ్చు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5వేల కెమెరాలు ఏర్పాటుచేశారు. త్వరలో మరో 15వేల కెమెరాలను ఏర్పాటుచేయనున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఇక్కడి నుంచే ఆదేశాలు జారీచేయొచ్చు. అవసరమైతే ఆయా ప్రాంతంలో డ్రోన్ల సాయంతో తాజా పరిస్థితిని తిలకిస్తూ ఆదేశాలిచ్చే వ్యవస్థ ఏర్పాటుచేశారు.

26brk71-sr2.jpg
Link to comment
Share on other sites

2 minutes ago, kirakporadu said:

Aapandra vedhava sodhi.  Dabba kottadaniki media baga dorikindi mee yellow batch ki. Okasari amaravthi velli chusi randi. Okka building ayina complete ayindo ledo.

What is the use of monitoring officers using technology when each officer is doing corruption in the ranges of 100 crores , 500 crores. Take action on them first . without that all these technologies are waste of public money. 

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:

What is the use of monitoring officers using technology when each officer is doing corruption in the ranges of 100 crores , 500 crores. Take action on them first . without that all these technologies are waste of public money. 

When he took action he is out of power due to employees nakka want power so no way 

Employees lo marpu Ravali adhi evaru em cheyaleru 

Link to comment
Share on other sites

1 hour ago, futureofandhra said:

When he took action he is out of power due to employees nakka want power so no way 

Employees lo marpu Ravali adhi evaru em cheyaleru 

That was one of the reason . ignoring agriculture, non Hyderabad cities development was other reasons. 

He can still control corruption. But since TDP is out of power for 10 years , He wont take it seriously to save his party. 

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:

That was one of the reason . ignoring agriculture, non Hyderabad cities development was other reasons. 

He can still control corruption. But since TDP is out of power for 10 years , He wont take it seriously to save his party. 

He learnt his mistakes he won't repeat

Link to comment
Share on other sites

ఆనందంగా పనిచేద్దాం 
సాంకేతికతను అందిపుచ్చుకొని ముందుకెళ్దాం 
యంత్రాంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు 
అందుబాటులోకి ప్రపంచ ప్రఖ్యాత కమాండ్‌ కంట్రోల్‌ కేంద్ర వ్యవస్థ 
85 అడుగుల వీడియోవాల్‌ ఏర్పాటు 
అనుసంధానం కాబోతున్న 88 వేల మంది ఉద్యోగులు 
వీధిలో నిలబడే వీడియో కాన్ఫరెన్స్‌కు అవకాశం 
రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రం ప్రారంభం 
ఈనాడు - అమరావతి 
26ap-main1a.jpg
టెలీ వీడియో కాన్ఫరెన్సు ఒక వినూత్న ప్రక్రియ. దీనివల్ల మీరు (ఉద్యోగులు) ఎక్కడున్నా మిమ్నల్ని సంప్రదించవచ్చు. అదే సందర్భంలో మీరు పనిచేస్తున్నారా లేదా కూడా తెలిసిపోతుంది. సాంకేతికతను ఉపయోగించుకుని మనమందరం ఆనందంగా పనిచేద్దాం. ప్రజలకు మరింత మంచి సేవలు అందించి వారు సుఖమయంగా జీవించడానికి పాటుపడదాం.

వివిధ మార్గాల ద్వారా వచ్చిన వినతులన్నింటినీ వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక, ఆర్థికేతర విభాగాలుగా వర్గీకరించి పరిష్కరిస్తాం. రియల్‌టైమ్‌లో సమస్యలు పరిష్కరించగలిగితే అసమానతలు, పేదరికం తగ్గిపోతాయి.

- చంద్రబాబు

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి అన్ని ప్రభుత్వ విభాగాలను అనుసంధానిస్తూ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. 24 గంటలూ ఇక్కడి నుంచి రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవచ్చన్నారు. మొత్తం 88 వేల మంది ఉద్యోగులను దీనికి అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 20వేల సర్వైలెన్స్‌కెమరాలను రాష్ట్రమంతటా ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా తిలకిస్తామన్నారు. సీఎం కోర్‌డ్యాష్‌బోర్డును కొత్త వెర్షన్‌లో తీసుకొస్తామన్నారు. అన్ని పంచాయతీలను అనుసంధానిస్తామన్నారు. ఉద్యోగుల ఈ-ఫైళ్ల విధానం ద్వారా ఉద్యోగులు సకాలంలో ఫైళ్లు పూర్తి చేస్తున్నారా లేదా అనేది తెలిసిపోతుందన్నారు. ఆదివారం సచివాలయంలోని సీఎం కార్యాలయ బ్లాకులో ‘రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ రాష్ట్ర కేంద్రం’ను, అందులోని అత్యాధునిక ‘కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం’ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. నూతన పాలికామ్‌ వీడియో కాన్ఫరెన్సు విధానాన్ని ఆవిష్కరించారు.

26ap-main1b.jpg

ఈ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం విశేషాలివీ.. 
కమాండ్‌ కంట్రోల్‌ విశిష్టతలను వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌  రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ సీఈఓ అహ్మద్‌ బాబు సీఎంకు వివరించారు. ఆసియాలోనే అతి పెద్దదైన 85 అడుగుల పొడవైన ‘వీడియో వాల్‌’ ఏర్పాటు చేశామని, ఒకేసారి వంద కెమెరాల దృశ్యాలను వీక్షించవచ్చన్నారు. ఇంత పెద్ద వీడియోవాల్‌ ప్రపంచంలోనే ఎక్కడా లేదని తెలిపారు. అమెరికాలోని ఎఫ్‌బీఐ, సింగపూర్‌, హిటాచి తదితర దేశాలు, సంస్థల్లో అమలు చేస్తున్న ఈ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాలను పరిశీలించి వచ్చి ఇప్పుడు వాటన్నిటికంటే మిన్నగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామని ఇది ప్రపంచంలోనే ప్రఖ్యాతమైనదిగా నిలుస్తుందన్నారు.  ప్రతి అంశాన్ని ఇక్కడ క్షుణ్ణంగా, శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించవచ్చని, అందుకోసం అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ఇక్కడే రచించవచ్చని తెలిపారు. ఈ కేంద్రం ఇంట్రానెట్‌తో పనిచేస్తుందని ఎలాంటి సాంకేతిక అవరోధాలు ఉండవని వివరించారు.

26ap-main1c.jpg

ముఖ్యమంత్రి మాటామంతి.. 
చంద్రబాబు పాలికామ్‌ వీడియో కాన్ఫరెన్సు విధానంలో సంభాషిస్తున్నప్పుడు మండల వ్యవసాయాధికారి వెంకటకుమార్‌, అక్కడ ఎంపీటీసీ సభ్యుడు అనంతపురం జిల్లా నార్పల్‌ మండలం నడించర్ల గ్రామంలో ఓ చెట్టుకింద కనిపించారు. ‘ఏమయ్యా బాగున్నారా’ అంటూ సీఎం వారిని పలకరించారు. అనంతపురం జిల్లాలో వర్షాలు బాగా పడ్డాయని, వేరుశనగ విస్తారంగా వేశామని, దిగుబడి బాగా వస్తుందని అక్కడ ఎంపీటీసీ సభ్యుడు ముఖ్యమంత్రికి వివరించారు. ‘మంచి శుభవార్త చెప్పారు’ అంటూ అక్కడ రైతులను సీఎం అభినందించారు. త్వరలోనే శ్రీశైలం నుంచి అనంతపురం జిల్లాకు కృష్ణా జలాలు పంపి, అక్కడ చెరువులు నింపుతామని తెలిపారు. వారిద్దరే కాదు చిత్తూరు జిల్లా పెనమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఆ జిల్లా వైద్యాధికారిణి, విశాఖపట్నంలోని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దళాధికారి పాండ్య, విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ అధికారి లక్ష్మీషా, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాలు అందరూ తామున్న ప్రాంతం నుంచి కదలకుండా ఏకకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో తమ సెల్‌ఫోను ద్వారా వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Quote

ఇంత పెద్ద వీడియోవాల్‌ ప్రపంచంలోనే ఎక్కడా లేదని తెలిపారు. అమెరికాలోని ఎఫ్‌బీఐ, సింగపూర్‌, హిటాచి తదితర దేశాలు, సంస్థల్లో అమలు చేస్తున్న ఈ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాలను పరిశీలించి వచ్చి ఇప్పుడు వాటన్నిటికంటే మిన్నగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామని ఇది ప్రపంచంలోనే ప్రఖ్యాతమైనదిగా నిలుస్తుందన్నారు.  

}?.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...